Intinti Ramayanam Today Episode April 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ నిజం చెప్పడంతో అందరు షాక్ అవుతారు. ప్రణతి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు ఎందుకు చేసింది అని అందరూ బాధపడతారు. అవనిని మళ్లీ ఇరికించాలని అనుకుంటుంది పల్లవి . ఆస్తి కోసమే తన తమ్ముణ్ణి ప్రణతి మీ ట్రాప్ చేయించమని చెప్పి ఇలా చేశారు అని అందరూ అంటారు. ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ కోపం కట్టలు తెచ్చుకుంటుంది. భానుమతి చూసావా రాజేంద్రప్రసాద్ నేను మొన్న అంటే నువ్వు కాదని నామీద అరిచావు ఇప్పుడు అదే నిజమైంది అని అంటుంది.. నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా అక్షయని పార్వతి అడుగుతుంది. నేను చెప్పేది నిజం అమ్మ నువ్వు నమ్మిన నమ్మకపోయినా నేను హాస్పిటల్లోనే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నానని అక్షయ అంటాడు. ఆ మాట వినగానే పార్వతి గుండెలు పగిలేలా రోదిస్తుంది. అలాగే ఇంట్లోని వాళ్ళందరూ అవనీదే తప్పంటూ నానా మాటలు అంటారు. కానీ కమల్ మాత్రం వదిన రోజు చెప్పాలనుకున్న విషయం ఇదే ఉంటది. ఎందుకు మీరు ఎవరు నమ్మరు అసలు ఏం జరిగిందన్న విషయం వదినని చెప్పనిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని కమలంటాడు. రాజేంద్రప్రసాద్ ప్రణతిని చంపేయాలనుకుంటాడు మధ్యలో అడ్డు వచ్చినా అవినీకి బుల్లెట్ తగులుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. హాస్పిటల్లో అవని ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది.. కానీ ఇంట్లో రాజేంద్రప్రసాద్ బాధపడుతూ ఉంటాడు నా కూతుర్ని చంపాలనుకొని అవినీతి కాల్చానని అంటాడు. పల్లవి మాత్రం మీరేం తప్పుగా ఫీల్ అవ్వకండి మావయ్య తప్పు చేసేలా చేసిన వారిని కాల్చారు. మంచిపనే చేశారని పల్లవి అంటుంది. ఈ అనార్దాలు అన్నిటికి కారణం అవని కదా.. మంచి పని చేశారు అని పల్లవి అంటుంది. దానికి రాజేంద్రప్రసాద్ అది కరెక్ట్ కాదు నేను చేసింది తప్పే అని దానికి క్లారిటీ ఇస్తాడు.అక్షయ్ అవని కోసం బాధపడుతూ ఉంటాడు. రాజేంద్రప్రసాద్ అక్షయ దగ్గరకొచ్చి నా గారాల కూతురు అలా చేసిందంటే సహించలేకపోయానని అంటాడు. ఇక అక్షయ్ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటాడు. అవనీకి ఏమైందని కమల్ ని శ్రీధర్ ని అడుగుతాడు ఎలా ఉంటే నీకేం అవసరం లేదు కదా అన్నయ్య అనేసి కమలంటాడు. నీకు అవసరం లేదని వెళ్ళిపోయావు కదా నీకు ఎంతసేపు మీ అమ్మ నాన్న నీ తమ్ముడు చెల్లెలు అంతే తాళి కట్టిన భార్య అవసరం లేదు.అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు పిల్లల్ని కనడం ఎందుకు అని కమల్ఆవేశంతో మాట్లాడుతాడు.
శ్రీకర్ మాత్రం వదినకి పర్వాలేదు అన్నయ్య బాగానే ఉంది అనేసి అంటాడు. ఇక అవని మావయ్య ఆవేశంతో ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదంటూ బాధపడుతూ ఉంటుంది. దయాకరు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తానని అంటాడు. పోలీస్ స్టేషన్కెందుకండీ అంటే ఆ రాజేంద్రప్రసాద్ మీద కేసు పెట్టడానికి అని స్వరాజ్యంతో ఉంటాడు. అది విన్న అవని ఆయన ఏదో ఆవేశంలో చేశాడు బాబాయ్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని టెన్షన్ పడుతుంది.
రాజేంద్ర ప్రసాద్ అంటే సమాజంలో పెద్దమనిషి కదా అలాంటి వ్యక్తి ఇలా ముహూర్తంగా ప్రవర్తించడం కరెక్టేనా సొంత కూతుర్ని చంపేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని స్వరాజ్యం అంటుంది. ఈ రాత్రి వరకు మాత్రమే టైమ్ ఇస్తున్నాను రేపు ఉదయం వెళ్లి నేనే ఆయనతో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని స్వరాజ్యం చెప్తుంది. ఇక ఉదయం రాజేంద్రప్రసాద్ ఇంటికి పోలీసులు వస్తారు. అది చూసి పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది.
రాజేంద్రప్రసాద్ ని అరెస్ట్ చేయాలి అటెంప్ట్ మర్డర్ కేసు కింద అనేసి పోలీసులు చెప్తారు. ఇక అవన్నీ ఇలాంటి పనిచేస్తదని అసలు ఊహించలేదు అంటూ పల్లవి అవనిపై చాడీలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేసు పెట్టింది అవని వదిన కాదు నేను అనేసి కమలంటాడు. మీ నాన్న మీద నువ్వు కేసు పెట్టడమేంటి అనేసి కమల్ ని అందరూ తిడతారు. వేరే వాళ్ళు చేస్తే తప్పు నాన్న చేస్తే తప్పు కాదా అనేసి కమల్ అందరితో గట్టిగానే వాదిస్తాడు. పోలీసులు మాత్రం రాజేంద్రప్రసాద్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు రండి అనేసి అంటారు.
రాజేంద్ర ప్రసాద్ ను పోలీసులు తీసుకెళ్తుంటే బయట అవని వస్తుంది. ఎవరు చంపాలని ప్రయత్నించలేదు పొరపాటున తగిలింది. నేను కేసు పెట్టలేదు కదా హత్య ప్రయత్నం చేస్తే నేను కేసు పెట్టాలి. మీరు దయచేసి కేసిని వాపస్ తీసుకోవాలని పోలీసులు దగ్గర అంటుంది. నేను ఒక నలుగురు మీద కేసు పెట్టి వాళ్ళంతా క్రిమినల్స్ అని అంటాను మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తారా నిజా నిజాలు తెలుసుకొని అరెస్ట్ చేయడం మేలు అనేసి ఎస్ఐతో అంటారు.. ఇక పోలీసులు రాజేంద్రప్రసాద్ వదిలేసి వెళ్లిపోతారు ఇక అవన్నీ కూడా అక్కడినుంచి వెళ్ళిపోతుంది దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..