E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిక షాక్ ఇచ్చిన జ్యోత్స్న – సూరజ్ పీఏగా జ్యోత్స్న            

Karthika Deepam 2 Serial Today Episode October 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిక షాక్ ఇచ్చిన జ్యోత్స్న – సూరజ్ పీఏగా జ్యోత్స్న            
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  టిఫిన్‌ బండి దగ్గర ఒక్క కస్టమర్‌ కూడా రాలేదని మిగిలిన టిఫన్‌ బస్టాండ్‌ దగ్గర ఉన్న అనాథలకు పంచి మిగిలిన ఇడ్లీలు ఇంటికి తీసుకొచ్చామని పారిజాతం చెప్తుంది. శివనారాయణ కూడా అదే నిట్టూరుస్తాడు. అయితే ప్రారంభించిన మొదటి రోజే ఏ బిజినెస్‌ లాభం రాదని దీప చెబితే.. నీలాగా ఇండ్లీ బండి నడపడం మా వల్ల కాదు కదమ్మా అంటూ పారు వెటకారంగా మాట్లాడుతుంది. దీప బాధపడుతుంది. కార్తీక్‌ మాత్రం మిగిలిన ఇడ్లీలను దీపకు ఇస్తూ.. ఈ పూటకు వీటినే ఉప్మా చేయమని ఫుడ్‌ వేస్ట్‌ అయితే తాతకు ఇష్టం ఉండదని చెబితే.. నువ్వు నన్నే వేస్ట్ అన్నట్టు ఉంది అంటూ శివనారాయణ బాధపడతాడు.

అసలు నువ్వు ఆ నిన్న ఆ టిఫిన్‌ బండి దగ్గరకు రాకుంటే అంత గొడవ అయ్యేది కాదు.. నేను ఇంత దూరం వెళ్లే వాడినే కాదు అంటూ శివనారాయణ కోపంగా కార్తీక్‌నే తిడతాడు. కాక్తీక్‌ బాధగా బయటకు వెళ్లిపోతాడు. వెనకాలే వెళ్లిన  దీప బాధపడకు బావ అంటూ ఓదారుస్తుంది. ఏం అర్థం కావడం లేదు దీప.. ప్రతిదానికి మనమే బలి అవుతున్నాం.. జ్యోత్స్నకు జాబ్‌ రాకున్నా తాత పెట్టిన ఇడ్లీ బండి నడవకున్నా మనమే నిందలు పడుతున్నాం. మాలిని దెబ్బకు మన జీవితాలు అంతా చెల్లాచెదురు అయిపోయాయి. మనం అనుభవించేది దరిద్రం తలుచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది అంటూ బాధపడతాడు కార్తీక్‌.

Advertisement

జ్యోత్స్న తమ పాత ఆఫీస దగ్గరకు వెళ్లి నిలబడి చూస్తుంటుంది. అప్పుడే సూరజ్‌ వచ్చి మా ఆఫీసు ముందు నిలబడ్డావేంటి..? అంటూ ప్రశ్నిస్తే.. నేను ఎక్కడ నిల్చుంటే నీకేంటి..? అయినా ఇది మా ఆఫీసు.. మీరు బలవంతంగా మా నుంచి మా ఆఫీసును లాక్కున్నారు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలియాల్సిన అవసరం లేదు అంటూ తిడుతుంటే.. చూడు వీలైనంత ఎక్కువ మాకు దూరంగా ఉండటానికి ప్రయత్నించు లేదంటే తర్వాత నువ్వే నష్టపోతావు అంటూ సూరజ్‌ హెచ్చరిస్తే.. నష్టపోవడానికి తన దగ్గర ఇంకేం మిగలలేదని.. తమను మోసం చేసి పాతాళంలోకి పడేసిన వాళ్లతో యుద్దం చేస్తున్నానని అంటూ జ్యోత్స్న చెబితే.. సరే కానీ ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ సూరజ్‌ చెప్తూ లోపలికి వెళ్లిపోతాడు. తాను ఎందుకు వచ్చానో కాసేపట్లో నీకే తెలుస్తుందిలేరా అనుకుంటుంది జ్యోత్స్న.

