BigTV English

GundeNinda GudiGantalu Today Episode : పూరి కోసం మీనాతో గొడవ పడ్డ ప్రభావతి.. రోహిణి గురించి బయటపడ్డ నిజం..

GundeNinda GudiGantalu Today Episode : పూరి కోసం మీనాతో గొడవ పడ్డ ప్రభావతి.. రోహిణి గురించి బయటపడ్డ నిజం..

Gundeninda GudiGantalu Today episode November 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాను బాలు ఇంటికి తీసుకొని వస్తాడు. మీనా సత్యం కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. నా తప్పు లేదు అని చెబుతుంది. ఇక మీనా శృతి తో మాట్లాడి పెళ్లిని వాయిదా చేసుకోమని చెప్పడానికే వెళ్లాను మామయ్య కానీ నన్ను బయట పెట్టి లోపల పెళ్లి చేసుకున్నాడు నేను లోపలికి వెళ్లి చూస్తే లోగా పెళ్లయిపోయింది అనేసి అంటుంది. కానీ బాలు మాత్రం వినడు. సాక్షి సంతకం పెట్టావా వీళ్ళ పెళ్లికి నేనే పెద్ద అని అక్కడే ఉన్నావా అంటాడు. సత్యం చెప్పడంతో బాలు పెట్టిన వస్తువులను చూసి ఈయన ఇక మారడు అనుకుంటూ ఆ వస్తువులను తీసి సర్దుతుంది. ఇంటి వాళ్లకి భారం కాకూడదు మేటినిటి వాళ్ళకి ఇకమీదట నా గురించి ఎటువంటి సమస్యలు రావద్దు అనేసి అనుకుంటుంది. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. భోజనం పెట్టమంటారా అని అడుగుతుంది. దానికి బాలు నేను తినేసి వచ్చాను అనేసి అంటాడు. మీరు నాతోనే ఉన్నారు కదా.. మరి భోజనం ఎప్పుడు చేశారు అంటుంది మీనా.. కోపం భోజనం మీద చూపించకండి అంటుంది. బాలు నేను నీ మీద ప్రేమతో ఇక్కడికి తీసుకురాలేదు మా నాన్న చెప్తే నేను ఇక్కడికి తీసుకు వచ్చాను అని మీనా తో అంటాడు. మన పరువు పోవడానికి నువ్వే కారణం అనేసి మీనా పై కోపంతో రగిలిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా సత్యంను టిఫిన్ చెయ్యండి అని అడుగుతుంది. ఇక అప్పుడే రోహిణి, ప్రభావతి లు కిందకు వస్తారు. దీన్ని వీడు తీసుకొచ్చి మంచి పని చేశాడు బండెడు చాకిరీ నాకు తగ్గింది అనేసి ప్రభావతి అంటుంది. దానికి రోహిణి కూడా అవును నిజమే అంటుంది. ఇక మీ కూతురు లాంటి కోడలు టిఫిన్ చేసింది వెళ్లి టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకుని ప్రభావతి అంటుంది. అప్పుడు రోహిణి కూడా టైం కి తిని టైం కి టాబ్లెట్ వేసుకోవాలి మావయ్య అని అంటుంది. పూరి కుర్మా చేసిందని ప్రభావతి అనగానే పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఆ మీనా అనేసి రోహిణి అంటుంది. నీ ఆయిల్ ఫుడ్ వల్లే మామయ్యకు హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అంటుంది. నేను మామయ్య కోసం ఇడ్లీ చేశాను అనగానే ప్రభావతికి రోహిణికి కౌంటర్లు వేస్తాడు సత్యం..

పూరి అంటే ఆయనకు ఇష్టం కదా అందుకే చేశాను అని మీనా అంటుంది.. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. నాకు ఇష్టమైనవి చేసిపెట్టమని నిన్ను అడిగానా అంటూ మీనాపై బాలు ఫైర్ అవుతాడు. చేసిన తప్పను మర్చిపోవాలని నిన్ను కూల్‌ చేయడానికి ఇవన్నీ చేస్తుందని మీనాపై చాడీలు చెబుతుంది ప్రభావతి. నువ్వు అందరికంటే ముదురు అన్న సంగతి మీ ఆవిడకు అర్థం కావడం లేదని ప్రభావతి అంటుంది. నాకు పూరి అంటే ఇష్టమే కానీ నీ చేతితో చేసిన పూరి మాత్రం తిననని బాలు అంటాడు. తండ్రి సర్ధిచెప్పిన వినడు. మా నాన్న ముందు మంచిదానిలా ఓవర్‌యాక్షన్ చేయకు అంటూ మీనాకు వార్నింగ్ ఇచ్చి తినకుండానే వెళ్లిపోతాడు. ఏంటి నీ ప్లాన్ చెడిపోయిందా అంటూ మీనాను దెప్పిపొడుస్తుంది ప్రభావతి. మనోజ్‌, ప్రభావతికి మీనా చేసినా పూరి తినాలని ఉన్నా.. ఆయిల్ ఫుడ్ అంటూ తినకుండా చేసేస్తుంది. బాలు తినకుండా వెళ్లడంతో మీనా బాధపడిపోతుంది. తాను కూడా తినకుండా వెళ్లబోతే సత్యం, మౌనిక ఆపేస్తారు..


