E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి స్టార్ట్.. వల్లి బాగోతం తెలుస్తుందా..? పెళ్లి ఆగిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి స్టార్ట్.. వల్లి బాగోతం తెలుస్తుందా..? పెళ్లి ఆగిపోతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 25th: ప్రేమ వెనకాల బాడీగార్డ్స్ ఉండడం చూస్తున్న భద్ర ఏంటి భయపడ్డారా నాకు తెలుసు ఆ బాడీ గార్డులను నేను పెట్టలేదు ఆ చింతామణి పెట్టింది అని అంటుంది.. ఏంటి ఆ చింతామణి బాడీ గార్డ్లను పెట్టిందా ఎందుకు ఏమైంది అని వేదవతి అడుగుతుంది.. మీ మీద కోపం కాదు.. వీడి మీద కోపంతోనే తను ఇలా తన మనుషులని ప్రేమకు కాపలాగా పెట్టింది.. తన కూతురి పెళ్లిని నా తమ్ముడు తో జరగనివ్వకుండా వీడు క్యాన్సిల్ అయ్యేలా చేశాడు. అయితే వీడి మీద కోపంతోనే వీడి పెళ్లి జరగకుండా చేయాలి అని చింతామణి కంకణం కట్టుకుంది అని భద్ర అంటుంది. అందరూ కలిసి ధీరజ్ కి వార్నింగ్ ఇస్తుంది అని అనుకుంటారు కానీ ధీరజ్ ఎక్కడ తగ్గకుండా మాటకు మాట సమాధానం చెప్పి భద్రతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో భద్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది..

రామారాజు మాటతో షాక్..

రామరాజు చాలా సంతోషంగా అందరికీ పెళ్లి కోసమని బట్టలు తీసుకుని వస్తాడు. ముందు వేదవతికి ఇవ్వమని అమూల్యచేత ఇచ్చిన సరే తన కొడుకు పెళ్లి కాబట్టి తీసుకుంటున్నాను అని అంటుంది. అయితే ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగని అనే రామరాజు అంటాడు. తన సంతోషమే ముఖ్యం కాబట్టి ధీరజ్ ఈ పెళ్లి చేయాల్సిందే అని అనుకుంటారు. అయితే వేదవతి పెళ్లికూతురుకి చీర ఇవ్వాలని చెప్పగానే నర్మదా శ్రీవల్లిని కూడా తీసుకొని వెళ్దామని అంటుంది. శ్రీవల్లి నేనెందుకు మధ్యలో అని అనుకున్న సరే అక్కడ ఉన్న మనుషులని ఆపడానికి పనికొస్తుంది తనని వాడేద్దామని నర్మదా అంటుంది. మొత్తానికి పెళ్లి చీర ఇద్దామని ఆ ఇంటికి తింటే అక్కడున్న మనుషులు ఆపేస్తారు.

ధీరజ్ పెళ్లి సందడి..

Advertisement

ధీరజ్ ప్రేమలో పెళ్లి సందర్భంగా పెళ్లి పనులను ఇంట్లో చాలా గ్రాండ్ గా మొదలుపెడతారు. అయితే ముందుగా ధీరజ్ కి మంగల్ స్నానాలతో మొదలుపెట్టి పెళ్లి పనులను మొదలు పెట్టేస్తారు. మంగళ స్నానాలు చేస్తూ ఉండగా అందరూ చాలా సరదాగా ఉంటారు కానీ మళ్ళీ మాత్రం పగలబడి నవ్వుతూ ఉంటుంది. నర్మదకు ఎందుకు నువ్వు ఇలా కుళ్ళు కుంటున్నావు అని అనుమానం వస్తుంది. ఆగిపోయే పెళ్లికి హడావిడి ఎక్కువ అని నోరు జారి నిజం చెప్పేస్తుంది శ్రీవల్లి. అటు ప్రేమకి కూడా విశ్వం మంగళ స్నానం ఎక్కడ తగ్గకూడదు అని చేయిస్తాడు. అయితే ప్రేమ మాత్రం మొదట షాకేనా కూడా తనిఖీ కూడా మంగళ స్నానాలు చేస్తున్నారని సంతోషంగా ఉండిపోతుంది.