జ్యోత్స్నను సూరజ్‌ పీఏగా జరిగే ఇంటర్వ్యూ కోసం దీప, కార్తీక్‌లే పంపిచారేమోనని మాలిని తిడుతుంది. ఆ విషయం తమకు తెలియదని కార్తీక్‌, దీప చెప్పినా మాలిని నమ్మదు. మీ మీద నిందలు పడ్డాయి కదా అందుకే వాళ్లని కలపాలి అనుకున్నారా.. నిన్న నా కొడుకు దాన్ని రిజెక్ట్ చేశాడు. అప్పుడు చూడాలి దాని ముఖం అంటూ మాలిని హేళనగా మాట్లాడుతుంది. కార్తీక్‌ మాత్రం జ్యోత్స్నను తక్కువ అంచనా వేయకు పిన్ని ఎందుకంటే జ్యోత్స్న ఏదైనా చేయాలి అనుకుంటే ఎంతవరకైనా తెగిస్తుంది. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టదు.. జ్యోత్స్నను నువ్వు అనవసరంగా రెచ్చగొట్టి చిక్కుల్లో పడకు అంటూ కార్తీక్‌ హెచ్చరిస్తాడు.

Advertisement

రెండో రోజు కూడా శివనారాయణ టిఫిన్‌ బండి దగ్గరకు ఒక్క కస్టమర్‌ కూడా రాడు. సత్తిబాబు వచ్చి శివనారాయణను హేళన చేసి మాట్లాడతాడు. టిఫిన్‌ సెంటర్‌ నడపడం నీవల్ల కాదని చెప్తాడు. ఈరోజు కూడా ఫ్రీగా టిఫిన్స్‌ పంచడానికి రెడీగా ఉండండి అంటూ చెప్తాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి టిఫిన్‌ చేస్తాడు. టిఫిన్‌ చాలా అద్బుతంగా ఉందని ఎంతని అడగ్గా.. మీరు మొదటి కస్టమర్‌ మీకు ఫ్రీ అంటూ శివనారాయణ చెబితే.. ఇంత రుచికరమైన టిఫిన్‌ ఫ్రీగా తినడానికి నాకు ఇష్టం లేదు అంటూ డబ్బులు ఇచ్చి వెళ్లిపోతాడు ఆ వ్యక్తి. అదే వ్యక్తి తనకు తెలిసిన వాళ్లందరికీ టిఫిన్‌ రుచి గురించి చెప్తాడు. దీంతో శివనారాయణ టిపిన్‌ బండి దగ్గర కస్టమర్లు పెరుగుతారు.

మరోవైపు సూరజ్‌కు కొత్త పీఏ వస్తుందని మేనేజర్‌ చెప్తాడు. మాలిని, సూరజ్‌ అందరూ కొత్త పీఏ ఎవరని ఎదురుచూస్తుంటారు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్నను చూసి మాలిని కోపంగా నువ్వెందుకు వచ్చావు అంటూ తిడుతుంది. పీఏగా అపాయింట్‌మెంట్‌ తీసుకుని వచ్చాను అంటూ చెప్పగానే.. మాలిని ఆ లెటర్‌ చించేయబోతుంది. అప్పుడే దక్షిణమూర్తి ఎంట్రీ ఇస్తాడు. మాలిని ఆ లెటర్‌ లో ఎవరు సైన్‌ చేశారో చూసి చింపమని అంటాడు. మాలిని చూసి షాక్‌ అవుతుంది. అందులో దక్షిణమూర్తి సంతకం ఉంటుంది. మాలిని మామయ్య మీతో మాట్లాడాలి అంటూ చెప్తుంది. దక్షిణమూర్తి మాత్రం జ్యోత్స్న జాబ్‌ విషయంలో తప్పా తన నిర్ణయం మారదని చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కరిగిపోయిన మీనాక్షి.. పార్వతికి నిజం చెప్తారా..?

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. గోపికకు నిజం చెప్పిన మహా.. కత్తి పట్టిన నారాయణ.

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి డెడ్ లైన్.. నర్మద నిజం బయపెట్టేస్తుందా..? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Saturday Tv Movies :శనివారం టీవీ సినిమాలు..ఏ ఒక్కటి మిస్ చెయ్యొద్దు..

Ninnu kori Serial Today Episode October 3rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: నీలగిరి నిజ స్వరూపం చంద్ర పసిగడుతుందా..?  

తిరిగితే తప్పేంటీ…తల్లితో విదేశీ పర్యటనలపై సుప్రత ఫైర్!

Big Stories

Advertisement
×