Illu Illalu Pillalu Today Episode October 3rd:నర్మదా ఇంటికి తగ్గ కోడలు.. అయితే తనవల్లి మళ్లీ ధీరజ్పె ళ్లి జరిగింది అంటూ రామరాజు నర్మదపై ప్రశంసలు కురిపిస్తాడు. అంతే కాదు వేదవతి నర్మదా మాట్లాడుకుంటూ ఉండగా..నువ్వు నిజంగానే గ్రేట్ బుజ్జమ్మ మంచి కోడల్ని సెలెక్ట్ చేసుకున్నావు అంటూ రామరాజు అనడంతో బుజ్జమ్మ నన్ను బుజ్జమ్మ అన్నాడు అంటూ డాన్సులు వేస్తూ గంతులు వేస్తూ వస్తుంది. ఏమి గవర్నమెంట్ కోడలు ఇదంతా నీ వల్లే జరిగింది కాబట్టి నువ్వే దీనికి కారణం అని నర్మదకు వేదవతి ముద్దుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ ముద్దులు నాకు ఇవ్వడం ఎందుకు మీ ఆయన వెళ్తున్నారు కదా మీ ఆయనకి ఇవ్వు అనేసి నర్మదా అనగానే వేదవతి అవును కదా వెళ్లి మా ఆయనకి ఈ ముద్దులు ఇస్తాను అంటూ సిగ్గు పడిపోతూ ఉంటుంది.
ప్రేమని గదిలోకి తీసుకెళ్లిన రేవతి తను రెడీ అయ్యి వచ్చిన తర్వాత నువ్వు నీ భర్తతో చాలా మర్యాదగా సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము ఈ విషయాన్ని నేను గుర్తు పెట్టుకోవాలి అని ప్రేమకు రేవతి క్లాస్ పీకుతుంది. అయితే ధీరజ్ ఏదన్నా కూడా ఏమీ పట్టించుకోవద్దు మొగుడు పెళ్ళాలు అంటే గొడవల కన్నా సరసాలు ఎక్కువ ఉండాలి అంటూ శారదా అమ్మ కూడా చెప్పడంతో ప్రేమ తెగ సిగ్గు పడిపోతుంది. నీ మొగుడిని నీ కొంగును కట్టేసుకో ఆడదానికి లొంగని మగాడు ఉండడు కదా నువ్వు అలా ధీరజ్ ని నీ గుప్పెట్లో పెట్టుకో అప్పుడు మీరు ఇద్దరు సంతోషంగా ఉంటారు అని శారదమ్మ అంటుంది. అప్పుడే ధీరస్ లోపలికి రావడంతో మేము వెళ్ళిపోతున్నాం బాబు మీరిద్దరూ సంతోషంగా ఉండండి అంటూ శారదమ్మ అంటుంద.. ఏంటి మీ వాళ్ళు నీకు ఏదో గుసగుసలు చెప్తున్నారు అని ధీరజ్ అడుగుతాడు. ఈ విషయాలన్నీ నేను రాత్రి చెప్తాను అని ప్రేమ సిగ్గు పడిపోతుంది. అటు భద్ర మాత్రం చీకటి గదిలోంచి బయటికి రాను అంటుంది..
నర్మదా ఎలాగైనా సరే శ్రీవల్లి బాగోతాన్ని బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో ఇన్ని సమస్యలు రావడానికి కారణం ఆ వల్లే కాబట్టి ఎలాగైనా సరే మావయ్యకి వల్లి గురించి నిజాలు చెప్పి బయటకు పంపించాలి అని నర్మద ఫిక్స్ అవుతుంది. అయితే వల్లి నర్మద పేరు వినగానే భయంతో వణికి పోతూ ఉంటుంది. శ్రీవల్లి మాత్రం నర్మదా పేరు వినగానే ఎక్కడ తన బండారం బయటపెట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుందో అని కంగారు పడిపోతూ ఎవరు పిలిచినా కూడా ఉలిక్కిపడిపోతూ ఉంటుంది. నర్మద మాత్రం ఈ ఇంట్లో సంతోషాన్ని దూరం చేస్తున్న శ్రీవల్లికి ఇంట్లో స్థానం లేదు ఎలాగైనా పంపించేసేయాలి బయటికి అని అనుకుంటుంది. ఇక మగవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళకి వడ్డించాలి అని అనుకుంటారు.అటు ధీరజ్ కి పెళ్లి అవ్వడం ఇటు తిరుపతి ఇంట్లోకి రావడంతో అందరూ సిట్టింగ్ వేయాలని ప్లాన్ చేసుకుంటారు ఎపిసోడ్ కి ఇదే హైలైట్ గా నిలుస్తుంది..
