E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు దిమ్మతిరిగే షాక్.. భద్రంకు స్ట్రాంగ్ వార్నింగ్..శ్రీవల్లికి ప్రేమ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు దిమ్మతిరిగే షాక్.. భద్రంకు స్ట్రాంగ్ వార్నింగ్..శ్రీవల్లికి ప్రేమ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 17th: వేదవతి బయట ఊడుస్తూ కనిపిస్తుంది అది చూసిన ప్రేమ ఇటివ్వు అత్త ఊడుస్తాను అని అంటుంది.. అప్పుడే ధీరజ్ సేన ఇద్దరు కారులోంచి రావడంతో వేదవతి ప్రేమ ఇద్దరు షాక్ అవుతారు.. అయితే సేనాకు చెయ్యి పెరగడం చూసిన వేదవతి ప్రేమ ఏమైంది మా తమ్ముడికి నువ్వే కారుతో గుద్దేసి చెయ్యి విరగొట్టావా..? అసలు ఏం జరిగిందో చెప్పేది కూడా వినకుండా మీరు ఎందుకు ఇలా గోల చేస్తున్నారు అని మీరే అంటారు.. నేను పూర్తిగా చెప్పేది వినరా మీరు అని జరిగిన విషయాన్ని చెప్పగానే మా నాన్న చేయి పెరగడానికి నువ్వే కారణమని ప్రేమ అంటుంది. అటు సేన లోపలికి వెళ్లి ధీరజ్జ ఇలా చేయడానికి కారణమని అనగానే అందరూ ఒక్కసారిగా సీరియస్ అవుతారు..

తిరుపతిని ఆడుకున్న ధీరజ్..

తిరుపతి బయట బండి తుడుస్తూ పాటలు పాడుకుంటూ ఉంటాడు.. అందరూ గర్ల్ ఫ్రెండ్ ని వేసుకొని బండి మీద గాల్లో తేలిపోతుంటారు. కానీ నేను మాత్రం ఇలా ఒంటరిగా బండి తుడుచుకుంటూ ఇంకెన్నిళ్లు బతకాలో అర్థం కావడం లేదు అని బాధ పడిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన రామరాజు ఏంట్రా పాటలు పాడుతున్నావ్ ఈ వయసులో నీకు ఇది అవసరమా అని అంటాడు.. ఏంటి బావా వయసు వయసు అంటున్నావు నాకు పెళ్లెప్పుడు అవుతుందా అని నేను కంగారు పడిపోతుంటే నువ్వెందుకు నన్ను ఇంకా బాధ పెడుతున్నావు అని తిరుపతి రామరాజుని అరుస్తూ ఉంటాడు ఇంక రెండేళ్లు లాగితే నిన్నే వేరొకరు సాయం తీసుకొని వెళ్ళాలి.. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధించాలి అని రామరాజు అనగానే తిరుపతి బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినా ధీరజ్ మామ నేను నాన్నని కార్లో తీసుకుని వెళ్తాను నువ్వు బండిమీద పాటలు పాడుకుంటూ వచ్చేయి అని ధీరజ్ అనగానే తిరుపతి ఏంట్రా అంత మాట అన్నావు అని బాధపడిపోతూ ఉంటాడు.. ధీరజ్ కారులో రామరాజు ఎక్కించుకొని వెళ్తూ ఉండగా ఎదురుగా ఫైనాన్సియర్ రావడం చూసి ధీరజ్ షాక్ అవుతాడు..

కారును సీజ్ చేసిన ఫైనాన్సియర్..

Advertisement

ఏం కాలేదు అమ్మ ఎదురుగా ధీరజ్ కి ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి రావడంతో ఏమైంది ఇలా వచ్చారు. నేను ఇంకా ఈఎంఐ కట్టాల్సిన టైం కూడా రాలేదు కదా అని అడుగుతాడు.. ఈఎంఐ కట్టడానికి కాదు నీ కారుని తీసుకొని వెళ్లడానికి వచ్చాము.. అదేంటి మీరు ఇలా అంటే నేను ఏం చేయాలి ఎందుకు మీరు కారును తీసుకొని వెళ్తున్నారు. నేను ఈఎంఐ కరెక్ట్ గా కడతాను కదా అని ధీరజ్ ఎంత చెప్తున్నాగాని అతను మాత్రం అస్సలు వినడు. మీ కార్ని వెంటనే సీజ్ చేసి తీసుకొని వెళ్ళిపోతాము ఆల్రెడీ పోలీస్ కేసు అయింది కదా.. మీరు ఈఎంఐ కట్టిన వేస్ట్ అని అతను అనగానే ధీరజ్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. భద్ర ధీరజ్ కి కౌంటర్ ఇస్తుంది..

భద్రకు ధీరజ్ వార్నింగ్..

