Intinti Ramayanam Today Episode August 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని దిగులు పడుతుంది. రాజేంద్ర ప్రసాద్ అవనిని అడుగుతుంది.. మీ అత్తయ్య నువ్వు చెప్పిన మాట వినదు కాబట్టే నేను వాళ్ళిద్దరికీ ద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నాను అని అంటాడు.. నువ్వు ఎన్నిసార్లు ఇలా వెళ్లిన సరే వాళ్లు నిన్ను అవమానిస్తూనే ఉంటారు. తర్వాత ప్రణతి భరత్ ని పిలిచి మనం ఏదో ఒకటి చేయాలి వదినకు అవమానం జరుగుతుంది అని ఆలోచిస్తారు. మా అమ్మ తన నిర్ణయాన్ని మార్చుకునేలా కనిపించలేదు.. మనమే ఏదో ఒకటి చేయాలి అని అంటుంది. భరత్ మాత్రం మా అక్క మీ అమ్మ ఒప్పుకున్న తర్వాతే పెళ్లి అంటుంది. వీళ్ళిద్దరూ పంతం ముందు మనం బలైపోయేలా ఉన్నాము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ప్రణతి భరత్ తో అంటుంది.. పార్వతికి ఇచ్చిన మాట ప్రకారం అక్షయ్ ప్రణతి నీ ఒక కంట కనిపెడతాడు. అవనితో ప్రణతి ఇండైరెక్ట్ వెళ్లిపోతున్నాం అని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ప్రేమగా అవనికి గోరుముద్దలు పెడతాడు. భానుమతి తన మొగుడు కొట్టాడని బాధపడుతూ ఉంటుంది. కమలు భానుమతిని ఓదారుస్తూనే మరోవైపు ప్రణతి పెళ్లి గురించి చెప్తాడు. ప్రణతి భరతులు ఇంట్లోంచి వెళ్లేందుకు మొత్తం సర్దుకుని పెట్టుకుంటారు.. భరత్ ప్రణతి దగ్గరికి వస్తాడు. ప్రణతి ఇంట్లోంచి వెళ్లి పదం పదాన్ని అంటుంది. భరత్ ప్రణతి మాట విని బయటికి వెళ్లడానికి సిద్ధపడతాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోంచి బ్యాగులు తీసుకుని బయటకు వెళ్లిపోతారు. ప్రణతి, భరత్ లు బయటికి రాగానే అక్కడ అక్షయ్ ఎదురుగా ఉండటం చూసి షాక్ అవుతారు. అక్షయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. నాకు కొంచెం ఏదోలా ఉంది అనిపిస్తే వాకింగ్ చేద్దామని బయటికి వచ్చాం అన్నయ్య అని ప్రణతి అంటుంది.
ఏంటి వాకింగ్ కు అయితే ఇలా లగేజ్ను సర్దుకొని వెళ్తారా అని అడుగుతాడు. అసలు మీరు ఎందుకు బయటకు వెళ్తున్నారు అని అవనిని పిలుస్తాడు. ఇంట్లోకి తీసుకెళ్లి వీళ్ళిద్దరూ బయటికి వెళ్లాలనుకుంటున్నారు మనం ఇలానే వదిలేస్తే ఇక్కడికి వెళ్తారు తెలియదు అని అక్షయ్ సీరియస్ అవుతాడు. వీళ్ళిద్దరూ ఇంట్లోంచి లేచిపోవాలనుకుంటున్నారు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అవనిని అంటాడు. ఇందులో భరత్ తప్ప ఏమీ లేదు వదినా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అడిగాను అని అంటాడు. అసలు ఒక ఆడపిల్లని తీసుకెళ్లామని ఎలా అనుకున్నావ్ రా అని అవని భరత్ ని కొడుతుంది.
