E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 25th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బయట పడ్డ  దాక్షాయణి అసలు రూపం  

Ninnu kori Serial Today Episode September 25th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బయట పడ్డ  దాక్షాయణి అసలు రూపం  
Advertisement

Ninnu kori serial today Episode: సామ్రాట్‌ మీద గుడిలో అటాక్‌ చేసిన రౌడీల్లో ఒకరిని రోడ్డు మీద చూస్తాడు మదన్‌.  ఆ రౌడీ కూడా మదన్‌ను చూసి పారిపోతాడు. మదన్‌ వెంబడిస్తాడు. రౌడీ దొరక్కుండా పారిపోతాడు. వెంటనే తమ బాస్‌కు ఫోన్‌ చేసి సామ్రాట్‌ను కాపాడిన వ్యక్తి తనను చూశాడని వెంబడించాడని వాడికి దొరక్కుండా తప్పించుకున్నానని చెబితే.. నువ్వు వెంటనే ఎక్కడికైనా వెళ్లి దాక్కో అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపో అని చెప్పగానే.. రౌడీ సరే అంటాడు.

గిరిజ కోపంగా శ్రీతో సామ్రాట్‌తో దాక్షాయణితో పెళ్లి గురించి మాట్లాడాలని చెప్తుంది. బావకు ఏమీ గుర్తు లేనప్పుడు పెళ్లి గురించి మాట్లాడటం కరెక్ట్‌ కాదమ్మ అని శ్రీజ చెబితే.. ఏంటే కరెక్ట్‌ కాదు అవతల మీ బావకు చంద్రకు నవ్వుల ఇక ఇకలు ఎలా నడుస్తున్నాయో చూస్తున్నావు కదా అంటూ గిరిజ తిడుతుంది. ఇప్పుడు ఏదైనా జరిగితే నువ్వు నవ్వుల పాలై పోతావు రా వెళ్దాం మాట్లాడదాం అంటూ హాల్లోకి వెళ్లి దాక్షాయణితో పెళ్లి గురించి మాట్లాడతారు. దాక్షాయణ వాడి గురించి తెలుసు కదా అన్నయ్య అంటుంది కానీ శ్రీజ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది అని గిరిజ చెప్తుంది.

Advertisement

శ్రీజ అమ్మానాన్నలు ఇద్దరూ దాక్షాయణితో శ్రీజ, సామ్రాట్‌ల పెళ్లి గురించి గట్టిగా మాట్లాడతారు. దాక్షాయణి కూడా ఆలోచిస్తూ.. నీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది శ్రీజ కానీ ఇప్పుడు వాడి పరిస్థితి చూస్తున్నావు కదా అంటూ చెప్తుంది. శ్రీజ కూడా ఎమోషనల్‌ అవుతుంది. నేను ఫారిన్‌ వెళ్లిపోతాను అని చెప్తుంది. గిరిజ కూడా రెండు రోజుల్లోంచి ఇదే గొడవ.. పెళ్లి చేసుకోకపోతే ఫారిన్‌ వెళ్లిపోయి అక్కడే సెటిల్‌ అవుతానని అంటుంది. ఒక్కగానొక్క కూతురు మమ్మల్ని విడిచి వెళ్లిపోతే ఎలా బతికేది అంటూ బాధపడుతుంది.

ఇంతలో అక్కడకు సామ్రాట్‌, చంద్ర వస్తారు. దాక్షాయణి శ్రీజని ఎందుకు దూరం పెడుతున్నావు అంటూ ప్రశ్నిస్తుంది. దూరం పెట్టడం లేదు అమ్మా నాకు గుర్తు లేదు కదా అంటాడు సామ్రాట్‌. గుర్తు లేకపోయినా సరే నాన్న శ్రీజ నీకు కాబోయే భార్య.. నీ మీదే ఆశలు పెట్టుకుని బతుకుతుంది.. మీ ఇద్దరికి వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను అంటూ దాక్షాయని చెబితే.. సామ్రాట్‌ తాను పెళ్లికి రెడీగా లేనని తనకు కాస్త టైం కావాలని అడుగుతాడు. టైం అంటే ఎంత కావాలి బావ నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఆలోచిస్తున్నావా..? అంటూ శ్రీజ బాధపడుతుంది.

