Illu Illalu Pillalu Today Episode April 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు ఇంటికి వచ్చిన భాగ్యం చిచ్చు పెడుతుంది. కొత్తగా పెళ్లయిన జంట కదా మీకు అచ్చట ముచ్చట ఉంటుంది. రేపు అన్ని సాంప్రదాయ ప్రకారం జరిపించాలి మరి గది లేకపోతే ఎక్కడ పెడతారు. అన్నయ్యగారు అని భాగ్యం ఇంట్లో చిచ్చు పెడుతుంది. మీకు ముందే చెప్పాను కదా చెల్లెమ్మ ఇంట్లో ఇంకొక గది కట్టించాలని ఇప్పుడే మేస్త్రిని పిలిపిస్తాను ఇంకొక గది కట్టిస్తానని అంటాడు.. రామరాజు మీరందరూ కొత్తగా పెళ్లయినోళ్లు మాకు మా గదేమో అవసరం లేదు మీరు మా గదిలో ఉండొచ్చు అని అంటాడు. కానీ ధీరజ్ మాత్రం మీరు రైస్ మిల్లులో రోజంతా నిల్చనే ఉంటారు. అమ్మ రోజంతా ఇంట్లో పనులు చేస్తూనే ఉంటుంది మీరు మా గదిలో ఉండొచ్చు అని అనగానే రామరాజు ఏం మాట్లాడకుండా నిలుచుంటాడు. భాగ్యం చూసావా అమ్మడు వచ్చి రాగానే నీకు గదా చాలా చేశాను ఇక ఇంట్లో పెత్తనం కూడా నువ్వే మెల్లగా నీ చేతిలోకి తీసుకోవాలని అంటుంది. ధీరజ్, ప్రేమ లు తమ గదిని ఇచ్చేస్తారు. వారిద్దరినీ ఇంట్లోని వాళ్లంతా పొగిడేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి పెద్దోడి శోభనానికి ముహూర్తం పెట్టించానండి. అలాగే నర్మదా వాళ్ళకి కూడా ఈరోజే శోభనం జరిపిద్దామని అడుగుతుంది. ఇంటి కోసం తన ప్రేమనే పెద్దోడు త్యాగం చేశాడు. పెళ్లి కాలేదని ఎందరో ఎన్నో అంటే అవమానాలు భరించాడు. ఇప్పటికీ ఓ మంచి అమ్మాయిని ఆ దేవుడు వాడి కోసం పుట్టించాడు.. పెళ్లయింది ఒక పిల్లో పిల్లోడో పుడితే వాడి జీవితం సార్థకమవుతుందని రామరాజు అంటాడు. అలాగే కానించి బుజ్జమ్మ ని శోభనం ఏర్పాట్లు చేయించు అని అని అంటాడు. ఇక అన్నానంటే అన్నారంటారు కానీ నర్మద వాళ్ల గురించి కూడా మీరు ఆలోచించాలి అని అంటుంది.
పెద్దోడు పెళ్లి కోసం వాళ్ళిద్దరు కూడా శోభనాన్ని వాయిదా వేసుకున్నారు. వారి శోభనాన్ని దగ్గరుండి మనమే జరిపించాలి కదా అని అనగానే అలాగే కానీ బుజమ్మ అని రామరాజు అంటాడు.. బుజ్జమ్మ హడావిడిగా తన కొడుకులిద్దరికీ శోభనం ఏర్పాటు చేస్తుంది. తిరుపతి శోభనం గదిని రెడీ చేస్తూ హడావిడి చేస్తాడు. ఆ చేతులతో మీ ముగ్గురిని పెంచాను ఇప్పుడు మీ పెళ్లిళ్లు కూడా చేశాను అని అంటాడు. ఆ ముగ్గురికి అయితే పెళ్లి లేక అని నీకు ఇంకా పెళ్లి కాలేదని ధీరజ్ అంటాడు. రెండు కుటుంబాలు కలిసినప్పుడే నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అని అనగానే.. ధీరజ్ నువ్వు షష్టిపూర్తి కూడా చేసుకోలేవు త్వరగా నువ్వు పెళ్లి చేసుకో అని సలహా ఇస్తాడు.
అటు చందు సాగర్ ఇద్దరూ శోభనం జరుగుతుందని సంతోషంగా ఉంటారు. మీరిద్దరూ శోభనం ఎందుకు చేసుకోలేదు రా అని చందు అడిగితే నీకు పెళ్లి కాకుండా మేము శోభనం చేసుకుని పిల్లని కంటే ఏం బాగుంటుందని మేం మా శోభనాన్ని వాయిదా వేసుకున్నాం అన్నయ్య అని సాగర్ అంటాడు. ఆ మాట వినగానే చందు ఎమోషనల్ అవుతాడు. ఇక కామాక్షి ఇద్దరు మరదలను శోభనం కోసం అని రెడీ చేస్తుంది.
ఏదైనా అంటే అన్నాను అంటారు కానీ ఫైనాన్స్ కోడలు మరదలు కన్నా గవర్నమెంట్ మరదలే శోభనం చీరలో అందంగా ఉంది అని నర్మదను పొగిడేస్తుంది. నర్మద మాత్రం అక్క కూడా చాలా బాగుంది అని అంటుంది. ఏం బాగుంది నేను ఎంతోమందిని రెడీ చేశాను కానీ నిన్ను చూసినంతగా ఎవరిని చూడలేదు అని అంటుంది. నీకు తక్కువ నగలే వేశాను సింపుల్ గానే చీర కట్టాను నువ్వు చాలా అందంగా ఉన్నావు. అదే ఆవిడకి మరి చెట్టుకు చీర కట్టినట్టు ఉంది. నగలు అంటావా ఏదో దండం మీద వేసినట్లు ఉన్నాయి అని దారుణంగా అవమానిస్తుంది…
ఆ మాట వినగానే శ్రీవల్లి ఏడ్చుకుంటూ బయటికి వెళ్లిపోతుంది. వెంటనే భాగ్యం కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తుంది. ఇక్కడ ఉండనని చెప్తుంది. భాగ్యం మాత్రం వాళ్ళిద్దరికీ ముందు పిల్లలు పుడితే నీ మీద గౌరవం ఉండదు. నిన్ను పట్టించుకోరు నువ్వు శోభనం జరగకుండా చెయ్యి అని ప్లాన్ చెయ్యాలి అంటుంది. శ్రీవల్లి రామరాజు వేదవతి దగ్గరికి వెళ్లి ఆ విషయాన్ని చెప్పబోతోంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..