Illu Illalu Pillalu Today Episode March 11 th : నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ ద్వారా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అక్కడికి వెళ్ళగానే అతను ఎవరైనా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు నువ్వేంటి సెటిల్ అవ్వకముందే పెళ్లి చేసుకున్నావ్ అంటే నీకు అంత బాధ్యత లేదా అనేసి అనగానే లేదు సార్ నేను ప్రేమించి పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు జాబ్ చేయాలని అనుకుంటున్నాను అందుకే జాబ్ కోసం తిరుగుతున్నానని ధీరజ్ అంటాడు కానీ అతను జాబ్ ఇవ్వడానికి ఒప్పుకోడు.. ధీరజ్ అలా చాలా ఆఫీసులకి షాపులకి వెళ్లి జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. నాకు జీవితం విలువ తెలిసి వచ్చింది నేను జాబ్ చేసి కష్టపడి ప్రేమను కూడా చూసుకోవాలనుకున్నాను కానీ నాకు ఎక్కడ జాబ్ దొరకడం లేదని బాధపడతాడు దానికి తన ఫ్రెండు నువ్వేం బాధపడొద్దు ధీరజ్ అని ధైర్యం చెబుతాడు. ప్రేమ రెస్టారెంట్లో వెయిటర్ గా పనిచేయడం ధీరజ్ కు నచ్చదు వాళ్ళిద్దరి మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. ప్రేమ మాటని పడేసేవిని పెట్టకుండా ధీరజ్ జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భాగ్యం తన భర్తకి అన్నం పెట్టి నువ్వు సంపాదించి పెట్టడానికి ఇదే ఎక్కువ అనేసి అంటుంది దానికి శ్రీవల్లి వాళ్ళ నాన్నమ్మ మీ అమ్మ గడుసుదే కాదు మొగుణ్ణి ఎలా తిప్పాలో అలా తిప్పుతుంది అనేసి అంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం చందు ఇంకా ఫోన్ చేయలేదని ఫోన్ ని పట్టుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అమ్ము మీ అల్లుడు ఇంకా ఫోన్ చేయలేదే అనేసి అడుగుతుంది. ఫోన్ చెయ్యకపోతే నువ్వే ఫోన్ చెయ్ అమ్మ చేసి చేయకుండా ఒక మిస్డ్ కాల్ అట్ట ఇవ్వు అనేసి అంటుంది ఇక శ్రీవల్లి అలానేని మిస్డ్ కాల్ ఇస్తుంది. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చి అలా చెప్పి చెప్పకుండా మెసేజ్ లు చేస్తే అల్లుడుగారు లైన్ లోకి వస్తారని అంటుంది. వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది. చందు మొత్తానికి తన దారిలోకి వచ్చేసాడని భాగ్యం అనుకుంటుంది..
బుజ్జమ్మ ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ధీరజ్ ఇంకా రాలేదని బాధపడుతూ ఉంటుంది. నాన్నన్న మాటలకి ధీరజ్ ఎంత నొచ్చుకున్నాడో ప్రేమ ధీరజ్ ఇంకా రాలేదనేసి ఎదురుచూస్తుంది. నర్మదా వచ్చి ఏంట అత్తయ్య ఇంకా ఎదురు చూస్తున్నారు ఎవరి కోసం అంటే ధీరజ్ ఇంకా రాలేదమ్మా.. వాడు బాధ పడ్డాడు అనేసి భుజం అంటుంది.. అప్పుడే రామరాజు వచ్చి బుజ్జమ్మ ఇంకా అందరూ వచ్చారా పెద్దబ్బాయి కోడలు అందరూ వచ్చారా భోజనం చేద్దాం రా అనేసి అంటాడు. ఇక అందరూ భోజనం చేస్తున్నప్పుడు చందు సిగ్గుపడుతుంటే వదిన మెసేజ్ చేసిందని సెటైర్లు వేస్తారు.
అప్పుడే ఇంట్లోకి ధీరజ్, ప్రేమ ఇద్దరూ ఇంటికి వస్తారు.. బుజ్జమ్మ భోజనం చేద్దాం రండి టైం కి వచ్చారు.. ప్రేమ నాకు ఆకలిగా లేదు అత్తయ్య అని అంటుంది. ధీరజ్ అయితే మాట్లాడకుండా వెళ్లి లోపల తలుపు వేసుకుంటారు. బుజ్జమ్మ ధీరజ్ తినడానికి రాలేదు మీరు ఒక మాట చెప్పండి వాడు తినడానికి వస్తాడని అంటుంది. దానికి రామరాజు ఒప్పుకోడు తండ్రిని మోసం చేయాలనుకున్నాడు ఇప్పుడు తినకుండా ఏమి ఉండడు వాడు బయట తినేసే వచ్చుంటాడులే నేను పిలవాల్సిన అవసరం లేదు అనేసి అంటాడు.
నర్మదా రామరాజుకి ఆ సంబంధం గురించి ఏదో తేడా ఉందని చెప్పబోతుంది కానీ సాగర్ మాత్రం చెప్పద్దని చెప్తాడు. ఏమైంది ఎందుకు చెప్పొద్దు అన్నావు అంటే నీకు తర్వాత చెప్తాను నువ్వు కాంగ్ తిను అనేసి అంటాడు.. ఇక సాగర్ నర్మదా గదిలోకి వెళ్లి గొడవ పడతారు. నేను ఆ పెళ్లి సంబంధం గురించి ఏదో తప్పు జరుగుతుంది తేడాగా ఉందని మావయ్యతో చెప్పాలనుకున్నాను కానీ నువ్వు ఎందుకు సాగర్ అర్థం చేసుకోకుండా నన్ను వద్దని ఆపావు అనేసి అంటుంది నర్మదా.. అమ్మంటే కొత్తగా నువ్వు ఒక దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చావు వాళ్ళు మా నాన్నని ఎంతగా అవమానించారో చూసావు కదా ఇప్పుడు మళ్లీ మా నాన్నని అవమానించాలని చూస్తున్నావా? అని సాగర్ నర్మదతో గొడవ పడతాడు..
నువ్వు ఈ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాలని అస్సలు ప్రయత్నాలు చేయకు ఈసారి గనకాల అన్ని ప్రయత్నాలు చేస్తే నా జీవితంలో నుంచి వెళ్ళిపోతావని సాగర్ అంటాడు దానికి నర్మదా కోపంగా వెళ్లి పడుకుంటుంది. బుజ్జమ్మ తన చిన్న కొడుకు తినలేదని బాధపడుతూ ఉంటుంది. కనీసం వీళ్ళకి పాలైన ఇవ్వాలని అనుకుంటుంది. బుజ్జమ్మ పాలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పాలు తాగడానికి ఇష్టపడరు. మీరు తినలేదని నేను కూడా తినలేదు అది మీకు ఇష్టమా మీరు తినకుండా ఈ అమ్మాయి ఎలా తింటుందని అంటూ బాధపడతారు. బుజ్జమ్మ ఎంత చెప్పినా నాకు ఈ పాలు వద్దు ఏమీ వద్దు అమ్మ నేను సంపాదించిన రోజే నేను ఇంట్లో తింటాను అనేసి ధీరజ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో సాగర్ మధ్య గొడవ గురించి తెలుసుకోవాలని బుజ్జమ్మ ప్రయత్నిస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…