ఆడవాళ్ళందరూ తిని పడుకున్న తర్వాత మగవాళ్ళందరూ కూడా బయట వెళ్లి మందు పార్టీ పెట్టుకుని సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా తిరుపతి కామెడీ ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. తను పెళ్లయింది కానీ నాకు ఇంకా శోభనం కాలేదు అని చెప్పగానే తన మేనల్లుళ్లు ఇప్పటికే లేట్ అయింది.మామ ఇప్పుడు నీకు ఇంకా శోభనం కాలేదంటే ఆ తర్వాత నువ్వు ఎందుకు పనికిరావు అంటూ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే తిరుపతి మాత్రం మన రెండు కుటుంబాలు కలిస్తేనే నా శోభనం అని చెప్పారు అల్లుడు కనీసం చెయ్యి కూడా పట్టుకొని ఇవ్వట్లేదు అని ఒకటే ఏడుపు ఏడుస్తాడు. ఊరుకో మామ చిన్న పిల్లోడిలాగా ఏడుస్తావ్ ఏంటి శోభనం కోసం ఏడుస్తున్నావ్ అంటే అందరూ నవ్వుతారు.నువ్వు ఏదానికైనా స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ ధీరజ్ అంటాడు మొత్తానికి మగాళ్ళంతా కూడా సరదాగా మందు పార్టీలో మజా చేస్తూ ఉంటారు. ధీరజ్ కి రెండోసారి ఇంకా మళ్లీ పెళ్లి అవ్వడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.
నర్మదా ఎలాగైనా సరే శ్రీవల్లి గురించి ఇవాళ బయట పెట్టాల్సిందే.. లేదంటే మాత్రం ఏదో ఒకటి చేస్తూ అందరికీ ఇబ్బందులు తీసుకుని వస్తుంది. మామయ్య నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోకూడదు. సాక్షాలతో సహా శ్రీవల్లి బండారం బయటపెట్టాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వంటగదిలోకి వచ్చిన శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా గురించి నువ్వు ఎక్కడ చెప్తావ్ అని భయపడ్డాను సెల్లాయి. ఇంకెప్పుడు నేను ఏ తప్పు చేయను. ఈ సారికి నన్ను క్షమించి వదిలేయి అని బ్రతిమలాడుతుంది. నా భర్త లేకపోతే నేను అసలు ఉండలేను. ఇప్పటికే మా ఇద్దరి మధ్య మాటలు లేవు తనకు దూరమైతే నేను తట్టుకోలేను అంటూ మళ్ళీ నాటకాలు మొదలు పెడుతుంది. అది అర్థం చేసుకున్న నర్మదా మళ్లీ కొత్త నాటకం మొదలు పెట్టావా నిన్ను నమ్మితే ఇంకొకసారి నా చెప్పుతో నేను కొట్టుకోవాల్సిందే.. అంటూ నర్మదా శ్రీవల్లి గురించి మొత్తం నిజాలను బయటపెట్టేందుకు రెడీ అంటుంది కానీ శ్రీవల్లి మాత్రం ఇంట్లో ఎప్పుడు ఏ బాంబు పేలుతుందని భయపడిపోతూ ఉంటుంది.
ఉదయం లేవగానే ప్రేమ బయట అంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టడం చూసిన నర్మదా ఏంటి పెళ్లయిన తర్వాత ఎంత మార్పు వచ్చింది. నీలో అంటూ ప్రేమ అని ఒక ఆట ఆడుకుంటుంది. ఇంత మార్పు వస్తుందని తెలిస్తే ఎప్పుడూ రెండో పెళ్లి చేసేవాళ్లం కదా అంటూ నర్మదా అనగానే ప్రేమ సిగ్గు పడిపోతూ ఉంటుంది. ఊరుకో అక్క నువ్వు ఏదో ఒకటి అంటూ ఉంటావు అని ప్రేమ అంటుంది. వీళ్లిద్దరూ కన్వర్జేషన్ ఎపిసోడ్కి హైలైట్ గా ఉంటుంది..అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..