Allu Arjun : అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సీక్వల్ గా పుష్ప 2 సినిమా కూడా విడుదల అయింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకొని మంచి కలెక్షన్స్ తో కొనసాగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ఈవెంట్ లు కూడా నిర్వహించారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. కొన్నిచోట్ల డిసెంబర్ 4వ తారీఖు రాత్రి ప్రీమియర్ చూసుకోవడం వేశారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడటానికి, తన కుటుంబంతో కలిసి థియేటర్ కు వచ్చాడు. అక్కడికి సినిమా చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో మృతి చెందారు. అలానే తన కుమారుడు ఆసుపత్రి పాలయ్యారు.
ఇక అప్పటినుంచి సోషల్ మీడియా వేదిక అల్లు అర్జున్ పైన చాలా విమర్శలు వచ్చాయి. దీనికి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ స్పందించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా స్పందించి ఒక మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో బయటను రిలీజ్ చేశాడు. జరిగిన సంఘటనకు చింతిస్తూ పాతిక లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తున్నట్లు కూడా ప్రకటించాడు. అంతే కాకుండా ఆసుపత్రికలను కూడా తాను భరిస్తాను అని హామీ ఇచ్చాడు. ఇకపోతే ఆ ఇన్సిడెంట్ నేపథ్యంలో అల్లు అర్జున్ ని నిన్న పోలీసుల అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి చంచల్గూడాకి తరలించారు. దాదాపు 14 రోజులు పాటు రిమైండ్ విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈలోపే తనకున్న సర్కిల్ వలన మధ్యంతర బెయిల్ కూడా లభించింది. దాదాపు నిన్ననే అల్లు అర్జున్ జైలు నుండి బయటకు వచ్చేస్తాడు అనుకునే తరుణంలో ప్రాసెస్ కొంచెం డిలే అవడంతో నేడు తెల్లవారుజామున అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చాడు.
Also Read : Niranjan Reddy: అల్లు అర్జున్ కేసు.. నిరంజన్ రెడ్డి ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా.. ?
అల్లు అర్జున్ ఖైదీ నంబర్ 7697. జైలులో అల్లు అర్జున్ కు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసిన కూడా బన్నీ తీసుకోలేదు అని సమాచారం. అంతేకాకుండా ఒక సాధారణ ఖైదీల రాత్రంతా జైలులో గడిపాడు బన్నీ. రాత్రి చాలావరకు అల్లు అరవింద్ స్టేషన్ దగ్గర వెయిట్ చేశారు. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ చంచల్గూడా జైలు నుంచి డైరెక్ట్గా గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళనున్నట్లు సమాచారం అనిపిస్తుంది. చాలామంది సినిమా ప్రముఖులు అభిమానులు అక్కడ అల్లు అర్జున్ ని కలిసి అవకాశం ఉంది అని తెలుస్తుంది.
Also Read : Pushpa 2 Collections : అల్లు అర్జున్ అరెస్టు తర్వాత… పుష్ప 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?