E-Paper
Advertisement

Bracewell: సాంట్నర్ పై వేటు…న్యూజిలాండ్ కెప్టెన్ గా బ్రేస్‌వెల్.. పాకిస్థాన్ తో టీ20లు ఆడే జట్టు ఇదే !

Bracewell: సాంట్నర్ పై వేటు…న్యూజిలాండ్ కెప్టెన్ గా బ్రేస్‌వెల్.. పాకిస్థాన్ తో టీ20లు ఆడే జట్టు ఇదే !
Advertisement

Bracewell: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 tournament ) ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన న్యూజిలాండ్… పాకిస్తాన్ తో మ్యాచులకు సిద్ధమవుతోంది. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ( Pakistan vs New Zealand )  జట్ల మధ్య… 5 t20 మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 16వ తేదీ ఆదివారం నుంచి… న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మొన్నటి వరకు ఈ రెండు జట్లు ఛాంపియన్ ట్రోఫీ ఆడిన సంగతి తెలిసిందే. చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో గ్రూప్ స్టేజి నుంచి ఎలిమినేట్ అయింది పాకిస్తాన్. కానీ న్యూజిలాండ్ మాత్రం ఫైనల్ లో టీమిండియా చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.

Also Read:  Rohit – Salaar: ప్రభాస్ ను ఫాలో అయిన రోహిత్.. కోపంతో వికెట్ తో తీసి !

Advertisement

ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య టి20 లు అలాగే వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సిరీస్ నేపథ్యంలో… న్యూజిలాండ్ తమ టి20 జట్టును ప్రకటించింది. ఇందులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ పైన ( Mitchell Santner ) వేటు  వేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అతని ప్లేస్ లో మైఖేల్ బ్రేస్‌వెల్ ను కెప్టెన్ చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వాస్తవానికి… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో చాలా మంది న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ లందరూ…. ఇండియాకు వెళ్తారు. అందుకే స్టార్ ప్లేయర్లు అందరినీ పక్కకు పెట్టి… కేవలం… కొత్త ప్లేయర్లతో జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ టీం. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ కెప్టెన్సీ పదవి మైఖేల్ బ్రేస్‌వెల్  కు వచ్చింది.

Also Read:  Most ICC Tropies: ఐసీసీ టోర్నమెంట్లు ఎక్కువగా గెలిచింది ఎవరు.. టీమిండియాకు ఎన్ని వచ్చాయి ?

Advertisement

ఇది ఇలా ఉండగా… పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే 5 t20 లు, మూడు వన్డే మ్యాచ్లు మొత్తం కూడా న్యూజిలాండ్ దేశంలోనే జరగనున్నాయి. ఈ మేరకు.. షెడ్యూల్ కూడా ఖరారు అయింది. మార్చి 16వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు టి20 సిరీస్ జరగనుంది. ఇక మార్చి 29వ తేదీ నుంచి వన్డేలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ సిరీస్ ముగుస్తుంది.

న్యూజిలాండ్ జట్టు : మైఖేల్ బ్రేస్‌వెల్ (Michael Bracewell  ) (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (గేమ్‌లు 4 మరియు 5 మాత్రమే), మిచ్ హే, మాట్ హెన్రీ (గేమ్‌లు 4 మరియు 5 మాత్రమే), కైల్ జామిసన్ (గేమ్‌లు 1, 2 మరియు 3 మాత్రమే), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ’రూర్కే (గేమ్‌లు 1, 2 మరియు 3 మాత్రమే), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×