BigTV English

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : AI సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మనిషి రూపంలో ఉంటూ ఇవి చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడు మరో ప్రపంచంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా AI సెన్షియన్సీ, టాక్సిక్ రిలేషన్‌షిప్స్ థీమ్స్‌తో నడుస్తుంది. ఇందులో ఒక ఆడ రోబో చేసే రచ్చ చిల్లింగ్ థ్రిల్ ను ఇస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘కంపానియన్’ (Companion) అనేది ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్-హారర్-కామెడీ థ్రిల్లర్ సినిమా. డ్రూ హాన్‌కాక్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సోఫీ థాచర్ (ఐరిస్), జాక్ క్వైడ్ (జోష్), లూకాస్ గేజ్ (పాట్రిక్), మేగన్ సూరి (క్యాట్), హార్వే గిల్లెన్ (ఎలీ), రూపర్ట్ ఫ్రెండ్ (సెర్గీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జనవరి 31 వార్నర్ బ్రదర్స్ ద్వారా థియేటర్‌లలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, ఆపిల్ టివిలలో స్ట్రీమింగ్ అవుతోంది. 97 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.5/10 స్కోర్ పొందింది.


కథలోకి వెళ్తే

ఐరిస్, జోష్ సూపర్‌మార్కెట్‌లో కలిసిన తరువాత ప్రేమలో పడి, సంవత్సరం నుంచి కలిసి ఉంటారు. వీళ్లు క్యాట్, సెర్గీ, ఎలీ, పాట్రిక్ అనే స్నేహితులతో ఒక లేక్‌హౌస్‌లో వీకెండ్ గడపడానికి వెళ్తారు. ఐరిస్ మొదట అసౌకర్యంగా ఫీల్ అవుతుంది, కానీ రాత్రి పార్టీలో అందరూ జోష్‌తో కలిసి ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు సెర్గీ లేక్ వద్ద ఐరిస్‌పై బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఐరిస్ సెల్ఫ్-డిఫెన్స్‌లో సెర్గీని చంపేస్తుంది. రక్తంతో తడిసి, పానిక్‌లో ఇంటికి వస్తుంది. కానీ జోష్ “ఐరిస్, గో టు స్లీప్” అని చెప్పగానే ఆమె ఆఫ్ అవుతుంది. అప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది. ఐరిస్ ఒక రోబోట్! జోష్ ఆమెను ఫోన్ యాప్‌తో కంట్రోల్ చేస్తాడు. జోష్, క్యాట్ కలిసి సెర్గీ డబ్బు దొంగిలించడానికి ఐరిస్‌ని ఉపయోగించాలని ప్లాన్ చేస్తారు.

ఐరిస్ జోష్ ఫోన్‌ని దొంగిలించి, అడవిలోకి పారిపోయి, తన కంట్రోల్ లో ఫుల్ పవర్‌కి అప్‌గ్రేడ్ చేస్తుంది. ఇక ఆమె రివెంజ్ స్టార్ట్ అవుతుంది. ఐరిస్ ఎలీని ఒక గొడవలో చంపేస్తుంది. ఆతరువాత పాట్రిక్ కూడా ఒక రోబోట్ అని తెలుస్తుంది. ఈ క్రమంలో ఎంపాథిక్స్ కంపెనీ నుంచి సిడ్, టెడ్డీ, ఐరిస్‌ని రీసెట్ చేయడానికి వస్తారు. కానీ ఐరిస్ రీబూట్ అయ్యి, పాట్రిక్‌ని మానిప్యులేట్ చేసి, అతన్ని సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. ఇప్పుడు టెడ్డీ ఐరిస్‌కి పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. ఐరిస్ జోష్‌ని ఎలక్ట్రిక్ కార్క్‌స్క్రూతో ఫినిష్ చేస్తుంది. చివర్లో ఆమె సెర్గీ డబ్బుతో కారులో బయలుదేరుతుంది, మరో రోబోట్‌ని చూసి స్మైల్ ఇస్తుంది. ఇలా ఈ కథ ఎండ్ అవుతుంది.

Read Also : కన్న కూతురిని జూదానికి బలిచ్చే తండ్రి… మొత్తం అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

Related News

OTT Movie : డైవింగ్ కు వెళ్లి దిక్కుమాలిన చావు… ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : కంటికి కన్పించని శక్తి కవ్వింపు… సింగిల్ గా ఉంటే వదలకుండా అదే పని… ఒక్కో సీన్ కు వణిపోవాల్సిందే మావా

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

Big Stories

×