E-Paper
Advertisement

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో..ప్రీమియం మొబైళ్లపై భారీ డిస్కౌంట్లు!

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో..ప్రీమియం మొబైళ్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement

Flipkart sale smartphone offers: స్మార్ట్‌ ఫోన్‌ను మార్చాలని లేదా సరి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనాలని చూస్తున్న వారికి.. ఇదే సరైన సమయం. ఎందుకంటే దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం.. ఫ్లిప్‌కార్ట్ త్వరలో.. నిర్వహించబోయే ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సేల్ అక్టోబర్ 9 నుంచి అందరికీ అందుబాటులోకి రానుండగా.. ఫ్లిప్ కార్ట్ ప్లస్ , బ్లాక్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే.. అంటే అక్టోబర్ 8 నుంచి ఎర్లీ యాక్సెస్ లభించనుంది. ముఖ్యంగా.. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ప్రీమియం స్మార్ట్‌ ఫోన్ల ధరలు భారీగా తగ్గుతుండటంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

యాపిల్ ఐఫోన్ 17 పై భారీ తగ్గింపు:

ప్రతి ఏడాది బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో.. ఐఫోన్ డీల్స్ కోసం జనాలు ఎగబడుతుంటారు. ఈసారి కూడా యాపిల్ లేటెస్ట్ మోడల్ అయిన ‘ఐఫోన్ 17’ పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించేందుకు.. ఫ్లిప్‌ కార్ట్ సిద్ధమైంది. ఐఫోన్ 17 లాంచ్ సమయంలో.. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుత సేల్ టీజర్స్ ప్రకారం ఇది సుమారు రూ.80,000 లోపు ధరలోనే లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివిధ బ్యాంక్ ఆఫర్లు , ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కలిపి ఈ ధర మరింత తగ్గే ఛాన్స్ ఉంది. గతంలో ఐఫోన్ ధరలు పెరిగినప్పటికీ.. ఈ సేల్ ద్వారా కస్టమర్లు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 & ఎస్25 ఎఫ్ఈ:

Advertisement

శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను ఇష్ట పడే వారికి ఫ్లిప్‌ కార్ట్ పెద్ద సర్ప్రైజ్ ఇస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ మోడళ్లు ఈ సేల్‌లో ప్రత్యేక ధరలతో అందుబాటులోకి రానున్నాయి. లీకైన వివరాల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 మోడల్ రూ. 60,000 కంటే తక్కువ ధరకే.. లభించే అవకాశం ఉంది.అలాగే ఎస్25 ఎఫ్ఈ మోడల్ రూ.50,000 లోపు ధరలో దొరకొచ్చు. సాధారణ ధరలతో ..పోలిస్తే ఈ మోడళ్లపై దాదాపు రూ.10,000 వరకు ఆదా చేసుకునే అద్భుతమైన అవకాశం దక్కుతుంది.

గూగుల్ పిక్సెల్ 11:

కెమెరా , స్టాక్ ఆండ్రాయిడ్ లవర్స్ ను ఆకట్టుకునేలా.. గూగుల్ పిక్సెల్ సిరీస్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన పవర్ ఫుల్ ఫీచర్లు కలిగిన గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్‌ ఫోన్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫ్లిప్‌ కార్ట్ లైవ్ ఈవెంట్స్ , ఎర్లీ డీల్స్ ద్వారా పిక్సెల్ 11 ధర సుమారు రూ.69,999 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అద్భుతమైన కెమెరా, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

Advertisement

Also Read: ఫెస్టివల్ సేల్స్‌లో మోసపోకండి..ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ఈ విషయాలు మర్చిపోవద్దు!

బ్యాంక్ ఆఫర్లు:

కేవలం మొబైల్స్ మీదే కాకుండా.. చెల్లింపుల సమయంలోనూ.. అదనపు ఆదా చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా కొనే వారికి ఇన్‌స్టెంట్ డిస్కౌంట్‌గా.. అదనంగా 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా.. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, పాత ఫోన్లపై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంటాయి.

మొత్తంగా చూస్తే.. ఈ ఏడాది ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొబైల్ కస్టమర్లకు ఒక పండగలా మారనుంది. మీరు గనక ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 లేదా గూగుల్ పిక్సెల్ 11 కొనాలని భావిస్తుంటే, అక్టోబర్ 8, 9 తేదీల కోసం సిద్ధంగా ఉండండి. మీ డ్రీమ్ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే ఈ గోల్డెన్ ఛాన్స్‌ను అస్సలు మిస్ కావద్దు!

Related News

తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా? అయితే ఈ మోడల్ మీకు తప్పకుండా నచ్చుతుంది !

MP3 పాటల్లోనూ HD సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.. రూపాయి ఖర్చు లేని 5 ట్రిక్స్ ఇవే!

రూ.3,000 బడ్జెట్‌లో వావ్ అనిపించే ANC ఇయర్‌బడ్స్.. సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ నెక్ట్స్ లెవెల్!

అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవే!

జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!

మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

Big Stories

Advertisement
×