Intinti Ramayanam Today Episode December 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. పోలీస్ స్టేషన్కు ఆఫీస్ పైన తీసుకుని వెళ్లడం చూసి కమల్ షాక్ అవుతాడు. వీడు మా ఆఫీస్ బాయ్ అండి వీడిని ఎందుకు తీసుకొచ్చారని పోలీసులు అడుగుతాడు.. ఆఫీస్ బాయ్ అయితే క్రైమ్ చేయకూడదు అని రూల్ ఉందా అనేసి ఎస్ఐ కమల్ ని అడుగుతాడు. పోలీసులు కొట్టి నిజం చెప్పించమని అవని చెప్తుంది. పోలీసులు అన్ని చితగ్గొడితే వాడు డబ్బులు కోసం ఆశపడ్డానని చెప్తాడు. 50 లక్షలు డిమాండ్ చేసి లొంగి పోదామని అనుకున్నానని బాయ్ చెప్తాడు. ఇక అక్షయ్ తీసుకొని అందరూ ఇంటికి వెళ్తారు. అక్షయ్ ఇంటికి రావడం చూసి పార్వతి భానుమతి సంతోష్ పడతారు. ఇక రాజేంద్రప్రసాద్, పార్వతీ ఇద్దరు పొగిడేస్తారు. ఇక కమల్ అప్పుడు మర్డర్ కేసులో నుంచి నేను బయట పడేసింది వదినే ఇప్పుడు ఈ కేసు నుంచి బయట పడేసింది వదినే నువ్వు వదినకి ముందు థాంక్స్ చెప్పాలి పోలీస్ స్టేషన్ లోనే చెప్తావని అనుకున్నాను కానీ చెప్పలేదు ఇప్పుడు నా అర్జెంటుగా వెళ్లి థాంక్స్ చెప్పు అనేసి అంటాడు. అవని దగ్గరికి వెళ్లిన అక్షయ్ అవినీకి ముందు సారీ చెప్పాలని సారీ చెప్తాడు. నిన్ను ఇంట్లో వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? నువ్వు చాలా గొప్ప పని చేసావ్ అని అంటున్నారు థాంక్స్ అనేసి చెప్తాడు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత దానికి థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదండీ అనేసి అంటుంది. అవని చేసిన పనికి అక్షయ్ మనసులో ఉన్న కోపం పోయింది అవని మీద ప్రేమ మొదలవుతుంది.. పల్లవి ప్లాన్ రివర్స్ అయ్యిందని ఫీల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే అవని మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే అనాధశ్రమం నుంచి వార్డెన్ అక్కడికి వస్తుంది. వార్డెన్ చూసినా అవని ఏమైందండీ ఏదైనా అవసరమా ఇలా వచ్చారా అనేసి అడుగుతుంది. ఆమె అవునండి చాలా పెద్ద అవసరం వచ్చాయి ఇక్కడికి వచ్చాను అనేసి అంటుంది. అంత పెద్ద అవసరం ఏమి వచ్చిందండి, డబ్బులు కావాలా అని అడుగుతుంది. దగ్గర ఒక 10, 12వేలు ఉంటాయి అవి ఇస్తాను అవి తీసుకెళ్లండి అనేసి అవని అంటుంది.. వేళ్ళతో పోయేది కాదండి లక్షలతో కూడిన సమస్య వచ్చింది ఆశ్రమంలో ఒక పాపకి గుండె సమస్య వచ్చింది. ఆపరేషన్ చేయాలంటే 10 నుంచి 20 లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు అనేసి ఆవిడ చెప్తుంది. నాకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ల దగ్గరికి వెళ్తే ఎంతో ఇస్తున్నారు అవన్నీ కలిపిన లక్ష రూపాయలు కాలేదనేసి ఆవిడ అంటుంది. దానికి కరిగిపోయిన అవని లోపలికి వెళ్లి మా ఆయన అడిగి ఒకసారి చెప్తానని అంటుంది.. అమెరికా కాల్ తో బిజీగా ఉన్నానని అవనిపై అరుస్తాడు. అవని చెప్పాలనుకున్న విషయాన్ని వినే స్థితిలో కూడా అక్షయ లేడు.
