Nitish Kumar Reddy Injury: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలోకి వచ్చి.. హార్దిక్ పాండ్యా తరహాలో రాణిస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే అలాంటి నితీష్ కుమార్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఆస్పత్రి బెడ్ పై టీమిండియా స్టార్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. అరే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఏమైందో.. అలా ఆసుపత్రి బెడ్ పైన పడుకున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కి సర్జరీ ?
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి సర్జరీ జరిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆసుపత్రి బెడ్ పైన పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. స్పీడీ రికవరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇది చూసిన అభిమానులు నితీష్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ సందర్భంగా జిమ్ లో కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి మోకాలుకు… గాయమైంది. అయితే ఆ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి నితీష్ కుమార్ రెడ్డి దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాలికి సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read :Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి
ఆసియా కప్ కు దూరం కానున్న నితీష్ కుమార్ రెడ్డి
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ( Nitish kumar reddy) గాయమైన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో తాజాగా తన కాలుకు సర్జరీ కూడా చేయించుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే సర్జరీ అయిన తర్వాత దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ ఫిట్నెస్ గా మారడం జరుగుతుంది. కాబట్టి రెండు నుంచి మూడు నెలల పాటు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రెస్ట్ తీసుకుంటాడని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 tournament ) తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆడడం కష్టమేనని అంటున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంటు సెప్టెంబర్ లోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆడటం డౌట్ అని చెప్పవచ్చు.