Advertisement

నువ్వేం బాధపడకు శ్రీజ నీకు బావకు పెళ్లి చేస్తానని నేను మాటిచ్చాను. నా కొడుకు నా మాట ఎప్పుడూ కాదనడు.. అంటూ చెప్తుంది. అంతా వింటున్న చంద్ర షాక్‌ అవుతుంది. ఆయన మైండ్ సెట్‌ అవ్వడానికి ఇంకాస్త టైం కావాలి వెంటనే పెళ్లి అంటే ఆయనకు ప్రాబ్లం అవుతుంది అంటూ చంద్ర చెప్పగానే.. దాక్షాయణి సామ్రాట్‌కు నెల రోజుల టైం ఇస్తుంది. అప్పటి వరకు శ్రీజతో క్లోజ్‌గా ఉండమని చెప్తుంది. గిరిజ కోపంగా ఇది కచ్చితంగా అల్లుడి మీద కన్నేసింది సమయం చూసి దీని సంగతేంటో చూడాలి అని మనసులో అనుకుంటుంది.

బయటకు వెళ్లిన చంద్ర ఒక్క నెలలోనే విరాట్‌కు గతం గుర్తుకు వచ్చేలా చేయాలి. ఎలా చేయాలి ఒకవేళ ఇంట్లో వాళ్లు ఎలా నమ్ముతారు. శ్రీజ ఏమైపోతుంది. ఈ పెళ్లి ఆపడానికి కుటుంబాన్ని డిస్టర్బ్‌ చేయాల్సి వస్తుంది. అంటూ పరి పరి విధాలా ఆలోచిస్తుంది. అప్పుడే మదన్‌ వస్తాడు. విరాట్‌ మీద అటాక్‌ చేసిన రౌడీని తాను చూశానని చంద్రకు చెప్తాడు. ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్లి అందరికీ ఆ విషయం చెప్తారు. అందరూ షాక్‌ అవుతాడు. ఆ రౌడీ ఎలా ఉంటాడని దాక్షాయణి అడిగితే మదన్‌ వివరాలు చెప్తుంటాడు.. అప్పుడే విరాట్‌ మీద అటాక్‌ చేయించిన దామోదర్‌ వస్తాడు. దామోదర్‌ ఏమీ తెలియనట్టు అందరికీ నమస్కారం చేస్తూ నటిస్తుంటాడు. అందరినీ భోజనాలకు పంపించాక దామెదర్‌ రూంలోకి వెళ్తాడు. దాక్షాయణి కూడా రూంలోకి వెళ్లి దామోదర్‌ను కొడుతుంది. కట్‌ చేస్తే.. అసలు సామ్రాట్‌ బతక్కూడదని దామోదర్‌ చేత అటాక్‌ చేయించేదంతా దాక్షాయణి అంటూ బయటపడుతుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. సిగ్గుపడ్డ ప్రభా.. బాలుకు అనుమానం..

Podarillu Today Episode : కేశవ, శైలును కలిపిన చక్రీ.. మహా దెబ్బకు షాక్.. అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య కోసం అవని టెన్షన్.. పల్లవికి షాక్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి స్టార్ట్.. వల్లి బాగోతం తెలుస్తుందా..? పెళ్లి ఆగిపోతుందా..?

Nindu Noorella Saavasam Serial Today Episode September 25th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కుక్క బారి నుంచి మనోహరిని సేవ్‌ చేసిన అమర్‌

Friday Tv Movies : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

బిగ్ బాస్10 లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీస్.. వచ్చి రావడంతోనే గొడవలు!

Big Stories

Advertisement
×