Actor Darshan: అభిమాని రేణుకా స్వామి(Renuka Swamy) ని హత్య చేసిన కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan ) గత కొంతకాలంగా జైలులో కటకటాలు లెక్కపెడుతున్న విషయం తెలిసిందే. కేవలం తన ప్రియురాలికి అసభ్యకరంగా సందేశాలు పంపించాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా బాధితుడిని కిడ్నాప్ చేసి, నరకం చూపించి మరీ అత్యంత దారుణంగా , క్రూరంగా చంపేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దర్శన్ తో పాటు అతడి ప్రియురాలు పవిత్ర గౌడ(Pavitra Gowda)ని కూడా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ ఘాతుకానికి పాల్పడిన కొంతమంది నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో మరో సంచలన నిజం వెలుగు చూసింది. రేణుకాస్వామి హత్యకేసులో 14వ నిందితుడైన ప్రదోష్(Pradosh ) రేణుకా స్వామిని ఎలా హత్య చేశారు ? అనే విషయంపై చేసిన కామెంట్లు ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తున్నాయి.
హత్య కేసులో 14వ నిందితుడైన ప్రదోష్.. తనకు క్షమాభిక్ష కావాలి అని దరఖాస్తు చేసుకోగా.. అతను దాఖలు చేసిన దరఖాస్తులో కేసుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆరోజు జరిగిన ఘటన నుంచి సాక్ష్యాలను తారుమారు చేసే వరకు జరిగిన ప్రతి అంశాన్ని కూడా ప్రదోష్ తన పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం. ప్రదోష్ తన పిటిషన్ లో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన తర్వాత పవిత్ర గౌడకు అసభ్యకరంగా సందేశాలు ఎందుకు పంపించావని దర్శన్ రేణుకా స్వామిని నిలదీశాడు. ఆ సమయంలో రేణుకా స్వామిని దారుణంగా కొట్టడంతో రేణుకా స్వామి తల నుంచి రక్తం కారడం నేను చూశాను. ముఖ్యంగా రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బంధించిన ప్రాంతానికి పవిత్ర గౌడను పిలిపించి ఆమె చెప్పుతో కొట్టేలా చేశారు.
ఆ తర్వాత అతడిపై విచక్షణ రహితంగా దాడి చేసి లోదుస్తులు మాత్రమే ఉంచి.. టాటా ఏస్ కి వేలాడదీసి నైలాన్ తాడుతో కొట్టారు. ఇక అంతలా వారు కొడుతుంటే.. చనిపోతాడని నేను చెప్పినా.. ఎవరు వినిపించుకోలేదు. పైగా అతడికి ఆహారం పెట్టి , నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా దర్శన్ అతడి ఛాతీపై, మెడపై కాలితో గట్టిగా తన్నారు. దీంతో అతడు స్పృహ తప్పి అక్కడికక్కడే పడిపోయాడు. అయినా కూడా అతడిని వదలకుండా దర్శన్ తన రెండు కాళ్లతో బాధితుడు ఛాతీ పై నిలబడి గట్టిగా తొక్కేందుకు ప్రయత్నించాడు. ఇక నేను జోక్యం చేసుకొని అతడిని పక్కకు లాగాను. కానీ అప్పటికే రేణుకా స్వామి చనిపోయాడు.
ALSO READ: మీరు AI క్రియేటర్లా? హైదరాబాద్‌లో EROS సంస్థ ఆడిషన్ మిస్ కాకండి, ఎప్పుడంటే?
ఈ హత్య విషయాన్నీ సెటిల్ చేయకపోతే దర్శన్ గన్ తో కాల్చుకొని చనిపోతానని బెదిరించాడు. అందుకే కట్టు కథను అల్లడానికి చర్చలు జరిపాము. రేణుకా స్వామి పై దాడి జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. దానిని అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా నావల్ల కాలేదు. దారుణంగా రేణుకా స్వామి పై దాడి చేసి సిగరెట్ల తో కాల్చారు. పైగా కేసు ఎలా జరిగింది ?ఈ కేసులో ఎవరెవరు పాలు పంచుకున్నారు? అనే వివరాలన్నీ నాకు తెలుసు. దయచేసి నాకు క్షమాభిక్ష పెట్టండి. కోర్టు ముందు అన్ని చెబుతాను. ఇక మీ ముందు ఈ నిజాలు బయటపెట్టినందుకు నన్ను ఏదైనా చేస్తారేమో.. దయచేసి నా రక్షణ కోసం దర్శన్ వాళ్లతో పాటు కాకుండా ప్రత్యేక సెల్ లో నన్ను ఉంచండి” అంటూ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు ప్రదోష్. పిటీషన్ ను విచారణ జరిపి, తుది తీర్పు ఇవ్వనుంది కోర్టు. ఇకపోతే ప్రదోష్ కి దర్శన్ ఆప్తమిత్రుడు కాగా.. ఆర్ఆర్ నగర్ లోని స్టోనీ బుక్ బార్ అండ్ రెస్టారెంట్ కి ప్రదోష్ యజమాని కూడా.