ఇలాంటివన్నీ జరుగుతాయనే నేను ఆనాడే పెళ్లి చేద్దామని అన్నాను కానీ వీళ్ళు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. ఇప్పుడు నాకున్న సమస్యలు సరిపోవట్లేదా మీరు మళ్ళీ కొత్త సమస్యలు తీసుకురావాలని అనుకుంటున్నారా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే అసలు ఊరుకోను అని ఇద్దరికీ అవని వార్నింగ్ ఇస్తుంది. ఇక అక్షయ్ కి అవని పాలు తీసుకొచ్చి ఇస్తుంది.. చేసిన పనికి నేను మీకు స్వీట్ తీసుకొచ్చి ఇవ్వాలి అర్ధరాత్రి కదా స్వీట్ ఇస్తే బాగోదని ఈ పాలు తీసుకొచ్చి ఇచ్చాను అని అంటుంది.
ఇక అవని అక్షయ్ ని కావాలనే తన మాటలతో ఇరికించేస్తుంది. తనమీద నిజంగానే ఫీలింగ్స్ ఉంటే ఈ పాలు తాగండి ఫీలింగ్స్ లేవు అనుకుంటే మనసులో ఫీలింగ్స్ దాచుకున్నారని అర్థం అని అంటుంది. ఇక ఉదయం లేవగానే భరత్ ఇంటర్వ్యూ కానీ వెళ్లి వస్తూ ఉంటాడు. అటు శ్రేయ లేవగానే పల్లవి ఎదురుగా కనిపిస్తుంది. దేవుడు మొహం చూడాలనుకుంటే నీ దరిద్రమైన మొహాన్ని ఎదురుగా చూపిస్తావ్ ఏంటి అని అంటుంది.
ప్రణతి పెళ్లి విషయంలో నువ్వు నాకు సాయం చేయాలి అని పల్లవి అంటుంది. అది రిక్వెస్ట్ చేసే అడగాలి ఇలా ఆర్డర్ వేసి అడగడానికి నేనేమీ నీ పని మనిషిని కాదు అని శ్రియ అంటుంది. పల్లవి దీంతో ఎందుకు పొద్దున్నే అని రిక్వెస్ట్ చేసి అడుగుతుంది. హెల్ప్ చేయడానికి శ్రేయ ఒప్పుకుంటుంది.. భరత్ ని ఇరికించాలని చక్రధర్ పల్లవి ఇద్దరు పక్క ప్లాన్ ప్రకారం అంత సిద్ధం చేసి రెడీగా ఉంటారు. అయితే భరత్ ని తన ఫ్రెండ్ చేత కావాలని నాటకం ఆడించి ఇరికించాలని అనుకుంటారు.
భరత్ వస్తుంటే తన ఫ్రెండు ఎదురవుతాడు. మా ఇల్లు ఈ పక్కనే ఉంది నా ఫుడ్ టేస్ట్ చేసి వెళ్ళు రా రా అని బలవంతంగా భరత్ ని బండి పై ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళగానే నువ్వు కాసేపు కూర్చొని నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు. భరత్ కూర్చొని ఉండగా సడన్గా పోలీసులు ఎంట్రీ ఇస్తారు. భరత్ వాళ్ళని చూసి టెన్షన్ పడతాడు మీరేంటి సార్ ఇక్కడ ఎవరి కోసం వచ్చారు అని అడుగుతాడు. పోలీసులు ఎక్కడ క్రైమ్ జరుగుతుంటే అక్కడికి మేము వస్తాము ఇంట్లో అంతా సెర్చ్ చేయండి అని అంటారు. ఇంట్లో అంత వెతికితే ఒక అమ్మాయి దొరుకుతుంది అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఈ అమ్మాయి ఎవరు అని భరత్ ని అడుగుతారు.
Also Read: మీనాకు షాకిచ్చిన పోలీసులు.. రోహిణికి దొరికిపోయిన కల్పన..
భరత్ అమ్మ ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నా సరే పోలీసులు నమ్మరు. ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా అని భరత్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అది చూసిన పల్లవి చక్రధర్లు మన ప్లాను గ్రాండ్గా సక్సెస్ అయింది అని సంతోష పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.