ఇక బాలు రాజేష్ దగ్గరకు వెళ్తాడు. నాన్నను డిశ్చార్జ్ చేసారుగా బాగున్నాడా అని అంటాడు. ఇక నాన్న బాగున్నాడు ఆ వడ్డీ వ్యాపారి మాత్రం వడ్డీ కట్టలేదని పీడిస్తున్నాడు అని అంటాడు. వాడు ఏదో అన్నాడని వెనుక ముందు ఆలోచించకుండా కాలర్ పట్టుకున్నావని, ఇప్పుడు డబ్బుల కోసంతంటాలు పడుతున్నావని బాలుతో అతడి ఫ్రెండ్ రాజేష్ అంటాడు. నన్ను ఏమన్నా పడతానని, కానీ నాన్నను అంటే ఊరుకోనని బాలు స్నేహితుడికి సమాధానమిస్తాడు. ఈ కోపమే నీ కొంప ముంచుతుందని బాలును మందలిస్తాడు రాజేష్. కోపమే నీ వీక్నెస్ అని చెబుతాడు. ఏదో ఒకటి చేసి సేట్ డబ్బు వాడి ముఖంపై కొట్టి జీవితంలో వాడి ముఖం చూడనని బాలు ఛాలెంజ్ చేస్తాడు.. డాక్యుమెంట్స్ కూడా అడక్కుండా తనకు సాయం చేసినందుకు గణపతికి థాంక్స్ చెబుతాడు బాలు. తన దగ్గర ఉన్న కారు డాక్యుమెంట్స్ అతడికి ఇస్తాడు. చివరి సారిగా తన కారును నడిపి చూసుకుంటాడు బాలు. కారుతో తనకున్న అనుబంధం గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతాడు.. ఇక కారు పోయిన బాధలు బాలు పీకలదాకా తాగి వస్తాడు. నిద్రపోయాడని మీనా చెప్పగానే లోపలికివస్తాడు. మీనా అన్నం తినమని అంటుంది. నీ చేతితో ఏది ఇచ్చిన తిననని అంటాడు. నువ్వు పెట్టే అన్నం వద్దు, సున్నం వద్దని అంటాడు. నీ వల్లే మా నాన్న పోలీస్ స్టేషన్ వెళ్లాడు, నీ వల్లే నా నా కారు అమ్ముడుపోయిందని మీనాపై బాలు నిందలు వేస్తాడు. ఇంటి పత్రాలు మావయ్యకు ఇచ్చిన సంగతి నువ్వు చెప్పలేదు. ఏది చెప్పి చేయడం నీకు అలవాటు లేదుగా అంటూ మీనాపై తాగిన మత్తులో కోప్పడుతాడు. అన్నింటికి కారణం నువ్వేనని అంటాడు. బాలు మాటలతో మీనా బాధపడుతుంది..

ఇక పార్వతి ఫోన్ చేస్తే వెళ్లి మాట్లాడుతుంది. ఇక్కడి విషయాలు అక్కడికి చేరవేస్తున్నావా అంటూ కోడలిపై కోప్పడుతుంది. నువ్వు మీ అమ్మ కొంపలు కూల్చడంలో ఎక్స్‌పర్ట్ అంటూ అవమానిస్తుంది.రవిని ఇంటి నుంచి పంపించావు. మనోజ్‌, రోహిణి మధ్య గొడవలు సృష్టించి ఈ ఇంటిని మహారాణిలా ఎలాలని చూస్తున్న నీ కుట్రలు నేను ఉండగా ఫలించవని మీనాతో అంటుంది ప్రభావతి. మళ్లీ నిన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టే రోజు తప్పకుండా వస్తుందని, ఎందుకైనా మంచిది మూటముల్లే సిద్ధంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత రోజు టిఫిన్ ఏం చేస్తున్నావని మీనాను ప్రభావతి అడుగుతుంది. పూరి అనగానే వద్దు అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో కొరియర్ బాయ్ రూపంలో రోహిణి శత్రువు ఇంటికొస్తాడు. అతడిని చూసి రోహిణి కంగారు పడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతిని రోహిణి ఇంట్లోకి పంపిస్తుంది. ప్రభావతి ఇంట్లోకి వెళ్లగానే తనకు డబ్బు కావాలని రోహిణిని అతడు బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తన దగ్గర డబ్బు లేదని రోహిణి అంటుంది. నా దగ్గర నీ రహస్యం ఉంది అని చెబుతాడు. రోహిణిని కళ్యాణి అని పిలుస్తాడు. వారి మాటల్ని మొత్తం మీనా వింటుంది. అత్తయ్యతో నువ్వు చెప్తావా నేను చెప్పనా అని మీనా అంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×