E-Paper
Advertisement

జబర్దస్త్ షో నుంచి రోజాను తప్పించారా? నిజం ఆమె మాటల్లోనే!

జబర్దస్త్ షో నుంచి రోజాను తప్పించారా? నిజం ఆమె మాటల్లోనే!
Advertisement

Jabardasth Roja: ఆర్కే రోజా.. సీనియర్ హీరోయిన్ గా ఎంతోమంది తెలుగు, తమిళ్ స్టార్ హీరోలతో నటించి ఊహించని పాపులారిటీ అందుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, అత్త పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటూనే.. మరొకవైపు జబర్దస్త్ వంటి కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించి మరింత పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి రోజా కెరియర్ పీక్స్ లో ఉండగానే రాజకీయ రంగ ప్రవేశం చేసి, మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాజీ మంత్రిగా కొనసాగుతున్న ఈమె మరొకవైపు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తున్నారు. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ తో కలిసి డ్రామా జూనియర్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరించి, మరింత పాపులారిటీ అందుకున్నారు రోజా.

నన్ను షో నుంచి తీసేయమని ప్రొడ్యూసర్స్ పై ఒత్తిడి తెచ్చారు – రోజా..

ఇటీవల ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకున్నారు ఆమె.. అందులో భాగంగానే జబర్దస్త్ చేస్తున్నప్పుడు షో టి ఆర్ పి రేటింగ్ అమాంతం పెరిగిపోయిందని, ఆ సమయంలో తనను జబర్దస్త్ నుండి తీసేయమని ప్రొడ్యూసర్స్ పై ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ రోజా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.. “రోజా ఉందంటే ఆ షో కానీ ఆ ఈవెంట్ కానీ సక్సెస్ అయ్యింది. అంత మంచి పేరు తెచ్చుకుంటే.. అది కూడా వాళ్లకు బాధే.. మరి దాంట్లో ప్రొడ్యూసర్స్ మీద ప్రెజర్ పెట్టి నన్ను తీయించేయాలని ఎంతో ట్రై చేశారు.

నా అభివృద్ధిని ఓర్వలేకపోయారు..

Advertisement

నేను ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యాకే రాజకీయాల్లోకి వెళ్లాను. అందరూ నన్ను ఆర్టిస్ట్ గా ఇష్టపడేటప్పుడు దాన్ని వదులుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. పైగా నటనను వదులుకోమని జగన్ గారు కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ చెప్పి ఉండుంటే.. ఆ సమయంలో నేను ఏదైనా ఆలోచించి ఉండేదాన్నేమో. అయితే ఆ సమయంలో నేను పొలిటికల్ గా అధికారంలో ఉన్నప్పటికీ , మరొకవైపు జబర్దస్త్ షోలో చేస్తున్నప్పుడు చాలామంది అన్నకు చెప్పారు.. అవసరమా సార్ అని.. మరికొంతమంది సోషల్ మీడియాలో ఏకంగా బూత్ షో చేస్తోంది అంటూ కామెంట్లు పెట్టారు.. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ నేనే.. నేను చేస్తున్నప్పుడే అది బూతు షో.. ఇప్పుడు నాగబాబు చేస్తున్నారు.. మరి బూత్ షో కాదా..

also read: ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్!

ఇప్పుడు జబర్దస్త్ ను ఫ్యామిలీలు చూడగలవా?

Advertisement

షో సక్సెస్ అయ్యి, విపరీతమైన టీఆర్పీ రేటింగ్ వచ్చింది. నాకు విపరీతమైన పేరు వచ్చింది. దాన్ని ఓర్వలేక అది ఒక బూతు షో అని వీళ్ళు ప్రచారం చేశారు. పైగా ఇదేమైనా జబర్దస్త్ అనుకున్నారా? అని అసెంబ్లీలో ప్రచారం చేయడం.. మరి ఈరోజు ఆ పేరు ఎవరు ఎత్తడం లేదు. ఆరోజు చాలా బాగుండేది.. ఫ్యామిలీస్ కూడా చూసేవి. కానీ ఇప్పుడు జబర్దస్త్ ఎలా ఉంది? అన్నీ వల్గర్ కామెంట్స్.. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడరు.. ఎందుకంటే రోజా లేదు కదా.. రోజా ఉంటే రోజా టార్గెట్ అయ్యేది” అంటూ అసలు విషయాన్ని చెప్పారు రోజా. మొత్తానికైతే జబర్దస్త్ షోలో ఆమె పాపులారిటీని ఓర్వలేకే ఆ షో ప్రొడ్యూసర్స్ పై ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్!

బిగ్ బాస్ 10 కొత్త కెప్టెన్ గా ముఖేష్.. ఆమెకు స్పెషల్ బెనిఫిట్స్?

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు గుడ్ బై..

సీరియల్ నటి ఐశ్వర్య  ప్రేమలో పడిందా..? ఇదేం ట్విస్ట్ మావా..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు సపోర్ట్ గా కామాక్షి.. మీనాకు నిజం చెప్పిన సుమతి.. అరుణ్ మాటతో ఫుల్ హ్యాపీ..

Podarillu Today Episode : గోపిక మాటతో చక్రీ షాక్.. మహా మాటతో షాక్.. గోపికను అవైడ్ చేసిన చక్రీ..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం టెన్షన్.. వల్లికి షాక్.. ప్రేమ, ధీరజ్ కు శాశ్వతంగా దూరం..?

Big Stories

Advertisement
×