Illu Illalu Pillalu Today Episode june 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు గురించి భాగ్యంతో శ్రీవల్లి చెప్తుంది. అయితే భాగ్యం మాత్రం ఇంత వయసొచ్చినా నా మొగుడు ఇంకా నాతోనే ఉంటున్నాడు నువ్వు అలా చేసుకోవాలి గాని ఇలా దూరంగా పడుకోవడం ఏంటి అని అడుగుతుంది. నువ్వు చేసిన ఘనకార్యం వల్లే మేమిద్దరం దూరంగా పడుకోవాల్సి వచ్చిందని శ్రీవల్లి భాగ్యంపై సీరియస్ అవుతుంది. ముందు 10 లక్షలు మేటర్ పక్కన పెట్టి మీరిద్దరూ కాపురం మీద దృష్టి పెట్టండి. ఆ నర్మదకి పొరపాటున పిల్లలు పుడితే మీ అత్తయ్య నెత్తిన కూర్చుంటుంది అని భాగ్యం సలహా ఇస్తుంది.. ఇక ఉదయం లేవగానే చందు రావడం చూసి శ్రీవల్లి జ్వరం వచ్చిందని నాటకం ఆడుతుంది. శ్రీవల్లి జ్వరం ప్లాన్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ బెంగ తీరిపోవాలంటే మనిద్దరం ఒకటి చేయాలి అని శ్రీవల్లి అంటుంది. అదేంటి అని చందు అడుగుతాడు. శ్రీవల్లి మనిద్దరం హనీమూన్ కి వెళ్దామా అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..రామరాజు బయటికి వెళ్లడానికి బ్యాగు తీసుకు రమ్మని చెప్తాడు.. కానీ వేదవతి బ్యాగు తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడే శ్రీవల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఏదో టెన్షన్ పడుతూ కనిపిస్తున్నట్లు రామరాజు గమనిస్తాడు. ఏమైందమ్మా శ్రీవల్లి ఎందుకు మీ అమ్మతో ఏదో టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దానికి శ్రీవల్లి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు హనీమూన్ కి వెళ్లారు అంట మావయ్య. మమ్మల్ని కూడా పంపిస్తానని అంటుంది. మా అమ్మ బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి పంపిస్తుంది. అది మీకు అవమానం కాదా అని ఇండైరెక్టుగా రామరాజుకి కౌంటర్ ఇస్తుంది. రామరాజు చందును పిలిచి మీరిద్దరూ హనీమూన్ కి వెళ్ళండి ఎక్కడ వెళ్తున్నారో చెప్తే డబ్బులు పంపిస్తాను అని అంటాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి సంతోషంతో ఎగిరి గంతేస్తుంది..
నర్మదా ప్రేమలు మాత్రం పెద్ద కోడలికి అన్ని ఉంటాయా మనకు ఉండవా అని బాధపడుతూ ఉంటారు. వేదవతి బయటకు వచ్చి మీకు పెద్ద కోడలు పెద్ద కొడుకు మాత్రమే కాదు.. మీకు ఇంకా ఇద్దరు కోడలు కొడుకులు ఉన్నారు ఆ సంగతి మీరు మర్చిపోతున్నారు. వాళ్లకి కూడా కొత్తగా పెళ్లయింది కదా వాళ్ళని కూడా హనీమూన్ కి పంపించొచ్చు కదా అనేసి అంటుంది.. వాళ్ళిద్దరూ నా మాట ప్రకారం పెళ్లి చేసుకోలేదు నా మాట వినట్లేదు కదా అందుకే నేను పెద్దోడిని మాత్రమే పంపిస్తున్నానని రామరాజు అంటాడు.. దానికి వేదవతి సీరియస్ అవుతుంది.. కోడళ్లు ఇద్దరు వచ్చి పెద్ద కోడలే గొప్ప కదా అని తెప్పి పొడుస్తారు. మీరేం చేస్తారో నాకు సంబంధం లేదు ముగ్గురు కొడుకుల్ని కోడల్ని హనీమూన్ కి పంపించాల్సిందే అని వేదవతి కండిషన్ పెడుతుంది. రామరాజు ఇక చేసేదేమీ లేక వేదవతి మాటని కాదనలేక పోతాడు.
శ్రీవల్లి మాత్రం మావయ్య గారు మమ్మల్ని హనీమూన్ కు పంపిస్తున్నారు అంటూ ఎగిరి గంతేస్తూ చిందులు వేస్తూ ఉంటుంది.. మమ్మల్ని మాత్రమే హనీమూన్ కి పంపిస్తున్నారని ప్రేమా నర్మదా కుళ్ళుకొని ఏడుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మాస్ స్టెప్పులు వేస్తుంది శ్రీవల్లి. అంతలోకే రామరాజు మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. బుజ్జమ్మ నీ కొడుకుల్ని కూడా అందరిని పిలువు అని అంటాడు. వేదవతి కొడుకుల్ని ముగ్గురు కోడల్ని రమ్మని పిలుస్తుంది. ముగ్గురికి కొత్తగా పెళ్లయింది కదా వెళ్తే మూడు జంటలు కలిసి హనీమూన్ కి వెళ్ళండి అని అంటాడు.
ఆ మాట వినగానే శ్రీవల్లి మొహం మాడిపోతుంది. అయితే మావయ్య ఇలా షాక్ ఇచ్చాడు ఏంటి అని ఫీల్ అవుతుంది. సాగర్ నువ్వు నాలుగు రోజులు మిల్లుకు రాకపోయినా ఏం పర్వాలేదు అని అంటాడు.. నేను తిరుపతి మేనేజ్ చేసుకుంటాం అని రామరాజు అంటాడు. ధీరజ్ నువ్వు నా రోజు డ్యూటీ కి వెళ్లకపోతే ప్రాబ్లం లేదు కదా అనేసి అడుగుతాడు. తండ్రి మాటను కాదనలేక ముగ్గురు కొడుకులు వెళ్తామని అంటారు. కానీ ప్రేమ మాత్రం శ్రీవల్లితో మనం వెళ్తే ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టేసి, వచ్చిన తర్వాత మావయ్యకు లేనిపోనివి ఎక్కించి చెప్తుంది కదా అక్క అని నర్మదతో అంటుంది.
ఇది కూడా పాయింటే ప్రేమ మనం మామయ్యతో కుదరదని చెబుదామని అంటారు. ఎక్కడికి వెళ్తారో చెప్పండి నేను డబ్బులు ఆన్లైన్లో పంపిస్తానని రామరాజు అంటాడు. చందు చెప్తున్నాను అనేసి అంటాడు. అయితే నర్మద మాత్రం ఒక్క నిమిషం మావయ్య గారు అని అడుగుతుంది.. ఏంటే ఏమైంది అని వేదవతి అంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం సెలవులు ఇవ్వరు మావయ్య గారు ఆల్రెడీ సెలవులన్నీ పెళ్లికి వాడుకున్నాను అని అంటుంది. సాగర్ మాత్రం నాన్న ఎప్పుడూ ఒకసారి ఈ అవకాశాన్ని ఇచ్చాడు మనం వాడుకోవాలి అని అంటాడు. ప్రేమ కూడా నాకు క్లాసులు ఉన్నాయని నేను వెళ్లడం కుదరదని అంటుంది. ఇక ప్రేమ ధీరజ్ తో ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని డాన్స్ క్లాసులకు వెళుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..