BigTV English

Illu Illalu Pillalu Today Episode: నర్మదా, సాగర్ ల మధ్య దూరం మాయం.. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: నర్మదా, సాగర్ ల మధ్య దూరం మాయం.. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode may 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంటి దగ్గర ప్రేమ.. వేదవతి దగ్గరకు వచ్చి.. అత్తయ్యా.. మామయ్య రాగానే ట్యూషన్ గురించి చెప్తాను.. నువ్వే ఎలాగైనా మామయ్యని ఒప్పించాలని అంటుంది. దాంతో వేదవతి.. నా ముద్దుల మేనకోడలు ఇంత ముద్దు ముద్దుగా అడుగుతుంటే.. మీ మామయ్యని ఒప్పించకుండా ఎలా ఉంటానూ అని అంటుంది. వాళ్లపై ఓ కన్నేసిన శ్రీవల్లి.. గుడ్లగూబలా చూస్తూ ఉంటుంది. ఎంతైనా సొంత మేనకోడలు కదా.. అందుకే అంత ప్రేమ కారిపోతుంది మరి. కానీ నాకు మాత్రం మండిపోతుంది.. అంటూ తెగ ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంట్లోకి రామారాజు వస్తాడు. వచ్చి రాగానే వేదవతిని సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారా అని అడుగుతాడు.. ప్రేమ ట్యూషన్ విషయాన్ని రామారాజు కు శ్రీవల్లి చెప్తుంది. దాంతో ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతుంది. ఇక ప్రేమ బాధపడుతుంది. శ్రీవల్లినే రామరాజుకి నిజం చెప్పిందని తెలియదనే ధీరజ్వెల్లి శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ ట్యూషన్ విషయాన్ని రామారాజుకు చెప్పిందని తెలుసుకున్న ధీరజ్ కోపంగా వెళ్లి శ్రీవల్లిని అడుగుతాడు. వదిన మీరు ప్రేమ గురించి నాన్నకు చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు ఇంట్లో పుల్లలు పెట్టాలని అనుకుంటున్నారా అన్న విధంగా మాట్లాడుతాడు.  శ్రీవల్లి అడ్డంగా దొరికిపోవడంతో నాటకాలు మొదలు పెడుతుంది. ఇంకొకసారి ప్రేమ గురించి ఏ విషయాన్ని నాన్నగారి ముందర చెప్పద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మీ ఆవిడ కోసం నువ్వు వస్తే నేను మా ఆయనకు చెప్పలేనా అని శ్రీవల్లి వెళ్లి చందు కి చెప్తుంది. అటు నర్మదా వెయిట్ చేస్తున్న కూడా నాన్న చెప్పిన మాట కోసం సాగర్ వెయిట్ చేసి రూమ్ కి వస్తాడు. నర్మదా సాగర్ కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది..

లేటుగా వచ్చిన సాగర్ ను చూసిన నర్మదా కన్నీళ్లు పెట్టుకొని సీరియస్ అవుతుంది. ఎందుకింత కోపంగా ఉన్నావ్ నేను పని మీదే కదా బయటకు వెళ్ళింది అని సాగర్ అంటాడు. సాగర్ ఇంకా భార్యను బ్రతిమలాడుకుంటాడు. అది కోపమంటావా నీకోసం ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ఇదంతా అరేంజ్ చేశాను అంటే నేనొక పిచ్చిదానా అనేసి అంటుంది నర్మదా.. ఆ తర్వాత నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాను. మా నాన్న ఫోన్ చేసిన కూడా నేను తీయను ఈ ఉన్న ఒక్కరోజు నీతోనే గడుపుతాను అని సాగరు ఒట్టేసి చెప్తాడు. ఆ తర్వాత కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పడంతో నర్మదా కూలవుతుంది..


ఇక ఇద్దరి మధ్య దూరం పోయి ఒక డ్యూయెట్ వేసుకుని ఇద్దరూ ఒకటవుతారు. ఇద్దరి మధ్య రొమాన్స్ తో రాత్రి గడిచిపోతుంది.. చందు దగ్గరికి శ్రీవల్లి ఏడ్చుకుంటూ వెళ్లి మీ తమ్ముడు చెప్పింది ఏం బాలేదండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎలాగైనా సరే అన్నదమ్ముల మధ్య గొడవపెట్టాలని నాటకాన్ని రత్తి కట్టిస్తుంది. వయసులో పెద్ద దానిని కూడా చూడకుండా మీ తమ్ముడు నాకు వార్నింగ్ ఇచ్చారు ప్రేమ నీ కన్నా ముందు వచ్చింది. అన్ని హక్కులు ప్రేమకే ఉన్నాయి అని అంటాడా మీకు కొంచెమైనా అనిపించలేదా అని అన్నదమ్ముల మధ్య పుల్లలు పెట్టేస్తుంది. చందు ఎంత చెప్పినా ధీరజ్ అలాంటివాడు కాదు అని అంటూనే ఉంటాడు.

మధ్యాహ్నం రైస్ మిల్లుకు అన్నం తీసుకుని వెళ్లానండి. అక్కడ మావయ్య గారికి మాటలు సందర్భంగా ప్రేమ ట్యూషన్ పెట్టిందన్న విషయం చెప్పాను. దానికే నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడాలా పెద్దాంతం చిన్నతనం లేకుండా నన్ను అంటాడా.. మీ తమ్ముడు ఈ విషయం గురించి మీరు మాట్లాడతారా లేదా అని వల్లి అంటుంది. దానికి చందు నేను కచ్చితంగా అడుగుతానులే అని వల్లిని ఓదారుస్తాడు. మొత్తానికి వల్లి అనుకున్న ప్లాను సక్సెస్ అవుతుంది..

ఇక తర్వాత రోజు ఉదయం చందు బయట కూర్చుని ఉంటాడు. ధీరజ్ అన్నయ్య కాఫీ తాగుతావా ని దగ్గరికి వెళ్తే నువ్వు మీ వదినతో అలా మాట్లాడటం తప్పు కదా అని అడుగుతాడు. ప్రేమ గురించి వదినా నాన్న దగ్గర అలా మాట్లాడటం తప్పు కాదు అన్నయ్య అని ధీరజ్ అంటాడు. అందులో తప్పేంటి ఈ ఇంటికి పెద్ద కోడలుగా తన బాధ్యతని తాను నెరవేర్చింది. ట్యూషన్ చెప్పి పరువు తీయడం ప్రేమ చేసిన తప్పు కాదని ధీరజ్ ను చందు అడుగుతాడు.. ఇద్దరు బాధలు ఆడుకుంటుంటే తిరుపతి ఈ గొడవ కాస్త పెరిగేలా ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.

అరే మీరిద్దరూ మాట్లాడుకున్నట్లు లేదురా గొడవ పడుతున్నట్లు ఉంది ఇంకా ఆపేసేయండి అనేసి అంటాడు. కానీ చందు మాత్రం వెళ్తూ మీ వదినతో నువ్వు అలా చేయడం తప్పు రా అనేసి వెళ్తాడు. ఇక తర్వాత నర్మదా సాగర్ లు హైదరాబాద్ని చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక మిరాకిలా అనిపిస్తుంది. ఇప్పుడు మిల్లు తప్ప బయటకు రాని మీరు ఇలా నాతోపాటు ట్రైనింగ్ కి రావడం.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీ నాన్నకు దొరక్కుండా నాతోపాటు రెస్టారెంట్లో తిరగడం ఇదంతా నాకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ నర్మదా ఫీలవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×