Gundeninda GudiGantalu Today episode October 4th : ప్రభావతి సడన్ గా ఎంట్రీ ఇవ్వడంతో అటు రోహిణి ఇటు కామాక్షి ఒక్కసారిగా కంగారు పడిపోతుంటారు. ఏంటి వదిన చడి చప్పుడు లేకుండా వచ్చేసావు అని కామాక్షి అడుగుతుంది సరేగాని ముందు ఆటో వాడికి రూ. 50 ఇవ్వు నా దగ్గర చిల్లర లేవు అని కామాక్షి అంటుంది. ఎప్పుడు లెండి సడన్గా ప్రభావతి కామాక్షి ప్రవర్తన చూసి అనుమాన పడుతుంది. బెడ్రూంలో ఏమంత దాచిపెట్టింది. అంత సీక్రెట్ గా వెళ్లి డబ్బులు తీసుకుని వస్తుంది అని అనుకుంటుంది. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా.. వదినా బెడ్రూంలో వేసి వేసుకుని కూర్చుందాం పద అనేసి ప్రభావతి అడుగుతుంది. బెడ్రూంలో ఏసీ పనిచేయట్లేదు వదిన పాత ఏసి కదా అని కామాక్షి మేనేజ్ చేస్తుంది అయితే మనోజ్ని రోహిణి విడగొట్టేందుకు ప్రభావతి ఒక ప్లాన్ చేస్తుంది.. అది కామాక్షికి చెప్తుంది రోహిణి అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది..
కామాక్షి ఇంట్లో రోహిణి ఉందన్న విషయాన్ని ప్రభావతికి తెలియక తాయత్తు గురించి మాట్లాడేస్తుంది. అయితే కామాక్షి తర్వాత మాట్లాడదాం అని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా ప్రభావతి వాళ్ళిద్దర్నీ ఎలాగైనా విడగొట్టాలి.. ఆ తాయత్తు గురించి కనుక్కో అపాయింట్మెంట్ తీసుకో మనం వెళ్దాము అని అంటుంది. అయితే కామాక్షి ఏంటి ప్రభావతి వదిన ఎలా మారిపోయింది. డబ్బుల కోసం ఇంతగా మారిపోవాలా ఒక జంటని విడగొట్టాలి అనుకోవడం పాపం కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి బయటకు వస్తుంది. చూశారా పిన్ని మా ఇద్దరిని విడగొట్టడానికి అత్తయ్య ఇలాంటి ప్లాన్లు వేస్తుందో.. కానీ మనోజ్ కి దూరమై నేను బ్రతకలేను మీరే ఏదో ఒకటి చేసేయ్ మా ఇద్దరినీ కలపాలి.. అంటూ రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అది చూసిన కామాక్షి ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదమ్మా మీ అత్తయ్య ని అడిగి మనోజ్ కి దగ్గర అవ్వాల్సింది తప్ప అని అంటుంది.
అత్తయ్య మనసులో ఇంత ఉందని నాకు అర్థం కాలేదు. ఎలాగైనా సరే మా ఇద్దరిని విడగొట్టాలి అని చూస్తుంది.. మనోజ్ లేకుండా ఉంటే నేను అస్సలు బతకలేను అంటూ రోహిణి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అత్త ఈ ప్లాన్ వర్క్ అవ్వకుండా చేయాలి మనోజ్ ని నా సొంతం చేసుకోవాలి అంటూ రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. నేనే శృతి చెప్పినట్లుగా ఒక స్వామీజీని క్రియేట్ చేసి రోహిణి గ్రేట్ అని అనిపించాలి లేదంటే మాత్రం నాకు ఇంట్లోనే కాదు మనసుని కూడా నాకు శాశ్వతంగా దూరం చేస్తుంది అని బాధ పడిపోతూ ఉంటుంది. మనోజ్ కోసమే నేను ఇన్ని అబద్ధాలు ఆడను కాబట్టి మనోజ్ ని ఎలాగైనా సరే.. నా సొంతం చేసుకోవాలి అని రోహిణి మనోజ్ ని తన వైపు తిప్పుకునేందుకు మరో ప్లాన్ చేస్తుంది. తన విషయం గురించి విద్యతో కూడా చెప్పాలని ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎలాగైనా గట్టెక్కేలా చేసుకోవాలి లేదంటే మాత్రం నాకు మనోజ్ దూరం అయిపోతాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి..
కామాక్షిని ప్రభావతి ఒక స్వామీజీ దగ్గరికి వెళుతుంది. నా కొడుకు కోడల్ని విడగొట్టాలి ఒక తాయత్తు నాకు ఇవ్వండి అని అడుగుతుంది. ఎవరైనా కలపాలని చూస్తారు మీరేంటి విడగొట్టాలని చూస్తున్నారు అని అక్కడున్న స్వామీజీ కూడా అడుగుతాడు. అయితే ప్రభావతి మాత్రం నా కోడలు చేసిన మోసాలు అంతా ఇంతా కాదు నమ్మించి అరచేతిలో మలేషియాని చూపించింది. ఇప్పుడు అలాంటి మోసగా ఇస్తే నాకు కొడుకు జీవితంలో ఉండడానికి వీల్లేదు అని ప్రభావతి అంటుంది. ఈ మహిమగల తాయత్తును తీసుకుని వెళ్లి మీ కొడుకుకి కడితే మీ కోడలు వైపు కన్నెత్తి కూడా చూడడు అని స్వామీజీ చెప్పగానే ప్రభావతి చాలా సంతోషంగా తాయత్తును తీసుకుని వచ్చి పూజ గదిలో పూజ చేసి అక్కడ పెడుతుంది.
ఇక ఒక తాయత్తును తీసుకొని వచ్చిన ప్రభావతి పూజ గదిలో పెట్టి మనోజ్ రోహిణిలు దూరం అవ్వాలి అని ముక్కుని పూజ చేస్తుంది. అయితే ఆ తాయత్తును చూస్తున్న బాలు అమ్మవతి ఇంత ప్రేమగా తాయత్తు తెచ్చింది అంటే.. అది ఖచ్చితంగా నాన్న కోసమే ఉంటుంది అని బాలు ఆ తాయత్తును కట్టేందుకు ప్రయత్నాలు చేస్తాడు. నాన్న ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువ ప్రేమగా చూసుకునేది నిన్ను మాత్రమే నీకోసం అమ్మ తాయత్తు తెచ్చింది. ఇది కట్టుకొని అని చెప్తూ ఉండగానే ప్రభావతి వద్దు అని అంటుంది. బాలు మాత్రం మంచి పనే కదా ఎందుకు వద్దంటున్నావు అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..