Intinti Ramayanam Today Episode june 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీకర్ కమల్ ఇద్దరూ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు కదా అని మాట్లాడుకుంటూ వెతుకుతారు. టిఫిన్ తీసుకెళ్లా అవనీని అక్షయ్ పార్వతి దారుణంగా మాటలతో అవమానిస్తారు. భానుమతి మాత్రం టిఫిన్ కోసం అవనికి సపోర్ట్ చేస్తుంది.. కానీ ఆ ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేయకుండా అవన్నీ తెచ్చిన టిఫిన్ ని వెనక్కి పంపిస్తారు. అది చూసిన రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. అవని ఏడిపించిన వాళ్లని నేను కూడా ఏడిపించాలని రాజేంద్రప్రసాద్ అనుకుంటాడు. అయితే బయటకు వెళ్లి ఎవరో తెలియని వాళ్ళతో మాట్లాడినట్లు భానుమతితో మాట్లాడుతాడు. కమల్ శ్రీకర్ అవని వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడే ఉన్నా పార్వతి వాళ్ళని చూసి షాక్ అవుతారు. మేము ఇక్కడ ఉన్నాం అన్న విషయం మీకు మీ వదిన చెప్పిందా అని పార్వతి అడుగుతుంది.. ఆరాధ్య వాళ్ళ నాన్నకు భోజనం తీసుకొని వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్య వాళ్ళ కోసం భోజనం తీసుకుని వస్తుంది.. అయితే మీ అమ్మ పంపిందా అని ఆరాధన వాళ్ళ అన్న కూడా నాకు వంట చేయడం రాదు కదా అమ్మే చేసింది మీరు తింటేనే నేను మీతో మాట్లాడతాను అని ఆరాధ్య అంటుంది.. మీరు తింటేనే నేను భోజనం చేస్తాను అని ఆరాధ్య మొండికేసి కూర్చుంటుంది. అయితే ఆరాధ్య మాటను కాదనలేక అక్షయ్ భానుమతి పార్వతి ముగ్గురు కూడా భోజనం చేస్తారు. వాళ్ళు భోజనం చేస్తారా లేదా అని కిటికీ నుంచి అవని చూస్తూ ఉంటుంది.. ఆరాధ్య తండ్రికి తినిపించడం చూసి అవని మురిసిపోతూ ఉంటుంది..
ఇక శ్రీకర్ కమల్ ఇంటికొచ్చి మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటారు. ఏంటి మీ సంతోషానికి అంత కారణమని శ్రియ పల్లవి అడుగుతారు. అమ్మ నానమ్మ అన్నయ్య ఎక్కడున్నారు అని కంగారుపడుతూ వెళ్ళాము. కానీ చివరికి చూస్తే వదిన వాళ్ళింటి ఎదురుగానే ఉన్నారని కమల్ అంటాడు. అవున్రా నేను కూడా చాలా కంగారు పడిపోయాను. కానీ అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని శ్రీకర్ అంటాడు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వదిన దగ్గరుండి చూసుకుంటుంది అని వాళ్ళిద్దరూ అనడం చూసి పల్లవి కుళ్ళుకుంటుంది.
వీళ్ళిద్దరూ వెళ్లి మళ్లీ అవని ఇంటి ఎదురుగానే ఉన్నారా అయితే వాళ్ళిద్దరూ మల్లి ఏదో ఒక సాకుతో కలిసిపోయేలా ఉన్నారని అనుకుంటుంది. ఎలాగైనా సరే వీళ్ళని విడగొట్టాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆకలేస్తుంది ఏం వంట చేశారు అని అడగ్గానే శ్రీయా నేను వంట చేశాను నాకు ఆకలేస్తుంటే తినేసాను మీరే తినండి అని వడ్డిస్తుంది.. ప్లేట్ లోని అన్నాన్ని ఒక ముద్దు నోట్లో పెట్టుకున్నారో లేదో కారం మంట అంటూ ఇద్దరూ అరుస్తారు. నాకు ముందే వంట చేయడం రాదని చెప్పాను కదా శ్రీ అనేసి శ్రియ అంటుంది.. వీళ్ళిద్దరూ ఎవరు వంట చేస్తారో ఎవరు ఇంటి పని చేసుకుంటారు అది మీ ఇష్టం. అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు అని కమలంటాడు..
ఇక అవని మళ్లీ భోజనం పంపించాలని అంతా రెడీ చేసి ఆరాధ్యను పిలుస్తుంది.. రాజేంద్రప్రసాద్ వచ్చి ఈ భోజనం ఎవరి కమ్మ అని అడుగుతాడు.. ఈ భోజనము అత్తయ్య వాళ్ళకి పంపిద్దామని అనుకుంటున్నాను మావయ్య అని అంటుంది. ఉదయం టిఫిన్ తీసుకుని వెళ్తే వద్దు అని అన్నారు.. ఇప్పుడు తీసుకుని వెళ్తే తింటారు అంటావా అని అంటాడు. ఆరాధ్య చేత పంపిస్తే కచ్చితంగా తింటారు అని అవని అంటుంది. అప్పుడే అక్షయ అక్కడికి రావడం చూసి రాజేంద్రప్రసాద్ ఎందుకు వచ్చాడు అడగమ్మా.. భోజనం బాగుందని మళ్లీ భోజనం కోసం వచ్చాడేమో అని అనగానే అక్షయ్ భోజనానికి డబ్బులు ఇవ్వడానికి వచ్చానని అంటాడు.
Also Read: విజిల్ తో అందరిని నిద్రలేపిన ప్రభావతి..బాలు పొట్ట కొట్టిన మనోజ్..
ఆ మాట వినగానే కోపంతో రగిలిపోయిన రాజేంద్రప్రసాద్ అన్నిటికీ లెక్కలేసి డబ్బులు ఇవ్వమని అంటాడు.. అక్షయ్ అలానే డబ్బులు ఇస్తాడు. ఇక రాత్రి పల్లవి అక్షయ వాళ్ళ ఇంటికి వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు నాకు నచ్చలేదు అత్తయ్య.. అవని వాళ్ళు ఇంత చేసిన తర్వాత కూడా మీరు ఇక్కడే ఉంటే ఏం బాగోలేదు. నేను మీకు ఉదయాన్నే వేరే ఇల్లు చూస్తాను. అక్కడికి షిఫ్ట్ అవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..