E-Paper
Advertisement

తగ్గేది లేదంటున్న పసిడి, మదుపరుల చూపుతో పైపైకి పరుగులు, మార్కెట్లో ధరల మాటేంటి?

తగ్గేది లేదంటున్న పసిడి, మదుపరుల చూపుతో పైపైకి పరుగులు, మార్కెట్లో ధరల మాటేంటి?
Advertisement

Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి జోరు మొదలైంది. కొన్నాళ్లు ఒక రోజు పెరిగితే నాలుగు విలువైన లోహాల ధరలు పతనం అయ్యేవి. బలహీనపడిన డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం వంటి పరిణామాలు ఈ లోహాలపై పడింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. శుక్రవారం బంగారం-వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారు-వెండి ధరలకు రెక్కలు

గోల్డ్ డౌన్ ఫాల్‌కు దాదాపుగా బ్రేకులు పడ్డాయి. పెట్టుబడిదారులు విలువైన లోహాల వైపు దృష్టి సారించారు. ఫలితంగా బంగారం-వెండి ధరలు పెరగడం మొదలైంది. అమెరికా డాలర్ తగ్గుదల, అమెరికన్ ట్రెజరీ ఈల్డ్స్ జోరు మందగించడం వంటి కారణంలో మదుపరులు విలువైన లోహాలపై ఫోకస్ చేశారు. బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల యూఎస్ ట్రెజరీ ఈల్డ్ వరుసగా రెండో సెషన్‌లో క్షీణించి బంగారానికి మద్దతునిచ్చింది. దీంతో క్రమంగా ధరలు పెరుగుతున్నాయి.

డాలర్ వీక్.. బ్రాండ్స్ జోరు లేకపోవడంతో బంగారంపై చూపు

Advertisement

అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్వారా ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తుందనే అంచనాలు, నిరంతర ద్రవ్యోల్బణ ఆందోళనలు లాభాలను పరిమితం చేయవచ్చని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు క్రమంగా పెరగడం మొదలైంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 4197 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. మునుపటి ముగింపు ధర కంటే 40 డాలర్లు పెరిగింది. అంటే 0.96 శాతం పెరిగింది. ఇంట్రాడేలో గరిష్టంగా ఔన్సుకు 4199 కాగా, కనిష్టంగా ఔన్సుకు 4156 డాలర్ల వద్ద తాకింది.

దేశీయ మార్కెట్లో ధరలు పరిశీలిద్దాం

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బులియన్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,560 గా కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి రూ.1,37,090 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2,44,900 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.

Advertisement

ALSO READ: ఇండియన్ ఐటీ కంపెనీలపై అమెరికా కొరడా.. గ్రీన్ కార్డ్ PERM ప్రాసెస్ నిలిపివేత! టెక్కీలకు కోలుకోలేని దెబ్బ

ఢిల్లీలో 24 కె బంగారం 10 గ్రాములు ధర రూ.1,49,690 ఉండగా, 22 కె 10 గ్రాముల రేటు 1,37,240 వద్ద ఉంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కత్తా కాస్త రూ.100 లకు అటుఇటుగా నడుస్తోంది. చెన్నైలో దాదాపు ఢిల్లీ స్థాయి ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,34,900గా కొనసాగుతోంది. పండగ సీజన్‌ మొదలుకావడంతో కొనుగోళ్లు జోరందుకునే అవకాశం ఉందని ట్రేడర్లు చెబుతున్నారు.

Related News

నెలకు రూ.2,000 SIP పెట్టబడితో రూ.10 లక్షల కార్పస్.. ఇలా చేస్తే సాధ్యమే?

ఇండియన్ ఐటీ కంపెనీలపై అమెరికా కొరడా.. గ్రీన్ కార్డ్ PERM ప్రాసెస్ నిలిపివేత! టెక్కీలకు కోలుకోలేని దెబ్బ

యూపీఐ లావాదేవీల వ్యవహారం.. సంక్రాంతి తర్వాతే అంటున్న ట్రేడర్లు, ఆలోచనలో ఎన్‌పీసీఐ

ఇంట్లో పనిమనిషిగా చేయడానికైనా రెడీ అంటున్న ఐఐటీ గ్రాడ్యుయేట్.. చేతిలో పెద్ద డిగ్రీ ఉన్నా ఇదీ దుస్థితి

రెపో రేటు పెంచిన రిజర్వ్ బ్యాంక్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయా?

వడ్డీ రేట్లు పెంపు ప్రభావం.. బంగారం ధరలు హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు ఎంత?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఝలక్.. ఆ జాబితా నుంచి పూర్తిగా తొలగింపు, ఆర్బీఐ నిర్ణయం వెనుక..

Big Stories

Advertisement
×