Intinti Ramayanam Today Episode April 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. భానుమతి తన ఆయుష్ ఎక్కడ తగ్గిపోతుందో త్వరగా ఎక్కడ చనిపోతుందని ఆలోచిస్తూ తన భర్త చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని పూజ గదిలోకి వెళ్లి అవనికి అన్యాయం జరిగింది. అవని మళ్లీ తిరిగి రావాలి నన్ను క్షమించు దేవుడా అని చేతిలో కర్పూరం పెట్టుకొని హారతిస్తుంది. అది చూసిన పల్లవి ఈ ముసలిదానికి ఏమైంది సడన్గా దెయ్యం పట్టిందా ఏంటి ఇలా మారిపోయింది లేదా పిచ్చి పట్టినట్లు ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. పూజ గది నుంచి బయటికి వచ్చిన భానుమతిని పల్లవి అడుగుతుంది. ప్రశాంత్ ఇంటికి వస్తాడు. అందరు కలిసి అతన్ని అవని దగ్గరకు తీసుకొని వెళ్తారు. అవని కావాలని ఇదంతా చేయించిందని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి నన్ను ప్రేమించి మోసం చేశారని చెప్పాను కదా వదిన ప్రశాంతని చెప్పానుగా వీడే ఆ ప్రశాంత్ అని అంటుంది. ప్రణతిని వీడికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఆపేసి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆస్తిని కొట్టేయాలని చూసావని వీడు చెప్తున్నాడు అది నిజమేనా అని అక్షయ్ అడుగుతాడు.. ఏం మాట్లాడుతున్నారండి మీరు వీడియో కూడా నాకు తెలియదు అంటే ఎందుకు నన్ను ఇలా అడుగుతున్నారు అని అవని షాక్ అవుతుంది. అవని నాకు తెలియదు అన్నమాట చెప్పడంతో కమల్ రెచ్చిపోయి వాడ్ని దారుణంగా కొడతాడు. అవని కూడా వాడిని కొడుతుంది.. నేను నిన్ను పిలిచి పారిపొమ్మని ఎందుకు చెప్తాను రా అని అవని వాడిని కొడుతుంది..
కమల్ మా ఆవని వదిన గురించి మాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్పావంటే నేను ఇక్కడే చంపేస్తానని అంటాడు. కానీ మీరు నన్ను ఏం చేసినా కూడా నన్ను పారిపొమ్మని చెప్పింది ఈ అవనీ అని ప్రశాంత్ అంటాడు. నేను నీకు పారిపొమ్మని చెప్పానా ఎవరు చెప్పారు నీ చేత ఎవరు చేయిస్తున్నారు అని అవని వాడిని దారుణంగా కొడుతుంది. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు అందుకే నువ్వు నాతో మాట్లాడవా నా ఆడియో కూడా నా దగ్గర ఉంది అని ప్రశాంత్ అంటాడు..
ప్రణతి ఇంట్లో పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందని చెప్పగానే పెద్దలతో మాట్లాడాలని అనుకున్నాను. నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది.. నిన్ను అర్జెంటుగా కలవాలని అనుకుంటున్నాను కృష్ణకాంత్ పార్క్ కి రా అని చెప్పింది. ఆమె చెప్పినట్లే నేను అక్కడికి వెళ్లాను అక్కడ చూస్తే ఆమె ఎవరో కాదు ఈ అవనీనే.. నాకు అనుమానం వచ్చింది ఆ తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తే కాలనీ రికార్డ్ చేశాను అని అతను చెప్తాడు. అవని గొంతులో మాట్లాడిన మాటలను తన ఫోన్లో రికార్డ్ చేసినట్లు వినిపిస్తాడు.. అది విన్న పార్వతి షాక్ అవుతుంది. అక్షయ్ నువ్వు ఇంత నిజానికి దిగజారుతావు అని అస్సలు అనుకోలేదంటూ అవనిని అసహ్యించుకుంటాడు.
నా ఇంట్లో నుంచి నేను పంపిస్తే నా కూతురు జీవితాన్ని నువ్వు నాశనం చేయాలని చూసావా నువ్వు ఈ పాపం నీకు ఊరికే పోదు నువ్వు నాశనం అయిపోతావ్ అని పార్వతి శాపాలు పెడుతుంది.. ఇక ప్రణతి దగ్గరికి వెళ్లి మీ వదిన నువ్వు మంచి దానివి అని అనుకుంటున్నావు నీ వెనకాల ఇంత చేసిందని నువ్వు అసలు ఊహించలేదు ఇక మన ఇంటికి వెళ్దాం పదమ్మ అని పార్వతి అడుగుతుంది. ప్రణతి మాత్రం నేను రాను అని ఒక్క మాటతో చెప్పేస్తుంది. ఎవరు ఎలాంటి వారు తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. ఒకసారి నన్ను ప్రేమించి ప్రేమ అనే పదాన్ని నా జీవితంలోకి రాకుండా చేసిన వీడిని నేను అస్సలు నమ్మను అని ప్రణతి అంటుంది.
ప్రణతిని ఎంతగా ఒప్పించాలని చూసినా కూడా నేను వదిన దగ్గరే ఉంటాను అని చెప్పేసి తెగేసి చెప్తుంది. కమల్ వదిన తప్పు చేయలేదని బాధపడుతూ ఉంటాడు. ప్రశాంత్ చెప్పిన మాటల్ని నిజమే అనుకొని నమ్మి అక్కడి నుంచి వాళ్లంతా వెళ్ళిపోతారు. అటు రాజేంద్రప్రసాద్ కు శ్రియా అవనిపై చెడ్డగా చెబుతుంది. అవని అక్క మంచిదే అనుకున్నాను కానీ ఇలాంటి ఆలోచనలు చేస్తుందని అస్సలు ఊహించలేదు. కూతురికి ఇంత జరిగితే మావయ్య గారు బాధపడుతున్నారు ఆయన చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందని శ్రీయా అంటుంది. భానుమతి కూడా అవనీని ఇంట్లోంచి పంపించిన తర్వాత ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నాము. కానీ ఇన్ని కష్టాలు పెడుతుందని అసలు ఊహించలేదని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..