Illu Illalu Pillalu Today Episode September 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి నర్మదని మీరు పొగుడుతున్నారేంటి అని ఇంట్లో ఉన్న వస్తువులను పగలకొడుతూ అరుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంత కంగారు ఎందుకు పడుతున్నావు అమ్మడు నర్మదని పొగడం నీకేం ఇబ్బంది జాబ్ తెచ్చుకునింది ప్రమోషన్ కొట్టింది అంతే కదా దాని గురించి నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం ఏంటి అని భాగ్యం అంటుంది… ఆనందరావు కూడా ఈ డబ్బులు తీసుకొని నువ్వు నీ సమస్యను పరిష్కరించుకో మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు నీకే సంబంధం లేదు అని అంటారు. శ్రీవల్లి ఆ పది లక్షలు చూడగానే తన కోపం అంతా ఆవిరి అయిపోతుంది. నువ్వు ఏమి చేస్తున్నావు ముందు నీకు కాపురంలో నిలబెట్టుకో.. అల్లుడు గారికి నీకు మధ్య దూరం పోవాలంటే నువ్వు కచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని భాగ్యం ఒప్పించేస్తుంది. మొత్తానికి అల్లుడు గారికి నీకు మధ్య దూరం పోవాలంటే నువ్వు కచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని భాగ్యం ఒప్పించేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నేను డబ్బులు తీసుకున్న సేటు అలాంటివాడు నన్ను అంతగా టార్చర్ చేశాడు. కాబట్టే నేను వల్లి తో అలా మాట్లాడిన తప్ప వల్లి అంటే నాకు ప్రాణం అని చందు అంటాడు.. ఆ తర్వాత వల్లిని భాగ్యం బయటకు తీసుకొని వస్తుంది. అయితే అక్కడే ఉన్న భద్ర విశ్వం చూసి వల్లితో నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళు చెప్పినట్టు విను నీకు కావాల్సింది వచ్చింది కదా నీకు కాపురం కి ఇక్కడ డోకా లేదు అని భాగం చెప్తుంది. భద్ర అనుకున్న ప్లాన్ సక్సెస్ అవడంతో విశ్వం ఇద్దరు కూడా సంతోషంలో మునిగిపోతారు. వల్లి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది..
అయితే ఆ తర్వాత శ్రీవల్లి అమూల్యని ఎలాగైనా సరే ఆ విశ్వం గాడిచేతిలో పెట్టాలని అనుకుంటుంది.. ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఆ కళ్యాణ్ గాడి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ తనలో తానే మొదలు పడిపోతూ ఉంటుంది. ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నాకు ఆకలి బాగా వేస్తుంది కడుపులో డైనోసార్లు పరిగెడుతున్నాయి తిందాం రా అనేసి బ్రతిమలాడుతాడు.. ప్రేమ ఎంత చెప్పినా సరే ధీరజ్ మాట వినదు. నువ్వు కళ్యాణి నుంచి తప్పించుకోవడానికి నన్ను పెళ్లి చేసుకున్నానని ఎన్నోసార్లు అన్నావు.
ఆరోజు నీ దగ్గరికి రాకుండా ఉంటే నేను బాగుండే వాడిని అని ఎన్నోసార్లు అన్నావు అంటే నీకు నేనంటే ఇష్టం లేదు కదా… కళ్యాణ్ గురించి ఎన్నిసార్లు నీకు చెప్పాలని ప్రయత్నించిన సరే నువ్వు నేను చెప్పే మాట అసలు వినలేదు నాకెంత బాధ వేసింది ధీరజ్ నువ్వు కొంచెం ఆలోచించవా.. నేను నీకు కేవలం ఒక వస్తువుని మాత్రమే అని నాకు బాగా క్లియర్గా అర్థం అయిపోయింది.. ఇప్పుడు ఇలా నామీద ప్రేమ ఉన్నట్లు చేయడం అవసరం లేదు అని ప్రేమ ఉంటుంది..
ప్రేమ కోపాన్ని పోగొట్టేందుకు ధీరజ్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు.. కానీ ప్రేమ మాత్రం అస్సలు మాట వినకుండా వెళ్ళిపోతుంది. నర్మదా సాగర్ల మధ్య రొమాన్స్ కి తెరలింపుతారు.. భార్యకు ప్రమోషన్ వస్తే ఎవరైనా గిఫ్ట్ తెచ్చిస్తారు.. నువ్వు మాత్రం మల్లెపూలు తీసుకొచ్చావు. నువ్వేం మగాడివి స్వామీ అని నర్మదా అంటుంది.. ఎందుకు ఇలా చేస్తున్నావ్ సాగర్ అని నర్మదా అడుగుతుంది. నర్మదా అనుకున్న విధంగానే సాగర్ నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాను. ఇప్పటివరకు నా పెళ్ళాం గవర్నమెంట్ ఉద్యోగి అని వాళ్ళందరూ రేపటి నుంచి భార్యాభర్తలిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగులు అని అంటారు అని సాగర్ అంటాడు.
Also Read : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
శ్రీవల్లి చందును ఎలాగైనా సరే మళ్లీ లైన్ లో పెట్టుకోవాలని అనుకుంటుంది.. మీ ఇంట్లో గొడవలు రావడం ఇష్టం లేదా చందు వర్క్ చేసుకుంటే అక్కడికి వెళ్లి కావాలని ఏడుస్తుంది. మళ్లీ ఇద్దరూ కలిసి ఒక్కటైపోతారు. ఇక తర్వాత చందు శ్రీవల్లి మళ్లీ ఎప్పటిలాగే సంతోషంగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి…