E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: దొంగగా మారిన శ్రీవల్లి.. అర్రె అడ్డంగా ఇరుక్కుందే.. వల్లితో డ్యాన్స్ చేయించిన నర్మద..

Illu Illalu Pillalu Today Episode: దొంగగా మారిన శ్రీవల్లి.. అర్రె అడ్డంగా ఇరుక్కుందే.. వల్లితో డ్యాన్స్ చేయించిన నర్మద..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ అమూల్యని కాలేజీకి రెడీ చేసి వెళ్ళమని చెప్తుంది. ఇప్పుడు నా మరదలు చాలా అందంగా ఉంది కాలేజీకి వెళ్తే అంతా మర్చిపోతావు అని ప్రేమ అంటుంది. నాకు భయంగా ఉంది వదిన అని అమూల్య ఎంతగా చెప్తున్నా సరే ప్రేమ మాత్రం భయపడడం ఎందుకు? కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ అందరితో నాలుగు రోజులు సరదాగా ఉంటే అన్ని మర్చిపోతావు అని ప్రేమ అంటుంది.. చాలా థాంక్స్ వదినా అని అమూల్య ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మా చెల్లెలు గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అది నేను నా వాళ్ళు తీసుకుంటారు నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవద్దని ధీరజ్ అంటాడు.. ఇక తర్వాత ధీరజ్డు ప్రేమని ఎంతగా అసహ్యించుకుంటున్న సరే ప్రేమ మాత్రం ధీరజ్ పై ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది. చందు బావకి వాయిస్ నోట్ పంపించాను అని ప్రేమ అనగానే నాకు కాపురం కొల్లేరా ఎలా ఉంది అని శ్రీవల్లి పరిగెత్తుకుంటూ స్కూల్ కి వెళ్తుంది.. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగానే నర్మదా ప్రేమలు ఇద్దరు కూడా శ్రీరామనవమికి నీకు చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆనంద్ రావు భాగ్యం ఇద్దరు చాలా సంతోషంగా ఒకరినొకరు పొగుడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ రొమాంటిక్ కపుల్ గా ఉంటారు. భాగ్యం ఏంటి నీ సరసాలు మీ వయసు ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? అని అంటుంది.. వయసు అయిపోయిన దెయ్యాలు స్మశానంలో కూర్చుని వేదాలు వల్లిచ్చాయి అంట అలా ఉంది నీ పరిస్థితి అని భాగ్యం అంటుంది.. అదేంటి భాగ్యం ఇడ్లీలు మిగిలిపోయాయి కదా అని వాటిని పడేస్తామా ఏంటి పిండిలో కలిపేసి పునుగులు వేసుకుని అమ్మేస్తాం కదా అలానే ఇది కూడా అనేసి ఆనందరావు అంటాడు. ఈ వయసులో చేసేది ఏమీ లేదు కానీ ఇప్పుడు ఇలా రెచ్చిపోతున్నావేంటి దూరంగా కూర్చో నేను అక్కడ మా అమ్మడు ఏం చేస్తుందో ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కోవాలి అని భాగ్యం శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది.

Advertisement

శ్రీవల్లి అక్కడ కూర్చొని దోమలను చంపుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్ చెయ్ కానీ ఏడుస్తుంది.. ఏంటే సంతలో తప్పిపోయిన బరిదూడలాగా అలా మొత్తుకుంటున్నావ్ ఏంటి అని భాగ్యం అంటుంది.. ఏంటమ్మా నేను మా ఏడుపు నీకు బరదూడ లాగా ఉందా ఏం మాట్లాడుతున్నావు అని శ్రీవల్లి బాధపడుతుంది.. ఈ బాధలనుంచి నువ్వు బయటపడాలంటే ఆ ఫోన్ నువ్వు కొట్టేయాల్సిందేనని ఆనందరావు భాగ్యం ఇద్దరు కలిసి శ్రీవల్లిని రెడీ చేసి దొంగతనం చేయమని చెప్తారు. ఒకవేళ దొరికితే నా పని అంతే అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే దొరకకుండా చేయాలి అని రెచ్చగొట్టి పంపిస్తారు.. రెచ్చిపోయిన శ్రీవల్లి ఆ ఫోన్ కొట్టేయాలని ధీరజ్ వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతుంది.. అక్కడ ఉన్న ఫోన్ ని కొట్టేసి బయటకు వస్తుంది..

అలా బయటికి వచ్చి రాకతలికే ప్రేమ నర్మదలకు దొరికిపోతుంది.. ఫోన్ కొట్టేసాను కదా ఇప్పుడు నాకేంటి భయం అని రెచ్చిపోతుంది. పోనీ తీసుకెళ్లి నీళ్లలో పడేగానే ప్రేమా వాయిస్ రికార్డును వినిపించు అని నర్మద అంటుంది. ఆ వాయిస్ రికార్డు వినగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అది నీ ఫోన్ కాదా అని అనగానే నువ్వు ఇలాంటి పనేదో చేస్తా అని మాకు తెలుసు అక్కయ్.. అందుకే అక్కడ డమ్మీ ఫోన్ పెట్టాము అని నర్మదా ప్రేమ చెప్పగానే శ్రీవల్లి ఫీజులు ఎగిరిపోతాయి.. అది డమ్మీ ఫోనా ఏం మాట్లాడుతున్నావ్ చెల్లాయిలు అని శ్రీవల్లి అంటుంది.. మొత్తానికి ఈ పిల్ల రాక్షసులకు మళ్లీ దొరికిపోయాను అని శ్రీవల్లి కంగారు పడిపోతూ ఉంటుంది..

Advertisement

Also Read : మీనాక్షి కోరికను తీర్చబోతున్న అవని.. పార్వతి పై అక్షయ్ కు అనుమానం.. రాజేశ్వరి సీరియస్..

నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వాయిస్ రికార్డింగ్ లో వాళ్ళందరికీ వినిపించేస్తాము అని ప్రేమ నర్మదా ఇద్దరు కూడా వల్లిని కంగారు పెట్టిచేస్తారు. ఇక వల్లిని డాన్స్ వేయమని ఇద్దరు కూడా ఫోర్స్ చేస్తారు. కచేరి బాగా చేయాలి లేదంటే మాత్రం ఈ వీడియో అందరికీ పంపించేస్తాను అని ప్రేమ బెదిరిస్తుంది. వల్లి మాత్రం ఇక చచ్చినట్టు వాళ్ళు చెప్పినట్లు చేస్తుంది.. ఆ తర్వాత శ్రీవల్లి చచ్చినట్లు డాన్స్ చేయడంతో వాళ్ళిద్దరూ తెగ నవ్వేసుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×