BigTV English

GudiGantalu Today episode: పార్వతిని దారుణంగా అవమానించిన ప్రభావతి..మీనాకు రోహిణికి వార్నింగ్.. షీలా ఎంట్రీ..

GudiGantalu Today episode: పార్వతిని దారుణంగా అవమానించిన ప్రభావతి..మీనాకు రోహిణికి వార్నింగ్.. షీలా ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode September 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే ప్రభావతి మీనా పై అరుస్తుంది. ఏం వంట చేస్తున్నావ్ అని అడుగుతుంది. నువ్వు ఏ చేయాలనుకుంటే అది కాదు అందరూ ఏ తింటే అది చెయ్యి అని మీ నాపై అరుస్తుంది. బాలు అక్కడికి వచ్చి తలకాయ కూర మెదడు కూర ఇలాంటిదే ఏమీ వద్దు అని అడుగుతాడు. అయితే నాకు ఆ మెదడు లేదు కదమ్మా నువ్వే తినేసావు కదా అని అంటాడు.. దానికి ప్రభావతి నువ్వు ఆపరా ఇంతకీ నేను ఏం చెప్తున్నాను పానకంలో పుడకలాక విడొచ్చాడు అంతా మర్చిపోయిన అని అంటుంది.


అప్పుడే మనోజ్ వస్తాడు. వీరిద్దరూ ఏం తినాలి అనిపిస్తే అది చెప్పండి అమ్మ చేస్తుంది అని అంటుంది ప్రభావతి. వీళ్ళు ఏం పని చేస్తున్నారు అని బాలు సెటైర్లు వేస్తాడు.. అయితే రోహిణి వెజిటేబుల్ బిర్యాని కావాలని ఆర్డర్ వేస్తుంది.. అవన్నీ కావాలంటే ముందు కూరగాయలు కావాలి ఇంట్లో ఉన్నది కేవలం సొరకాయ మాత్రమే అని మీనా అంటుంది. అయితే బాలుని కూరగాయలు తీసుకు రమ్మని ప్రభావతి అంటుంది. బిర్యాని అని అడిగింది ఎవరు అని బాలు అంటాడు. మనోజ్ కూరగాయలు తీసుకొని వస్తాడు. అంత రేటు పెట్టావా అని రోహిణి కూడా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనాని ఓదార్చే పనిలో వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలను గుర్తుచేస్తుంది మీనా. ఇక అప్పుడే ప్రభావతి మీనాపై అరుస్తూ కేకలు వేస్తుంది.. మీనాని ప్రభావతి పిలుస్తున్న సమయంలోనే పార్వతి ఇంటికి వస్తుంది.  రేపు బాలు మీనాల పెళ్లిరోజు కదా బట్టలు పెడదామని వచ్చానని అంటుంది. ఆ మాట వినగానే నువ్వు ఎందుకు వచ్చావు అమ్మ ఇక్కడికి అని మీనా అంటుంది. రేపు మీ పెళ్లి రోజు కదమ్మా అందుకే మీకు బట్టలు పెడదామని వచ్చానని పార్వతి అంటుంది. ఒక ప్లేట్ తీసుకురమ్మని పార్వతి మీనా తో అంటుంది.


ఆ బట్టల్ని చూసినా ప్రభావతి 50 తులాలు బంగారం ఏమైనా తెచ్చారేమో అనుకున్నా అని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతుంది.. ఏదో మాకు ఉన్నంతలో తెచ్చానమ్మా గుడి ముందర అడుక్కోకుండా గుడి దగ్గర షాప్ పెట్టుకొని వచ్చిన డబ్బులతో తీసుకొచ్చాను అని పార్వతి అంటుంది. మా పెద్ద కోడలు వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించారు మీరేం తెచ్చారు అని ప్రభావతి మాటకు మాట సమాధానం చెబుతూ ఉంటుంది. వాళ్ల జైల్లో ఉన్నాడని విన్నాను మరి అంత డబ్బులు ఎలా పంపించారు అని అడుగుతుంది పార్వతి.

