E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 10th: రామరాజు భాగ్యం వాళ్ళని పిలిపించాలి అని చెప్పగానే ప్రేమ సుఖ నేను ఫోన్ చేసి అర్జెంటుగా ఈ విషయం చెప్పకుండా ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటుంది. ఇక సుకన్య కూడా అర్జెంటుగా ఇక్కడికి రమ్మని పిలవగానే చెప్పు అంటుంది ఇక సుకన్య వెంటనే పిలవగానే భాగ్యం వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తారు. ఏం తమ్ముడు ఏదైనా విశేషమా అర్జెంటుగా రమ్మన్నారు నువ్వు మళ్ళీ తల్లి కాబోతున్నావా అంటూ భాగ్యం అడగగానే.. అక్కడికి వచ్చిన రామరాజు మీ కూతురు ఏం చదివింది చెప్పండి అని అడుగుతాడు. దానికి ఆనందరావు నేను ఆల్రెడీ నా కూతురు ఎం ఏ ఇంగ్లీష్ చదివింది అని చెప్పాను సర్టిఫికెట్ కూడా తెచ్చాను. మీరు ఇంగ్లీష్ టీచర్గా జాబ్ కూడా ఇప్పించారు కదా మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు.

రామరాజు దెబ్బ అదుర్స్..

ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశారు. మీ అమ్మాయి చదువు గురించి అంతా తెలిసిపోయింది అని చందు అంటాడు. నాకు ప్రిన్సిపల్ ఎప్పుడో చెప్పాడు మీ అమ్మాయి దొంగ చదువు దొంగ సర్టిఫికెట్ గురించి అని అనగానే భాగ్యం ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే భాగ్యం నా కూతురు చేసిన తప్పు ఏంటి మీరు ఎందుకు నా కూతుర్ని ఇలా అంటున్నారు అని అంటుంది. అయితే వేదవతి నీ కూతురు చేసిన తప్పులని ఇంకా క్షమించే ఓపిక మాకు లేదు మా ఇంట్లో నుంచి ఎక్కువ తిని తీసుకొని వెళ్ళిపొండి. వేదవతి మాట వినగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నా కూతురు మాత్రమే తప్పు చేసిందా మీ ఇంట్లో ఎవరు తప్పు చేయలేదా నా కూతురు ఎందుకు నిందిస్తున్నారు.. నా కూతురు ఏ తప్పు చేయలేదు అని ఎంతగా భాగ్యం బాధిస్తుంది. శ్రీవల్లిని ఎంత వెనకోసుకొని వచ్చినా కూడా వేదవతి నా ఇంటి పిల్లలని నాశనం చేయాలని చూసిన నీ కూతురు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది. అలాగే రామరాజు కూడా శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇక శ్రీవల్లి మాత్రం రామరాజు నీ బతిమిలాడుతూ ఉంటుంది.

రెచ్చిపోయిన భాగ్యం..

Advertisement

నా కూతుర్నే ఇంట్లో నుంచి గెంటేస్తారా అసలు ఏమనుకుంటున్నారు మీరు అంటూ భాగ్యం ఒక్కసారిగా అడ్డుపడుతూ రెచ్చిపోతుంది.. నా కూతురు జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని భాగ్యం ఎంతగా అంటున్న సరే వేదవతి దిమ్మతిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది. అయితే వేదవతి ఏంటే ఇంకా రెచ్చిపోతున్నావు నువ్వు చేసిన మోసాలు దారుణాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా రెచ్చిపోతున్నావేంటి అంటూ భాగ్యంపై సీరియస్ అవుతుంది. నా పిల్లలు మాత్రమే తప్పు చేశారా మీ పిల్లలు ఏ తప్పులు చేయలేదా మీ పిల్లలు చేసిన తప్పులుకి మీరు జవాబు చెప్పండి అంటూ భాగ్యం అనగానే నా ఇంటికి వచ్చి నా పిల్లల గురించి మాట్లాడుతున్నావా ఎవరితో నువ్వు అసలు వేదవతి మాటకు మాట సమాధానం చెబుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

వల్లిని గెంటేసిన వేదవతి..

శ్రీవల్లి నన్ను వదిలిపెట్టండి నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను అని అందరినీ పేరుపేరునా బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే అందరూ కూడా నీ నాటకాలు ఇంకా కట్టిపెట్టు అని అంటారు. ఇక కామాక్షి ఏంటమ్మా వీళ్ళతో మాటలు ఇంత మోసం చేసిన తర్వాత కూడా వీళ్ళని ఇంకా ఇంట్లో ఉంచాలా పదమ్మ వీళ్లిద్దరిని బయటికి గెంటేద్దామని అంటుంది. అటు వేదవతి కామాక్షి ఇద్దరు కూడా భాగ్యం శ్రీవల్లిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు.. ఎందుకే వీళ్ళ కోసం ఏడుస్తున్నావు. వీళ్ళ సంగతి ఏంటో నేను చూస్తాను వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ భాగ్యం రెచ్చిపోతుంది. ఈ క్షణం నుంచి నీ కూతురికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చందు కూడా అనడంతో వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది కానీ భాగ్యం మాత్రం మీ అంత చూస్తాను అంటూ అక్కడినుంచి వెళ్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Related News

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×