Illu Illalu Pillalu Today Episode March 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ ను అనడంతో ప్రేమ ముందుకు వచ్చి ధీరజ్ కు సపోర్ట్ గా నిలుస్తుంది. మా ఇంట్లో ఎటువంటి గొడవలు జరగలేదు ఎవరికీ ఎవరు కాకుండా పోరు ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా వెళ్లి ఈ నిశ్చితార్థం వేడుకల్ని ఇంకా సంతోషంగా చేద్దామని అందరూ అంటారు. ఇక ధీరజ్ మీ అందరూ నిశ్చితార్థం వేడుకలు అయిపోయేంత వరకు ఉండమని కోరుతారు. అందరి మాట కాదనలేక ధీరజ్ అక్కడ ఉంటాడు.. మొత్తానికి చందు ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ధీరజ్ రాక అసలు సంబరాలు మొదలవుతాయి. అందరూ సంతోషంగా ఉండడం చూసి రామరాజు సంతోష్ పడతాడు. అటు భాగ్యం ఫ్యామిలీ కూడా డాన్స్ లేస్తూ సరదాగా ఉంటారు. మొత్తానికైతే ఎంగేజ్మెంట్ అనుకున్న దానికంటే గ్రాండ్ గానే పూర్తవుతుంది. ఇక భాగ్యం అనుకున్నట్లుగానే అందరికీ డబ్బులను ఇస్తుంది. భాగ్యం తెలివిని చూసి తన భర్త పొగడ్తల వర్షం కురిపిస్తారు.. ఎంగేజ్మెంట్ అయితే పూర్తయింది కానీ ఇక ఆలోచించేది పెళ్లి నేనెప్పుడూ చిన్న విషయాలు గురించి కాదు దాని తర్వాత గురించి ఆలోచిస్తాను అని భాగ్యం అంటుంది. ఈ పెళ్లి సవ్యంగా జరగాలంటే అల్లుడు గారే ముందుకు రావాలి అని భాగ్యం ప్లాన్ వేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామ రాజు ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. కోడళ్ళతో కలిసి వేదవతి పెళ్లి పనులను మొదలు పెడుతుంది. అటు భాగ్యం కూడా కూతురితో అమ్మవారికి పూజలు చేయిస్తుంది. పెళ్లిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలని భాగ్యం పట్టు బట్టి కూర్చుంటుంది. నిశ్చితార్థం అయిన తర్వాత శ్రీవల్లి చందుల మధ్య ప్రేమ పుడుతుంది. శ్రీవల్లి మెల్లగా చందు ని ట్రాప్ చేస్తుంది. చందు తన బుట్టలో వేసుకొని తన పుట్టింటి కష్టాలను పోగొట్టాలని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. అటు చందు ఎంగేజ్మెంట్ ని తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు. మరోవైపు తన తమ్ముణ్ణి తన కన్న తండ్రి పెళ్లికి రావద్దు అని చెప్పడంతో బాధపడుతూ ఉంటాడు.
ధీరజ్ ని తీసుకొని సాగర్ చందు ఇద్దరు రామరాజ దగ్గరికి వెళ్తారు. మేము పేరుకే అన్నదమ్ములం కానీ స్నేహితులం కన్నా ఎక్కువగానే పెరిగాం నాన్న మా ముగ్గురిని విడదీయాలని నువ్వు అనుకుంటున్నావా అని చందు అడుగుతాడు. నాకు పెళ్లవుతుంది అంటే ముందుగా సంతోషించేది నా తమ్ముడే నాన్న నువ్వు ఆ సంగతి మర్చిపోతున్నావు.. వాడి పెళ్లికి ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే అసలు పెళ్లి చేసుకోను అని చందు మొండికేసి కూర్చుంటాడు. ఇక రామరాజు తన కొడుకు పెళ్లి కోసం ఆశలు పెట్టుకొని బతుకుతుంటాడు. ఇక తప్పక ధీరజ్ ను చందు పెళ్లి పనుల్లో బిజీ అవమని అంటాడు.
ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నువ్వు నాకు సాయం చేయాలి నేను ఏ తప్పులు చేయకుండా నన్ను కట్టడి చేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ధీరజ్ సంతోషంలో ప్రేమని హగ్ చేసుకుంటాడు. తన భర్త సంతోషం కోసం ప్రేమ ఏదైనా చేస్తుందని అర్థమవుతుంది. మొత్తానికి ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ పుడుతుంది. అందరు సంతోషంగా సందడి చేస్తూ పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. అలాగే అటు భాగ్యముల ఫ్యామిలీ కూడా పెళ్లికూతురు చేత అమ్మవారికి పొంగళ్ళు పెడతారు. పెళ్లి పనులు అయితే మొదలు పెట్టేసాం పెళ్లి ఎలా చేయాలి అని భాగ్యమలు ఆలోచిస్తారు. అయితే.. మన అల్లుడు గారే ఈ పెళ్లిని దగ్గరుండి చేసేలా చేయాలని భాగ్యం అంటుంది. ఆయన గారు చాలా అమాయకుడమ్మా ఆయన మీద నేను ఇష్టాన్ని పెంచేసుకున్నాను మనం తప్పు చేస్తున్నావని తెలిస్తే వాళ్ళు ఈ పెళ్లి ఆపేస్తారు కదమ్మా వాళ్ళు చాలా మంచోళ్ళు కదా అసలు నిజం చెప్పేద్దామా అని శ్రీవల్లి అంటుంది. దానికి భాగ్యం జాలిపడి వంద రూపాయలు ఇస్తారే తప్ప ఈ పెళ్లి జరగదు అని చెప్తుంది.
మరోవైపు రామరాజు తన కొడుకు పెళ్లి ఫిక్స్ అయిందని సంతోషంగా ఉంటారు. అందరికీ తన కొడుకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తాడు. ఇక సంతోషంగా తన కొడుకు పెళ్లి అయితే చూడాలని అనుకుంటాడు. ప్రేమ ధీరజ్లు ఇంట్లో పెళ్లి పనుల్లో బిజీ అవుతారు. గుమ్మనికి మామిడి ఆకులు కడుతూ ఇద్దరు పోట్లాడుకుంటారు. దెబ్బకు ఇద్దరు కిందపడిపోతారు. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..