BigTV English

India vs Pakistan Military: ఇండియా vs పాకిస్తాన్.. ఎవరి బలం ఎంత?

India vs Pakistan Military: ఇండియా vs పాకిస్తాన్.. ఎవరి బలం ఎంత?

India vs Pakistan Military Capabilities | జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. రెండు దాయాది దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సీరియస్ అయిన భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది.


అంతేకాకుండా, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పని చేస్తున్న అధికారులను 48 గంటల వ్యవధిలోగా తమ దేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల మధ్య, భారత్ పాకిస్తాన్‌పై యుద్ధం జరిగే అవకాశాల ఉన్నట్లు ఊహాగానాలు పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా కాలు దువ్వుతోంది. భారత్ దాడి చేస్తే.. అందుకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల్లో, నిజంగా యుద్ధం జరిగితే.. ఏ దేశం బలం ఎంత? ఎవరిది పై చేయి అనే అంశాన్ని అంచనా వేయడం అవసరం. ఈ నేపథ్యంలో.. గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచంలోని 145 దేశాల సైనిక శక్తిని పరిశీలించి రూపొందించిన ర్యాంకింగ్‌లో భారత్ సైనికి, ఆయుధాల బలం పరంగా నాలుగవ స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్తాన్ గత సంవత్సరం 9వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 12వ స్థానాన్ని దిగజారింది.


రెండు దేశాల బలాబలాలను పరిశీలిస్తే..

జనాభా, ఆర్థిక శక్తి
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఇండియా జనాభా దాదాపు 145 కోట్లకు పైగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ జనాభా అధికారిక గణాంకాల ప్రకారం.. 24.75 కోట్లుగా ఉంది. ఈ కారణంగా, మానవ వనరుల పరంగా భారతదేశానికి పై చేయి సాధించింది. అలాగే ఆర్థికంగా చూసుకుంటే భారత్ రక్షణ బడ్జెట్ (2023-24) దాదాపు ₹5.94 లక్షల కోట్లు (సుమారు $73.8 బిలియన్లు) ఉండగా.. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ కేవలం $6.34 బిలియన్లుగా ఉంది.

సైనిక బలాలు
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలాన్ని కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా నిలుస్తోంది. భారత్‌కు సుమారు 14.4 లక్షల యాక్టివ్ సైనికులు ఉన్నారు. రిజర్వ్ సైనికులు సంఖ్య సుమారు 11.5 లక్షలు ఉండగా.. పరామిలిటరీ బలగాలు కూడా 25 లక్షలకు పైగా ఉన్నాయి.

పాక్‌కు వద్ద సుమారు 6.5 లక్షల యాక్టివ్ సైనికులు మాత్రమే ఉన్నారు. పరామిలిటరీ బలగాలతో కలిపి పాకిస్తాన్ సైనిక బలము భారతదేశంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది.

యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామర్థ్యం
భారత సైన్యం వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధంగా ఉంది. బ్రహ్మోస్ క్షిపణులు, అర్జున్ ట్యాంకులు, టీ-90 భీమ్, పినాకా రాకెట్ లాంచర్లు, హోవిట్జర్లు వంటి శక్తివంతమైన ఆయుధాలు భారత సైన్యానికి అందుబాటులో ఉన్నాయి.

పాకిస్తాన్ వద్ద ప్రధానంగా అల్-ఖాలిద్ ట్యాంకులు ఉన్నాయి. అయితే అవి ఎక్కువగా చైనా, పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి. యుద్ధ సమయంలో కూడా ఆయుధాల కోసం పాక్ ఇతర దేశాల సాయంపై ఆధారపడుతోంది.

Also Read: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత.. పాక్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

వైమానిక దళం బలం
భారత వాయు సేన్యం వద్ద 2,229కి పైగా విమానాలు ఉన్నాయి. వాటిలో యుద్ధ విమానాలు 600+, సహాయక విమానాలు 831, హెలికాప్టర్లు 899 ఉన్నాయి. అత్యాధునికంగా రాఫెల్, సుఖోయ్ Su-30MKI, మిరాజ్ 2000, తేజస్ లాంటి యుద్ధ విమానాలు ఉన్నాయి.

మరోవైపు పాకిస్తాన్ వైమానిక దళంలో జేఎఫ్-17 థండర్ (చైనా సరుకు), ఎఫ్-16, మిరాజ్ III/V లాంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే ఈ విమానాల్లో చాలా పాత టెక్నాలజీ కలిగినవే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే, వాటి సంఖ్య కూడా భారతదేశంతో పోలిస్తే తక్కువగా ఉంది.

నౌకా దళ సామర్థ్యం
ఇండియన్ నేవీ అత్యాధునిక యుద్ధ నౌకలు కలిగి ఉంది. మొత్తం 130కి పైగా నౌకలు, రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు (విక్రమాదిత్య, విక్రాంత్), అణు శక్తితో నడిచే సబ్‌మెరిన్లు భారత నావిక దళంలో ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో భారత్ నేవీ శక్తి ఇతర అగ్రదేశాలకు సైతం పోటీగా ఉంది.

పాకిస్తాన్ నేవీకి 75 నౌకలు, 13 సబ్‌మెరిన్లు (హంగోర్, అగోస్టా తరహా) ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ వద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ లేదు.

సాంకేతికత బలం
భారత్ DRDO, HAL లాంటి స్వదేశీ సంస్థల ద్వారా ఆయుధాల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో రక్షణ భాగస్వామ్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆయుధాల విషయంలో ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది.

అణుశక్తి సామర్థ్యం
ఇరు దేశాలూ అణ్వాయుధ శక్తి కలిగి ఉన్నాయి. కానీ, భారత్‌కు “సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ” ఉంది. అంటే, అణు సబ్‌మెరిన్ల ద్వారా దాడి చేయగల సత్తా ఉంది. పాకిస్తాన్ ప్రధానంగా మిస్సైల్ ఆధారిత నిరోధకత మీద మాత్రమే ఆధారపడుతోంది.

తుది విశ్లేషణ
ఇక ఇరు దేశాలకు సంబంధించి అన్ని శక్తి సామర్థ్యాలు పరిశీలించిన తరువాత ఫలితం ఏంటంటే భారత్ స్పష్టంగా అన్ని విధాలా పై చేయి సాధించింది. పూర్తి స్థాయిలో యుద్దం జరిగితే పాకిస్తాన్ ఎక్కువ కాలం పోరాడ లేదు. కానీ అణు బాంబులుండడంతో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే అవకాశాలు తక్కువ.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×