వల్లి బండారం బయటపడుతుందా..?

వల్లి గురించి తెలుసుకునే తన ఫ్రెండ్ శ్వేతకి చెప్పిన నర్మదకు తను ఫోన్ చేసి ఇదంతా చేయడానికి కారణం వల్లిని అని నిజం చెప్తుంది. ఆ మాట వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎలాగైనా సరే శ్రీవల్లి గురించి మొత్తం నిజాలను బయటపెట్టాలి అని అనుకుంటుంది. శ్రీవల్లి చేసిన పనికి ఆ జంట ఇప్పుడు విడిపోయింది అని బాధ పడిపోతూ ఉంటుంది.. శ్రీవల్లికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని నర్మదా ట్రై చేస్తూ ఉంటుంది. అయితే బయట శ్రీవల్లి కనిపించడంతో నర్మదా ఏంటి అక్క ఇంత సంతోషంగా ఉన్నావ్ నీ గురించి నిజాలు తెలియవు అని అనుకుంటున్నావా అని అంటుంది అంతేకాదు అక్కడ ఉన్న బిందెలో ఉన్న నీళ్లల్లో వల్లిని ముంచి నువ్వే ఇదంతా చేసావని నాకు తెలిసిపోయింది నీ బండారం బయట పెడతాను అని అనగానే శ్రీవల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. గురించి ఏం నిజాలు బయటపడ్డాయో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.

పెళ్లికి ధీరజ్ రెడీ..

Advertisement

మంగళ స్నానాలు అయిన తర్వాత ప్రేమ ధీరజ్పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా తయారు చేస్తారు.. అయితే ప్రేమ కూడా పెళ్లికూతురు లాగా రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే దీనికి పిలిచినట్టు కనిపించడంతో కిందకు వెళ్తుంది అయితే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఇదంతా కేవలం ప్రేమ కలగంటున్నట్లు కనిపిస్తుంది. రేవతి ఇంకా నువ్వు ఇలానే ఉన్నావేంటి పెళ్లి చీర కట్టుకొని పెళ్లికూతురు లాగా రెడీ అవ్వాలి కదా.. కానీ నువ్వు ఎందుకు ఇలానే ఉన్నావు అని రేవతి అడుగుతుంది ప్రేమ మాత్రం నేను వెళ్ళను నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని ప్రేమ సీరియల్ అవుతుంది. అయితే భద్రావతి వాళ్లు వచ్చి ప్రేమకి ఇష్టం లేదని చెప్తున్నారు కదా ఎందుకు మీరు బలవంతం చేస్తున్నారు అని భద్ర అంటుంది ఎలాగైనా సరే ప్రేమని దూరంగా తీసుకెళ్లాలని భద్ర ప్లాన్ చేస్తుంది. శ్రీవల్లి మాత్రం నర్మదని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అందరూ పెళ్లి కొడుకు రెడీ అయిపోయారు కదా ఇంక మండపానికి వెళ్లాలి అని అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కరోజు స్ట్రీమింగ్ ఇవే. .

Related News

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య కోసం అవని టెన్షన్.. పల్లవికి షాక్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Ninnu kori Serial Today Episode September 25th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బయట పడ్డ  దాక్షాయణి అసలు రూపం  

Nindu Noorella Saavasam Serial Today Episode September 25th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కుక్క బారి నుంచి మనోహరిని సేవ్‌ చేసిన అమర్‌

Friday Tv Movies : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

బిగ్ బాస్10 లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీస్.. వచ్చి రావడంతోనే గొడవలు!

గుప్పెడంత మనసు జగతి మేడం కొత్త రూట్.. ఫీజు మాత్రం చాలా తక్కువ!

పాట అంటే ఇదిరా సామి.. ‘సువ్వి సువ్వి’ రీక్రియేషన్ చూసి తీరాల్సిందే!

Big Stories

Advertisement
×