Illu Illalu Pillalu ToIlluday Episode july 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదని ప్రేమ బయట వెయిట్ చేస్తుంది. అటు, ఇటు తిరుగుతూ ఉండడం చూసిన శ్రీవల్లి ఏంటి ప్రేమ నీకు బొట్టు కాటుక పెట్టి చెప్పాలా? టైం పది అవుతుంది లోపలికి రావా అని అంటుంది. ధీరజ్ ఇంకా రాలేదు అక్క వెయిట్ చేస్తున్నానని అంటుంది. నేను ఉదయం చెప్పలేదా మర్చిపోయావా పదిగంట్ల కల్లా ఇంట్లో అందరూ ఉండాలి అని.. ధీరజ్ వస్తే బయట ఉంటాడులే నువ్వు లోపలికి రా అని అడుగుతుంది. ధీరజ్ వచ్చిన తర్వాత తలుపు వేస్తాంలే అని ప్రేమ. అదే మాట మావయ్యకి చెప్పు అని ప్రేమతో అంటుంది శ్రీవల్లి. కానీ ధీరజ్ మాత్రం రాలేదు . నువ్వు ఎలా తలపిస్తావో నేను చూస్తాను అని అంటుంది ప్రేమ. ప్రేమను బయటకు గేంటేసి శ్రీవల్లి తలిపేస్తుంది. అప్పుడే ధీరజ్ ఇంటికి వస్తాడు. నువ్వేంటి ఇక్కడ బయట కూర్చున్నావు అని అడుగుతాడు. ఇంట్లోకి వెళ్దాం రా నాకు ఆకలేస్తుంది అని అడుగుతాడు.. మొత్తానికి కిటికీ తీసి ఇంట్లోకి వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి ప్రేమ ధీరజ్ బయటి ఉండిపోయి ఉంటారు అని సంతోషంగా డాన్సులు వేస్తూ లోపలికి వస్తుంది.. ధీరజ్ ప్రేమ లోపల ఉండటం చూసి షాక్ అవుతుంది.. ప్రేమను పిలిచి ఎలా వచ్చారు లోపలికిని అడుగుతుంది.. కానీ ప్రేమ మాత్రం నాకు ఏమీ తెలియదని చెప్తుంది.. అయితే శ్రీవల్లి ఆలోచిస్తూ కిటికీను పట్టుకుంటుంది. ఆ కిటికీ లోంచి శ్రీవల్లి లోపలికి పడుతుంది. కిటికీ నీ తీసి లోపలికి వచ్చారా అని పెద్ద పంచాయతీనే పెడుతుంది.. రామరాజు కచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకోవాలని శ్రీవల్లి చెప్తుంది. ఈ విషయాన్ని కచ్చితంగా మావయ్య గారితో చెప్పి వాళ్లకి శిక్ష పడేలా చేయాలి అని శ్రీవల్లి ఆలోచిస్తుంది.
అనుకున్నట్లుగానే కేకలు వేసి అందరిని ఒక చోటికి చేరుస్తుంది శ్రీవల్లి. ఇంట్లో ఇంత పెద్ద జరుగుతున్న కూడా మనము పట్టి పట్టినట్లు ఉంటే కచ్చితంగా రేపు ఇంకాస్త పెద్దదే చేస్తారు మావయ్య అంటూ నాలుగు ఎక్కించి పుల్లలు పెడుతుంది శ్రీవల్లి.. కచ్చితంగా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి మామయ్య అని శ్రీవల్లి రామరాజుని అడుగుతుంది.. నువ్వేం చేయాలనుకుంటే అది చేయమని రామరాజు అంటాడు. ప్రేమ నర్మదలకు ఇద్దరికీ బాధ్యతలు అప్పగిస్తుంది.
మీరిద్దరూ ఇంట్లో పని కచ్చితంగా చేయాలి అని అంటుంది. ప్రేమకి ఇండ్లు అంత బూజు దులిపి ఇంటిని నీటిగా చేయాలని చెప్తుంది.. నర్మదా ఆఫీస్ కి వెళ్తూ రామరాజుకి ఆఫీస్ కి వెళ్తున్నాను మామయ్య అని చెప్తుంది. కానీ రామరాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు.. అది చూసిన నర్మదా నేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రేమ ఇంట్లో పనులు చేయడం చూసిన సేన బాధపడతాడు.. ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావ్ అమ్మ నేను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. మన ఇంటికి వచ్చేయమ్మా అని బ్రతిమలాడతాడు. అని ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది.
నర్మదా నా ఇంటిని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేయాలి. ఇంట్లో ఇన్ని జరుగుతుంటే నేను మౌనంగా ఉంటే ఏం బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ శ్రీవల్లి దొంగ బ్యాచ్ అని తెలిసి కూడా నేను ఏదో ఒకటి చేయకుండా ఉంటే ఇంట్లో వాళ్లకి ఏదైనా జరిగితే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఆటోని రామరాజు మిల్లుకు తీసుకెళ్ళమని అడుగుతుంది.. మిల్లు కొచ్చిన నర్మదను చూసి రామరాజు తిరుపతి తో ఏం కావాలో చెప్పి పంపించు అని అంటాడు.
తిరుపతి నర్మద దగ్గరకొచ్చి ఏం కావాలి అమ్మ అని అడుగుతాడు.. తిక్క తిక్కగా సమాధానం చెప్తుంది. నేను మావయ్య గారితో మాట్లాడాలి అని అంటే తిరుపతి నర్మద నువ్వు రామరాజు దగ్గరికి తీసుకొస్తాడు. రామరాజు మాట్లాడటం ఇష్టం లేక ఇంట్లో విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు అని ఎంత చెప్తున్నా సరే నర్మదా కన్నీళ్లు పెట్టుకొని తన బాధని చెప్పుకుంటుంది. నన్ను క్షమించండి మామయ్య అని అడుగుతుంది.. నర్మద బాధను చూసి తట్టుకోలేకపోయిన రామరాజు కరిగిపోతాడు.
Also Read : అవనికి అనుమానం.. ప్రణతికి టెన్షన్.. పల్లవికి దొరికిన అవని, అక్షయ్..
సాగర్ ని చూసి నర్మదా బాధపడుతుంది రామరాజు మాత్రం సాగర్ మీ భార్యని దగ్గర దించిరా అని అంటాడు.. ప్రేమ ఇంట్లో పనులు చేయడం చూసి బాధపడిన ధీరజ్.. నువ్వు అన్ని పనులు చేయమని ఎవరు చెప్పారు అని అడుగుతాడు.. నీ భార్య అనే ట్యాగ్ నాకు ఉంది కదా.. నువ్వు నన్ను భార్యగా గుర్తించకపోయినా ఇంట్లో వాళ్ళందరికీ నేను నీ భార్యనే. మీ పెద్ద వదిన ఇవంతా చేయమని చెప్పింది అని ప్రేమ అనగానే నేను ఇప్పుడే వెళ్లి వదినను అడుగుతాను అని ధీరజ్ అంటాడు. ఏమని అడుగుతావు? ఎందుకు అడుగుతావని ప్రేమ అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…