ఏంట్రా రామరాజు ఇన్ని రోజులు నా కొడుకు ఏదో చేస్తున్నాడు పొడుస్తున్నాడు అని తెగ విర్రవిగావు కదా.. ఇప్పుడు ఆ కారునే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడేం చేస్తాడు. నీ కొడుకు అని భద్ర కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. ఇదిగో భద్రం నువ్వు ఏదేదో అనుకుంటున్నావు కారు పోయిన నాకు కాన్ఫిడెన్స్ మాత్రం పోదు నువ్వు పెద్దగా ఊహించుకోవద్దు అని ధీరజ్ భద్రకి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇస్తాడు.. మధ్యలో సేన రావడంతో దెబ్బలు పోయిన మామయ్య నువ్వు కాస్త పక్కనుండు అని కావాలనే అంటాడు.. సే నాని అనడంతో ధీరజ్ నా కాన్ఫిడెంట్ మాత్రం మీరు దూరం చేయలేరు.. బ్రతకడానికి ఏవేవో ఉంటాయి అని ధీరజ్ భద్ర కి అలాగే సేనకు దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

వల్లికి కచేరి స్టార్ట్..

Advertisement

ప్రేమ ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారు పోయింది అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. ధీరజ్ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఇదంతా మా పుట్టింటి వాళ్ల వల్లే అని బాధపడిపోతూ ఉంటుంది.. ప్రేమ అలా ఒంటరిగా కూర్చుని బాధ పడిపోవడం చూసిన శ్రీవల్లి.. కారు పోయిందని బాధ పడిపోతుందేమో ఇంకాస్త దీన్ని రెచ్చగొట్టి ఇంకా బాధ పెట్టేలా చేయాలి అని ప్రేమ సుకన్య ప్లాన్ చేస్తారు.. ప్రేమ ముందుకు వచ్చి కారు పోయింది మళ్లీ డెలివరీ బాయ్ జాబ్ వచ్చింది అంటూ వెటకారంగా మాట్లాడడంతో ప్రేమ కోపంతో రగిలిపోతుంది.. వెంటనే వల్లిని కొట్టబోతుంది.. కానీ అక్కడ నైటు కచేరి మొదలు పెడతాను డాం డాం డాం అంటూ వల్లికి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది ప్రేమ.. కచేరియా అంటూ బాధ పడిపోతుంది వల్లి. సుకన్యకు కచేరి గురించి చెప్పి మళ్ళీ ఇంకాస్త భయపడిపోతూ ఉంటుంది..

నర్మదా మాటకు రామరాజు ఫిదా..

రామరాజు తిరుపతి వెళ్తూ ఉండగా మధ్యలో బండి పాడవుతుంది. అయితే ఇక్కడ మెకానిక్ షాప్ కూడా లేదు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఎదురుగా నర్మదా వస్తుంది.. ఏమైంది ఎందుకు బండి అయిపోయిందా బాబాయ్ గారు అని మాట్లాడుతుంది.. అవునమ్మా ఏదో ట్రబుల్ వచ్చినట్టుంది ఆగిపోయింది అనగానే ఇక్కడ ఎండగా కూడా ఉంది ఎలా ఇక నుంచి వెళ్ళాలి అని తిరుపతి. మావయ్య గారికి ఇబ్బంది లేకపోతే నా బండి మీద రావచ్చు అని నర్మదా అంటుంది కానీ రామరాజు మాత్రం వద్దు అని అంటున్నా కూడా నర్మదా నేనెవరో తెలియదు అని అనుకోని ఎక్కచ్చు అని అంటుంది. నర్మద మాట విన్న రామరాజు తనని కోడలుగా కాకుండా కూతురుగా భావించి బండి ఎక్కి నువ్వు ఆ బండిని తీసుకురా అని అంటాడు. మామయ్యకు తన మీద కోపం పోయింది అని నర్మదా చాలా సంతోషంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ ఆస్తులు.. ఒక్కరోజుకు ఎంత రెమ్యూనరేషన్..?

Related News

ఒక్క సీరియల్‌తోనే స్టార్‌లైపోయిన నటులు వీళ్లే!

మెడలో తాళిబొట్టుతో కనిపించిన జబర్దస్త్ ప్రియాంక.. వీడియో వైరల్ !

Gundeninda GudiGantalu Today episode: బాలు పై మీనాకు అనుమానం.. మనోజ్ కు మైండ్ బ్లాక్… దొంగలను పట్టుకున్న బాలు…

Karthika Deepam 2 Serial Today Episode August 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యో పెళ్లి చేయాలన్న సుమిత్ర 

Podarillu Today Episode : సురేష్, వరాలును ఆడుకున్న శైలు.. మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. పెద్దోడికి మళ్లీ నిరాశేనా?

Illu Illalu Pillalu Today Episodes: నర్మదదకు భద్ర పై అనుమానం.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode August 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును చూసి ఎమోషనల్ అయిన అపర్ణ   

Intinti Ramayanam Today Episode: పార్క్ లో సందడి.. గేమ్స్ అదుర్స్.. అశ్విన్ ఎంట్రీ తో పల్లవి షాక్..

Big Stories

Advertisement
×