ఇక బట్టలు పెట్టిన తర్వాత రోహిణికి నాకు తెలుసు నాకు గుడి ఉంది అక్కడ పూజ చేస్తే మీ నాన్న వెంటనే జైలు నుంచి బయటికి వస్తాడు అమ్మ అని అంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి రెచ్చిపోతుంది. నిన్ను ఇంట్లోకి రానివ్వడమే గొప్ప అలాంటిది వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉండాలి ఇలా సలహాలు ఇవ్వకూడదని అవమానిస్తుంది. ఏదో నాకు తోచింది చెప్పానమ్మా బాధపడితే నన్ను క్షమించు అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మా అమ్మని ఇక్కడికి రావద్దు అని చెప్పినా వస్తుంది అనే మీనా బాధపడి వెళ్తుంది.

బాలు లోపల ఉంటే మీనా లోపలికి వెళ్లడం చూసిన ప్రభావతి లోపల నేను అన్న విషయాన్ని వీడికి చెప్తుందో ఏంటో అని బయట గుమ్మం దగ్గర చాటుగా నిలబడి వింటుంది. లోపలికి వెళ్ళగానే మీనా ఈ షర్ట్ చాలా బాగుందండి మీకు ఈ కలర్ చాలా బాగుంటుంది అని మాట్లాడుతుంది. రేపు మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేసి రావాలి అని అడుగుతుంది. రావాలని ఉన్న కూడా అక్కడ వాడు ఉండడం వల్ల నాకు రావాలని లేదు మీనా అని అంటాడు. వాడు తప్పు చేస్తే క్షమించాల్సింది మీరే.. రేపు మనం వెళ్తున్నాం అని మీనా అంటుంది. ఇక మీనా బయటికి రావడంతో అక్కడ ప్రభావతి ఉంటుంది.

ఆగండి నేను మీ గురించి ఏమీ మీ అబ్బాయి చెప్పి ఇంట్లో గొడవలు పెట్టాలని చూడను లేండి మీరేం టెన్షన్ పడకండి అని మీనా అంటుంది. ఇక అప్పుడే ఇంట్లోకి సుశీల వస్తుంది. సుశీలను చూసి అందరూ సంతోషపడతారు. ఎన్నాళ్లయింది మిమ్మల్ని చూసి అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ప్రభావతి మాత్రం ఎందుకు వచ్చిందా అని అడుగుతుంది. రేపు నా మనవడు మనవరాలు పెళ్లిరోజు కదా గ్రాండ్ గా చేయాలి అని అంటుంది సుశీల. ప్రభావతి మాత్రం ఏంటి ఫంక్షన్ హాల్ అంత డబ్బులు మా దగ్గర ఉన్నాయి మీరు అనుకుంటున్నారా అని అంటుంది. కూలికి వెళ్లే వాళ్ళు కూడా పెళ్లి రోజుని గొప్పగా జరుపుకుంటారు. మనము ఉన్నంతలో ఫంక్షన్ చేద్దామని అంటుంది.

Also Read : చెంబు కోసం శ్రీవల్లి ప్లాన్.. దొంగగా మారిన ధీరజ్.. ప్రేమకు కళ్యాణ్ షాక్..

అందరూ మీనా బాలుల ఫంక్షన్ కోసం రెడీగా ఉంటారు. అందరూ ఉన్నారు సరే మౌనిక కూడా ఉంటే బాగుంటుందని సుశీల అంటుంది. మౌనికొస్తే ఏదైనా గొడవ చేస్తారేమో అని టెన్షన్ పడుతుంది మీనా. ప్రభావతి మౌనికకు ఫోన్ చేస్తే సుశీల మాట్లాడుతుంది. సుశీల మౌనిక వాళ్ళ అత్తతో మాట్లాడి వాళ్ళని పంపించండి అమ్మ అని అడుగుతుంది. వాళ్ళ అత్తయ్య పంపిస్తానండి అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మౌనిక వాళ్ల పుట్టింటికి సంజయ్ తో కలిసి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: బయటకొచ్చిన శ్రీకర్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవనికి నిజం తెలుస్తుందా..?

Nindu Noorella Saavasam Serial Today September 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు షాక్‌ ఇచ్చిన రణవీర్

Brahmamudi Serial Today September 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు నిజం చెప్పిన కావ్య – కోపంతో రగిలిపోయిన రాజ్‌

Illu Illalu Pillalu Today Episode: చెంబు కోసం శ్రీవల్లి ప్లాన్.. దొంగగా మారిన ధీరజ్.. ప్రేమకు కళ్యాణ్ షాక్..

Tv Serial Actress : టీవీ సీరియల్ యాక్టర్స్ భర్తలు ఏం చేస్తుంటారో తెలుసా..?

Big Stories

×