E-Paper
Advertisement

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత
Advertisement

Kavitha: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున పోటీలో దిగుతున్నామని పార్టీ అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అవన్నీ ఉత్త మాటలే.. చేతలు శూన్యం

Advertisement

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని కవిత విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై ఇన్నాళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని, చేతల్లో శూన్యం అని ఆమె మండిపడ్డారు.

డ్రామాలు తప్ప చర్యలు ఉండవు

Advertisement

ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరలేపిందని కవిత ఆరోపించారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ వివాదం వెనుక అసలు నిజాలు వేరే ఉన్నాయని, ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న నాటకమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఒప్పందం..

కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, వార్తల్లో నిలవడానికి ప్రకటనలు ఇవ్వడం తప్ప ఫామ్‌హౌస్‌పై ఎలాంటి నిజమైన చర్యలు ఉండవని ఆమె ఎద్దేవా చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి తీరతామని ఈ సందర్భంగా వెల్లడించారు.

Also Read: జ్ఞానేశ్వర్ కుమార్ లేకపోతే బీజేపీకి 200 సీట్లు కూడా రావు: సత్యం శ్రీరంగం ఫైర్

Tags

Related News

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, దంపతుల మృతి

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

Big Stories

Advertisement
×