Nagababu: ఏపీలో వైసీపీకి ఇక కష్టకాలమేనా? 2029 ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నా, నేతలు సహకరించడం లేదా? నాగబాబు మాటలపై వైసీపీలో కొందరు నేతలు ఎందుకు చర్చించుకుంటున్నారు? మేలుకోకుంటే లైఫ్ ఉండదని భావిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీపై నాగబాబు ఏమన్నారు?
కేవలం మూడేళ్లు మాత్రమే.. అధికారంలోకి వచ్చేది మనమే ఈ మధ్యకాలంలో జగన్ పదే పదే మాట్లాడుతున్న మాటలు. కానీ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవని అంటున్నారు అంటున్నారు ఆ పార్టీలో కొందరు నేతలు. ఇందుకు నాగబాబు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత పెద్దగా రాజకీయాల గురించి నాగబాబు మాట్లాడిన సందర్భం రాలేదు.
మీడియా ముందు ఏదో చెప్పాల్సిన రెండు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు. విశాఖ వచ్చిన ఆయన, కీలక విషయాలు బయటపెట్టారు.మరో 20 ఏళ్లు వైసీపీలోకి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదన్నారు. మూడు పార్టీల సమన్వయంతో కూటమి ప్రభుత్వం సమర్థంగా పరిపాలిస్తోందన్నారు. చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్తామన్నారు.
మోదీ-చంద్రబాబు-పవన్ మాట్లాడుకుని స్పష్టమైన అవగాహనకు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. కూటమి అధికారంలోకి రాకుంటే ఊహించని దారుణాలు జరిగేవని అన్నారు నాగబాబు. వైసీపీ మైండ్ సెట్ మారలేదన్న ఆయన.. నాకేం కావాలి, నేం సాధించాలి అనే ధోరణిలో ఉన్నారన్నారు.
ALSO READ: జగన్ సింగపూర్ సీక్రెట్.. బట్టబయలు చేసిన టీడీపీ, 143 స్కామ్
పార్టీ నేతలకు చురకలు
అదే సమయంలో పార్టీలో అసహనం వ్యక్తం చేస్తున్న నేతలకు చురకలు అంటించారు నాగబాబు. పార్టీ కోసం పవన్ దశాబ్దమున్నరపాటు పని చేశారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి కేవలం ఏడాది మాత్రమే అయ్యిందన్నారు. ఏడాదిలోపు కొందరు నేతలు అసహనం వ్యక్తం చేయడాన్ని తప్పుబట్టారు.
ఓపిక, సహనం ఉన్నవారు ముందుకెళ్తారని, వారే గొప్ప నాయకుడు అవుతారన్నారు జనసేన ఎమ్మెల్సీ. అనకాపల్లి సీటు త్యాగం చేసిన విషయాన్ని వివరించారు. నేతలు అడ్జస్ట్ కావాల్సిందేనని, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కూటమిని దెబ్బతీయే ప్రయత్నాలు ఎవరు చేసినా సహించేది లేదన్నారు. ఎవరికి ఇవ్వాల్సిన గుర్తింపు వారికి పార్టీ ఇస్తుందన్నారు.
తాను ఉత్తరాంధ్రలో ఉంటానని, ఐదు నుంచి పది రోజుల పాటు కార్యకర్తలను కలుస్తానని చెప్పారు. దామాషా ప్రకారం జనసేనకు నామినేటెడ్ పదవులు వస్తాయని, కొద్దిరోజుల్లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తేల్చిచెప్పారు.
వైసీపీ నేతలు ఏమంటున్నారు?
నాగబాబు మాటలను గమనించిన వైసీపీ నేతలు, కూటమి నేతలు ప్లాన్ ప్రకారం వెళ్తున్నారని అనుకుంటున్నారు. ఇలాగైతే మన పార్టీకి కష్టకాలం తప్పదని చర్చించుకుంటున్నారు. ముందుగా మేల్కొకుంటే రాజకీయ కెరీర్ ముగిసిపోతుందని గుసగుసలు లేకపోలేదు. మరి వైసీపీ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి.
ఇంకో 20 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోకి రాదు
2029 ఎన్నికల్లో గెలుస్తాం అని వైసీపీ వాళ్లు కలలు కంటున్నారు
– ఎమ్మెల్సీ నాగబాబు pic.twitter.com/noWYnnU1i7
— BIG TV Breaking News (@bigtvtelugu) July 28, 2025