Actor Srikanth: మెజీషియన్ గా తన కెరియర్ మొదలుపెట్టి.. జబర్దస్త్ (Jabardasth) కామెడీ షోలోకి కమెడియన్ గా అడుగు పెట్టాక ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). ఇక్కడ స్క్రిప్ట్ రైటర్ గా పనిచేస్తూనే.. కమెడియన్ గా అలరిస్తూ.. తన అద్భుతమైన కామిడీ టైమింగ్ తో జడ్జెస్ ను మెప్పిస్తూ.. అనతి కాలంలోనే టీం లీడర్ గా పేరు సంపాదించుకున్నారు. తన స్నేహితులైన ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad), గెటప్ శ్రీను(Getup Srinu) లతో కలిసి స్కిట్లు చేస్తూ అందరిని ఆకట్టుకున్న సుధీర్.. అనూహ్యంగా జబర్దస్త్ కి దూరమై.. హీరోగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నారు. రెండు చిత్రాలు చేశారు కానీ అవేవీ ఈయనకు పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇప్పుడు మరో సినిమాతో హీరోగా రాబోతున్నారు.
మరొకవైపు కొన్ని షోలకు హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ తో పాటు డ్రామా జూనియర్స్ సీజన్ 9కి కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో సుధీర్ పై హీరో శ్రీకాంత్ మండిపడుతున్న ప్రోమో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. డ్రామా జూనియర్స్ సీజన్ 9 షో విషయానికి వస్తే.. చిన్నపిల్లలు స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఈ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ హీరోయిన్ రోజా(Roja ) డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) , హీరో శ్రీకాంత్ (Hero Srikanth) జడ్జెస్ గా వ్యవహరిస్తుండగా సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో శ్రీకాంత్ ను ఆటపట్టిస్తూ.. “ఏంటన్న అసలు.. మామూలు కాదన్న నీ రేంజ్..అసలు మామూలుగా ఉండదు నీతో.. ఎప్పుడు చూడు చిన్న పిల్లాడిలా ఆ ముఖంపై నవ్వు చెరిగిపోదు అంటూ ఆయనను తోసేస్తూ..లాగుతూ చిన్న పిల్లాడిలా ప్రవర్తించాడు. దీంతో శ్రీకాంత్ ఒక్కసారిగా కళ్ళజోడు తీసి.. కోపంగా “హే.. చెయ్ వదులు.. హీరోగా కనిపించట్లేదా నీకు.. ఈ ఆట పట్టింపులు ఏంటి.. కొంచెం తగ్గు ..ఎక్స్ట్రాలు చేయకు.”. అంటూ ఫైర్ అయ్యాడు. సుధీర్ మొఖం ఒక్కసారిగా మాడిపోయింది. ఇక దీనంగా ముఖం పెట్టి..” అలా కాదన్నా ఎప్పుడూ సరదాగా ఉంటాం కదా” అంటూ నెమ్మదిగా మాట్లాడుతుండగానే.. శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఇన్ని రోజులు మొహమాటంతో ఆగాను.. నాకు అక్కర్లేదు.. నేను వెళ్ళిపోతాను. ఈ షో కూడా నాకు అవసరం లేదు. నాకున్న రెస్పెక్ట్ నాకుంది బయట” అంటూ మండిపడ్డారు. అన్న ప్రోమో కదా అని సుధీర్ మళ్లీ అడగగా..” ప్రోమో ఏంటి.. ప్రోమో.. ప్రతిదానికి ప్రోమో అంటూ వేసేస్తారా.. ప్రతిదీ కమర్షియల్ గానే చూస్తావా నువ్వు? ” అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు శ్రీకాంత్.
ALSO READ: అన్నం పెట్టి.. ఛాతి, మెడపై కాలితో తన్ని హత్య.. దర్శన్ కేసులో సంచలన నిజాలు
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కనిపించే శ్రీకాంత్ ఇలా సడన్గా ఫైర్ అయ్యేసరికి సెట్లో వాతావరణం కూడా ఒక్కసారిగా సైలెంట్ గా మారిపోయింది. ఇక అందరూ ఏం జరుగుతోంది అని చూస్తుండగానే సడన్గా శ్రీకాంత్ “ఓకే.. ఇది ప్రోమో అంటే” అంటూ సడన్ షాక్ ఇచ్చారు. ఇక దీంతో సీరియస్గా ఉన్న వాతావరణం మళ్లీ నవ్వుల మయం అయిపోయింది. శ్రీకాంత్ సుదీర్ ని హగ్ చేసుకోగా.. ఇది అసలు ప్రోమో అంటే అంటూ అందరూ సరదాగా నవ్వేశారు. మొత్తానికైతే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.