బయటకొచ్చి ఆ విషయాన్ని చెప్పలేక ఆయన బిజీగా ఉన్నాడు ప్రస్తుతానికైతే ఈ గాజులు తీసుకెళ్లండి వీటిని నమ్ముతారు తాకట్టు పెడతారు ఏదో ఒకటి చేసి ట్రీట్మెంట్ అయితే చేయించుకోండి అనేసి అంటుంది. ఆ దృశ్యాన్ని పల్లవి చూస్తుంది.. ఈ గాజుల మేటర్ ఇంట్లో చెప్పి పెద్ద రచ్చ చేయాలి అనేసి అనుకుంటుంది. వెంటనే ఈ విషయాన్ని భానుమతి చెవులు వేస్తుంది. భానుమతి అవునా గాజులు ఇచ్చేసిందా అనేసి టెన్షన్ పడుతూ ఎలాగైనా ఇరికించాలని పల్లవి భానుమతిలు ప్లాన్ చేస్తారు. ప్లాంట్ ప్రకారం సేటుని ఇంటికి రమ్మని పిలుస్తారు. ఆరాధ్యకు వడ్డానం చేయిద్దామని అనుకుంటున్నాను నా దగ్గర పాత బంగారం చాలా ఉంది అది ఇచ్చేసి వడ్డానం చేయద్దామనేసి అంటుంది. ఇక అనుకున్నట్లే వడ్డానంకి బంగారం తక్కువవుతుంది. మేము బంగారం వేస్తాము మీరు దానికి డబ్బులు ఇవ్వనని సేటు అంటాడు. అహ బయట బంగారం మాకొద్దు. పావని చేతికి నాలుగు తులాల పైన గాజులు ఉంటాయి అవి వేసి వడ్డానం చేయించండి అనేసి సేటుతో అంటుంది. అవని గాజులు అడుగుతుంది కానీ అవని మాత్రం ఆ గాజులు అనాధశ్రమం ఆవిడ వస్తే ఇచ్చానని చెప్తుంది. ఇక దాంతో భానుమతి రెచ్చిపోయి అవనిని తిడుతుంది. స్థాయి మర్చిపోయే వాళ్లకి అధికారం ఇస్తే ఇలానే ఉంటుంది ఈరోజు గాజులు ఇచ్చింది రేపు ఇంకేదైనా ఇస్తుందనేసి అందరి ముందర నోటికొచ్చినట్లు తిట్టేస్తుంది. భానుమతి అంటుంటే ఎవరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు..
ఇక రాత్రి కమల్ సోఫాలో పడుకుని నిద్రపోతుంటాడు. ఆరాధ్య సైలెంట్ గా ఉండమని చెప్పిన గాడ నిద్రలో గురక పెడుతూ ఉంటాడు. అది భరించలేని ఆరాధ్య కమల్ ను లేపుతుంది. కానీ కమ్మలు లేవకపోవడంతో ఇంకాస్త గట్టిగా గురక పెడతాడు. ఉండు నీ పని చెప్తానని ఆరాధ్య కమల్ ని జోకర్ లాగా రెడీ చేస్తుంది. భానుమతి అక్కడికొచ్చి రిమోట్ కోసం వెతుకుతూ కమల్ ను లేపుతుంది. కమల్ అవతారం చూసి ఒక్కసారిగా కేకలు పెడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. కమల్ అవతారం చూసి అందరూ నవ్వుకుంటారు. ఇక ఇది ఆరాధ్య పని అని తెలుసుకున్న కమల్ ఆరాధ్యను నువ్వు పట్టుకోవాలని చూస్తాడు. అప్పుడే అక్ష ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే భానుమతి తన భార్య చేసిన పనిని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..