E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నా తల్లి వచ్చేసింది.. మాధవ్ ఎమోషనల్.. నారాయణ సీరియస్..

Podarillu Today Episode : కన్నా తల్లి వచ్చేసింది.. మాధవ్ ఎమోషనల్.. నారాయణ సీరియస్..
Advertisement

Podarillu Today Episode October 9th : కేశవ ఈ షాప్ ని ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అప్పుడే తన అసిస్టెంట్ ఇంకొక కొద్దిరోజుల్లో నువ్వు ఈ షాప్ కి ఓనర్ కాబోతున్నావు. అందుకే ఓనర్ అన్నా అంటున్నాను అని అనగానే కేశవా లో లోపల సంతోష పడుతూ ఉంటాడు. కాకపోతే ఇంత డబ్బులు ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమోరా నాకు ఈ షాప్ కి కట్టాల్సిన డబ్బులు గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా భయమేస్తుంది అని అంటాడు. ఏది ఏమైనా సరే ఈ షాప్ నా సొంతం చేసుకోవాలి అప్పుడే నాకు ఒక విలువ ఉంటుంది నా పేరు మీద షాప్ ఉందని ఒక ధైర్యం ఉంటుంది అని కేశవ అంటూ ఉండగా అప్పుడే శైలు అక్కడికి వస్తుంది. ఈ షాపు అన్న పేరు మీద రాబోతుంది అని అనగానే ఇది ఏమైనా వరల్డ్ కప్ సాధించిన అంతగా ఫీల్ అవ్వాలా ఏంటి అంటూ శైలు ఒక్కసారిగా షాక్ఇస్తుంది. అయితే నేను ఈ షాప్ కి ఓనర్ అవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. ఓనర్ కాదు అసలు నువ్వు ఈ మెకానిక్ పనిని వదిలేయాలి అంటూ శైలు అనేసి వెళ్ళగానే కేశవ చాలా ఫీల్ అవుతాడు.

మహా, చక్రీ ఎంట్రీతో షాక్..

కన్న వాళ్ళ అమ్మ ఇంటికి అప్పుల వాళ్ళు రావడంతో తన భర్త తాగేసి పడుకొని ఇంట్లోని సామాన్లు అన్నిటిని బయటపడేసుకోండి అని చెప్పేస్తాడు. అయితే ఆవిడ నువ్వు అప్పుల వాళ్ళు వచ్చినా కూడా తాగే ఇలా పడుకొని ఉంటే ఏం చేయాలి నీ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో ఆలోచించవా అంటూ బాధ పడిపోతూ ఉంటుంది. నువ్వు ఇంకో ఇంటికి వెళ్లాలంటే అయితే నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలా ఇలా ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలి అని ఆమె అడుగుతుంది అయితే నేను వెళ్ళిపోతాను నువ్వు కూడా ఎక్కడ ఒకచోట బస్టాండ్లను ఉండిపో అనేసి అంటాడు. ఇక అప్పుడే మహాలక్ష్మి చక్రి సడన్గా ఎంట్రీ ఇచ్చి మీకు కన్నా తెలుసా మాధవ తెలుసా అని అడుగుతారు వీళ్ళు ఎవరో నాకు తెలియదు అని ఆవిడ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

కన్నా వాళ్ళ అమ్మను వచ్చేసింది..

Advertisement

చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా కన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి కన్నా గురించి అలాగే మాధవ్ గురించి గుర్తు చేసి తనని ఎలాగైనా సరే ఇంటికి తీసుకురావాలని అనుకుంటారు. అయితే ఆవిడకు గతం ఎంత చెప్పినా కూడా గుర్తుకు రాకపోవడంతో గతం మర్చిపోయారా ఏంటి అని చక్రి అంటాడు. నేను ఏ గతం మర్చిపోలేదండి.. లారీ డ్రైవర్ నారాయణ అనే పేరు చెప్పగానే ఒక్కసారిగా లేడీ కి గతం గుర్తుకొస్తుంది అవును వాడి ఇంటి ఉండేవాడు ఇప్పుడు ఇంత అయ్యాడా అని అడుగుతుంది. అయితే మా అన్నయ్య వాడిని పెంచి పెద్ద చేశాడు అని చక్రి చెప్తాడు.. మీరు కన్నా కోసమైనా రావాలి అని అనగానే నాకు ఇప్పుడు ఏ గతి లేదు వీళ్ళతో పాటు వెళ్తే నేను నాకు మంచి జరుగుతుంది అని ఆవిడ ఫిక్స్ అయ్యి వస్తాను అని అంటుంది.

నిజం దాచిన మాధవ్..

మాధవ్ కన్నా ఇన్ని రోజులు తన తల్లి కోసం వెయిట్ చేసాడు కదా.. ఇప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది కదా వాడు చాలా సంతోషంగా ఉంటాడేమో అని మాధవ్ అనుకుంటూ ఉంటాడు. అలాగే మహాలక్ష్మి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. చక్రి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత నుంచి ఈ ఇంట్లో మంచి రోజులు వచ్చాయి అని అనిపిస్తుంది. అన్నయ్య ఇప్పుడు వాళ్ళ అమ్మ వస్తే కన్నా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు కదా మరి వాడికి నిజాన్ని చెప్పకుండా ఒకేసారి సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే కన్నా ఇంట్లోకి వస్తాడు. కన్నా ఇంట్లోకి రాగానే నీ షర్టు ఏమీ బాగోలేదు నువ్వు వెంటనే వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి రారా నువ్వు అస్సలు బాగోలేదు అని చెప్పగానే ఏంటి మీరిద్దరూ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తాడు.. అయితే వీళ్ళిద్దరూ ఎందుకు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని కన్నా చాలా బాధపడిపోతూ ఉంటాడు.

మాధవ్ వెయిటింగ్..

Advertisement

మహాలక్ష్మి కన్న వాళ్ళ అమ్మని తీసుకొని వస్తున్నాము అని చెప్పగానే.. మాధవ్తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఎయిట్ చేస్తూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చినా కన్నా వాళ్ళ అమ్మని చూసి నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మాధవ్ కన్నా వాళ్ళ అమ్మ వచ్చేసిందని చాలా సంతోషంగా ఉంటాడు. నారాయణ మంత్రం ఎవరు వస్తున్నారు అంతగా ఎదురుచూస్తున్నారు అని అంటూ ఉంటాడు. అయితే అప్పుడే ఒక కారు వచ్చి ఆగిన కనిపిస్తుంది. అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు రావడం చూసినా నారాయణ ఎవరు ఆ లేడీ అని చూస్తూ ఉంటాడు. దగ్గరికి రావడంతో కన్నా వాళ్ళ అమ్మ లాగా కనిపించడంతో ఒక్కసారిగా సీరియస్ అయ్యి అలానే నిలుచునుని ఉండిపోతాడు. ఆమెను చూడగానే ఒక్కసారిగా నారాయణ కట్టెలు తెచ్చుకోలేని కోపాన్ని తెచ్చుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్లో నారాయణ అసలు నిజం బయటపెడతాడా లేదా అన్నది చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దెబ్బ కొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్            

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 14 స్ట్రీమింగ్..!

Ninnu kori Serial Today Episode October 9th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ గురించి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన చంద్ర 

Friday Tv Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…

సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

Big Stories

Advertisement
×