OTT Movie : అడ్వెంచర్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులోనూ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా రెప్ప వేయకుండా ఉండే ఇలాంటి సినిమాలు చాలా అరుదు. అలాంటి సినిమాలు వస్తే చూడకుండా వదులుతామా ? ఇలా అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇది ఒకప్పటి ఎవర్ గ్రీన్ పవర్ రేంజర్స్ లో ఓ సీక్వెల్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
సినిమా 65 మిలియన్ సంవత్సరాల క్రితం సెనోజోయిక్ యుగంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ జోర్డాన్ (బ్రయాన్ క్రాన్‌స్టన్), ఒక రెడ్ రేంజర్ లను గ్రీన్ రేంజర్ అయిన రీటా రిపల్సా (ఎలిజబెత్ బ్యాంక్స్) చీట్ చేస్తుంది. రీటా, జియో క్రిస్టల్‌ను స్వాధీనం చేసుకొని విశ్వాన్ని ఆక్రమించాలనే ఆలోచనతో ఉంటుంది. జోర్డాన్ తనను తాను త్యాగం చేసి, ఐదు పవర్ కాయిన్‌లను దాచి, రీటాను సముద్ర గర్భంలో చిక్కుకునేలా చేసి, ఆమె ప్లాన్ ను ఆపడానికి ట్రై చేస్తాడు.
21వ శతాబ్దంలో ఏంజెల్ గ్రోవ్ అనే చిన్న పట్టణంలో ఐదుగురు టీనేజర్లు సన్ స్కాట్ (డాక్రే మాంట్‌గోమెరీ), కిమ్బర్లీ హార్ట్ (నయోమి స్కాట్), బిల్లీ క్రాన్‌స్టన్ (ఆర్జే సైలర్), త్రిని (బెకీ జి), జాక్ (లూడీ లిన్) ఉంటారు. వీళ్ళంతా ఒక గనిలో పవర్ కాయిన్‌లను కనిపెడతారు. ఈ కాయిన్‌లు వారికి సూపర్ పవర్స్ ను ఇస్తాయి. అందరూ కలిసి ఒక గ్రహాంతర నౌకలో జోర్డాన్ ఇప్పటి డిజిటల్ రూపం, అతని అసిస్టెంట్ ఆల్ఫా 5 (బిల్ హేడర్ గాత్రం)ను కలుస్తారు. జోర్డాన్ వారిని కొత్త పవర్ రేంజర్స్‌గా ఎంపిక చేస్తాడు. రీటా రిపల్సా తిరిగి పునర్జన్మ పొంది, జియో క్రిస్టల్‌ను కనుగొని భూమిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుందని హెచ్చరిస్తాడు.
అయితే అప్పటికే జాసన్ ఒక ప్రమాదం తర్వాత ఫుట్‌బాల్ కెరీర్‌ను కోల్పోతాడు. కిమ్బర్లీ తన స్నేహితురాలిని అవమానించినందుకు అపరాధ భావనతో ఉంటుంది. బిల్లీ ఆటిజంతో బాధపడుతూ ఒంటరిగా ఉంటాడు. త్రిని మరి సమస్యతో బాధ పడుతుంది. జాక్ అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకుంటాడు. ఇన్ని సమస్యల్లో ఉన్న వీళ్ళంతా వాటిని అధిగమించి, ఒక బృందంగా కలిసి పనిచేయడం నేర్చుకోవాలి అన్నదే టాస్క్.
మరొవైపు రీటా పునర్జన్మ పొంది, బంగారు ముక్కలను సేకరించి తన భీకర సైన్యం పట్టీస్, గోల్డార్ అనే భారీ బంగారు రాక్షసుడిని సృష్టిస్తుంది. ఆమె ఏంజెల్ గ్రోవ్‌లోని క్రిస్పీ క్రీమ్ డోనట్ షాప్ కింద దాగి ఉన్న జియో క్రిస్టల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రేంజర్స్ అప్పటికే ట్రైనింగ్ పూర్తి చేస్తారు. కానీ రూపాలు మార్చుకోవడంలో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఒక స్ట్రాంగ్ టీం అవ్వలేదు. మరి కలిసికట్టుగా పని చేయలేని ఈ టీనేజ్ రేంజర్స్ ఆ విలన్ ను ఎలా ఎదుర్కొన్నారు? చివరికి ఏం జరిగింది? అన్నది స్టోరీ.
మల్టిపుల్ ఓటీటీలలో
ఇప్పడు మనం చెప్పుకుంటున్నది ఎవర్ గ్రీన్ సూపర్ హీరో మూవీ గురించి. ఈ మూవీ పేరు “పవర్ రేంజర్స్” (Power Rangers). 2017లో విడుదలైన ఈ అమెరికన్ సూపర్‌హీరో సినిమా “మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్” టీవీ సిరీస్ ఆధారంగా ఒక రీబూట్‌గా రూపొందింది. ఈ సినిమా డీన్ ఇజ్రాయిలైట్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇండియాలో ఈ మూవీని Tubiలో ఉచితంగా చూడవచ్చు. Apple TV+, Vudu, లేదా Google Play వంటి ప్లాట్‌ఫామ్‌లలో రెంట్ కి అందుబాటులో ఉంది.