E-Paper
Advertisement

రూ.849కే బ్లూటూత్ స్పీకర్.. దీని ముందు హోమ్ థియేటర్ బలాదూర్

రూ.849కే బ్లూటూత్ స్పీకర్.. దీని ముందు హోమ్ థియేటర్ బలాదూర్
Advertisement

BoAt Aavante Bar 480/490: మ్యూజిక్ వినడాన్ని ఇష్టపడేవారికి మంచి ఆడియో గ్యాజెట్ ఉండటం చాలా ముఖ్యం. ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘బోట్’మార్కెట్లోకి తెచ్చిన boAt Aavante Bar 480/490 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాంపాక్ట్ డిజైన్, బెస్ట్ సౌండ్, అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ స్పీకర్ ధర కేవలం రూ.849 మాత్రమే. ప్రయాణాల్లో ఉన్నప్పుడు,ఇంట్లో చిన్న పార్టీలు చేసుకునేటప్పుడు లేదా హాయిగా పాటలు వినాలనుకునే వారికి ఈ పోర్టబుల్ సౌండ్‌బార్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న స్పీకర్ అందించే.. అద్భుతమైన ఫీచర్లు, ఆఫర్ల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

boAt Aavante Bar 480/490 ఫీచర్లు:

1.డిజైన్, లుక్:

Advertisement

ఈ స్పీకర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా అంతే కాకుండా కాంపాక్ట్‌గా ఉంటుంది. దీని బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్‌లో వేసుకుని తీసుకెళ్లవచ్చు. ఇది బ్లాక్ కలర్‌లో అల్ట్రా-మోడ్రన్ ఫినిషింగ్‌తో వస్తుంది కాబట్టి.. ఇది మీ రూమ్ లేదా టేబుల్ డెకర్‌కు చక్కటి లుక్‌ను ఇస్తుంది.

2.సౌండ్ క్వాలిటీ, డ్రైవర్లు:

చిన్న సైజులో ఉన్నప్పటికీ.. ఈ స్పీకర్ సౌండ్ విషయంలో ఎలాంటి రాజీ పడదు.ఇది 10 W RMS బెస్ట్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అంతే కాకుండా ఇందులోని.. డ్యూయల్ ఫుల్ రేంజ్ డ్రైవర్లు స్పష్టమైన వోకల్స్, రిచ్ ఆడియో ఫీల్ ఇస్తాయి. సినిమా చూడాలన్నా.. పాటలు వినాలన్నా ఇది మంచి ఆడియో క్లారిటీతో అదరగొడుతుంది. 2.0 ఛానెల్ సపోర్ట్ దీని ఫర్మామెన్స్‌ను మరింత మెరుగు పరుస్తుంది.

3.బ్యాటరీ బ్యాకప్:

Advertisement

మ్యూజిక్ లవర్స్ గంటల తరబడి పాటలు వినేలా ఈ స్పీకర్ సుమారు 7 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇది లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్‌తో పాటు వివిధ మోడ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు జియోసావన్ద్వారా ఫ్రీ మ్యూజిక్ యాక్సెస్ లాంటి అదనపు బెనిఫిట్స్ కూడా దీని ద్వారా లభిస్తాయి.

4.కనెక్టివిటీ ఆప్షన్లు:

ఈ స్పీకర్‌లో కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా.. ఇతర గార్జెట్లను కనెక్ట్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ దగ్గర బ్లూటూత్ సౌకర్యం లేకపోయినా..USB డ్రైవ్, TF కార్డ్ లేదా AUX కేబుల్ ద్వారా నేరుగా మీ మొబైల్, ల్యాప్‌టాప్ లేదా పెన్‌డ్రైవ్‌ను కనెక్ట్ చేసి పాటలు వినవచ్చు.

Also Read: ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో.. టాప్ 5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు!

5.ఈజీ మీడియా ఆపరేటింగ్ కంట్రోల్స్ :

పాటలు మార్చడానికి లేదా వాల్యూమ్ పెంచడానికి, తగ్గించడానికి ప్రతి సారీ ఫోన్ చూడాల్సిన అవసరం లేదు. ఈ సౌండ్‌బార్‌పై చాలా తేలికగా పని చేసే ఫిజికల్ బటన్స్ ఉంటాయి. వీటి ద్వారా మీరు వాల్యూమ్ అడ్జస్ట్ చేయడం, ట్రాక్స్ మార్చడం, ప్లే/పాజ్ చేయడం, మోడ్‌లను ఈజీగా స్విచ్ చేయవచ్చు.

6.ధర, ప్రత్యేక ఆఫర్లు:

మార్కెట్లో ఈ మోడల్ అసలు ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ..ప్రస్తుతం ఈ-కామర్స్ సేల్స్‌లో భాగంగా ఇది కేవలం రూ.849 ధరకు అందుబాటులో ఉంది. వేల రూపాయల విలువైన ఫీచర్లను కేవలం వెయ్యి రూపాయల లోపు బడ్జెట్‌లో.. అందించడం దీని స్పెషాలిటీ అని చెప్పొచ్చు. తక్కువ ధరలో.. మంచి బ్రాండెడ్ పోర్టబుల్ సౌండ్‌బార్ లేదా బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Related News

రూ.599కే..50 గంటల బ్యాటరీ లైఫ్,డ్యూయల్ పేరింగ్ ఇయర్‌బడ్స్!

2000 ఏళ్ల క్రితమే ‘అనలాగ్ కంప్యూటర్’.. గ్రీకులు కనుగొన్న ఈ అద్భుతం గురించి మీకు తెలుసా?

ధర ఎక్కువైనా వర్త్ అనిపించే ఫీచర్లు.. OnePlus 16లో రాబోతున్న క్రేజీ చేంజెస్ ఇవే!

కెమెరా ఉన్న ఎయిర్‌పాడ్స్.. డిజైన్ మారిన వాచ్ అల్ట్రా.. యాపిల్ 2026 ఈవెంట్‌పైనే అందరి కళ్లు!

హోటళ్లలో Wi-Fi వాడుతున్నారా? అయితే.. మీ వీడియోలు బయటకొస్తాయ్!

బ్యాచిలర్స్,చిన్న ఫ్యామిలీలకు బెస్ట్..కేన్‌స్టార్ ఫ్రిజ్ పై భారీ డిస్కౌంట్

షాకింగ్.. భారత్‌లో మళ్లీ పెరిగిన Vivo X300 FE ధర.. ఏకంగా రూ.10,000 పెంపు!

Big Stories

Advertisement
×