BigTV English

Intinti Ramayanam Today Episode : కమల్ కు షాకిచ్చిన మేనేజర్.. అవనిపై ఇంట్లో వాళ్లకు అనుమానం..

Intinti Ramayanam Today Episode : కమల్ కు షాకిచ్చిన మేనేజర్.. అవనిపై ఇంట్లో వాళ్లకు అనుమానం..

Intinti Ramayanam Today Episode December 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాద్యను రెడీ చెయ్యదు పార్వతి. నా మీద కోపం ఆరాధ్య మీద చూపిస్తున్నట్టుంది అందుకే ఆరాద్యను పట్టించుకోవట్లేదు అనేసి అనుకుంటుంది. నానమ్మకు ఆరోగ్యం బాగోలేదమ్మా అందుకే నిన్ను లేపలేదు అనేసి అవని చెప్తుంది. నీకు ఈరోజు నేను జడవేసి రెడీ చేస్తాను అంటే నానమ్మకి బాగలేదా అయితే నేను వెళ్లి చూసి వస్తాను అనేసి వెళ్తుంది. నీకు బాగలేదు అంట కదా అమ్మ చెప్పింది. నాకు గుడ్ మార్నింగ్ చెప్తావు కానీ ఈరోజు చెప్పలేదు అనేసి అంటుంది. దానికి పార్వతి గుడ్ మార్నింగ్ చిట్టితల్లి అని అంటుంది. అక్షయ్ కాఫీ తీసుకెళ్లి ఇచ్చినా గాని వద్దని చెప్తుంది అవని. మమ్మీ కి నేనే తీసుకెళ్తాను నిన్నటి నుంచి ఏమీ తినలేదని అక్షయ్ టిఫిన్ తీసుకుని వెళ్తాడు. నా మీద ఏమైనా కోపం ఉందా తిట్టు కొట్టు కానీ నువ్వు ఇలా భోజనం మానేసి కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది నేను అవని తప్పు చేసి ఉంటే నువ్వు మమ్మల్ని అనే హక్కు ఉంది అంతేగాని తినకుండా మాత్రం ఉండద్దు అని అక్షయ్ అంటాడు.. తల్లికి తినిపించినందుకు అక్షయ్ సంతోషపడతాడు. బామ్మ కొత్త ఫోన్ కొని ఉంటుంది. బామ్మ దగ్గరికి వెళ్లి ఫోన్ ఎవరిది అంటే నాదే నేనే కొనుక్కున్నాను అనేసి అంటుంది. కాసేపు గేమ్ ఆడుకోవడానికి నాకు కాలక్షేపంగా ఉంటుందని నా దగ్గర దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నాను అనేసి చెప్తుంది.
ఈ ముసలి దానికి కొత్త ఫోనా ఎలాగైనా తీసుకోవాలని కమల్ ప్లాన్ వేస్తాడు. వదినను తిడతావా ఎలాగైన రివేంజ్ తీర్చుకుంటాను అని ఆ ఫోన్ తీసుకెళ్లి నీళ్లలో వేస్తాను నువ్వువదినను అన్నందుకు గుంజులు తీ అనగానే భానుమతి గుంజలు తీస్తుంది. అక్షయ్ వాట్సాప్ లో బైక్ ఫోటోలు రావడం చూసి తన ఫ్రెండుకి కాల్ చేస్తాడు. నీ షో రూమ్ కి వచ్చిన కొత్త బైక్ ఆ అయితే తీసుకురా నేను కొనేస్తాను అనేసి అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమలు తన ఫ్రెండ్ పంపించిన ఫోటోలను చూసి తెగ సంబరి పడిపోతాడు.. బుజ్జిముండ ఎంత బాగుందో ఎలాగైనా దీన్ని నేను తీసుకోవాల్సిందే అనేసి పట్టు పట్టి తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. ఎప్పటినుంచో మంచి బైక్ కావాలన్నావ్ కదరా ఇదిగో ఈ బైక్ వచ్చింది షో రూమ్ లో ఇలాంటి బైకులను ఆర్డర్ చేశారు ఒక 20 బైకులు రావాల్సి ఉన్నాయి నువ్వు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకో ఒక పది రోజుల్లో వస్తాయని అంటాడు. కానీ పది రోజులు కాదు నాకు రేపే బైక్ కావాలి అని అంటాడు. మా షో రూమ్ లో ఒక కస్టమర్ ఎప్పుడో ఆర్డర్ చేసుకున్నాడు ఆ బైక్ రావాలంటే కాస్త ఎక్కువ డబ్బులు అవుతుంది అనేసి ముందే చెప్తాడు. ఆఫీస్ అకౌంట్ లో డబ్బులు అంతా నా అకౌంట్లో ఉన్నాయి నువ్వేం పర్లేదు నువ్వు బండి తీసుకురారా అనేసి తన ఫ్రెండ్ కి చెప్తాడు. అక్కడికి వచ్చిన పల్లవికి బైక్ ని చూపిస్తాడు. బైక్ చాలా చాలా బాగుంది బావ అనేసి పల్లవి అంటుంది. ఈ విషయాన్ని అర్జెంటుగా వదినకు చెప్పాలని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు.

వదిన నీకు ఎప్పుడైనా ఏదైనా చెప్పకుండా కొన్నానా? ఇప్పుడు కూడా నేను ఒకసారి ఇవ్వబోతున్నాను అనేసి అనగానే అవని ఆలోచిస్తుంది. ఏంటి బైక్ కొంటున్నావా అని అవని అడుగుతుంది. నీకెలా తెలిసింది వదిన అంటే నువ్వు ఇలా రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇంజన్ ఆన్ చేసి ఉంటే పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది కదా కన్నయ్య అనేసి అడుగుతుంది. సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చేసావు కదా రేపు నా బుజ్జిముండ వస్తుంది మొదటిగా నువ్వే చూడాలి అనేసి అడుగుతాడు. ఇక నాకు ఆకలిగా ఉంది పాలు కాదు దానిమ్మ జ్యూస్ తీసుకురావా అనేసి అడుగుతాడు. బైక్ వస్తుంది అని సంబరంలో గెంతులు వేస్తూ ఉంటాడు కమల్. ఇంట్లో వాళ్ళందరూ బైక్ వస్తుంది కదరా బైకు వచ్చిన తర్వాత డ్రై చేయొచ్చు కదా అనేసి అందరూ అంటున్న అదొక ఆనందం అదొక ఫీల్ అనేసి ఆలోచిస్తూ ఉంటాడు.
అటు అక్షయ్ ఆఫీసులో పనుల గురించి పూర్తివాలని వర్కర్స్ కి చెప్తుంటాడు. ఇక ఆఫీస్ కి రావట్లేదని మేనేజర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. మేనేజర్ అక్కడికి రాగానే ఆఫీస్ కి రావట్లేదు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను నాకు వేరే మీటింగ్ ఉంది అందుకే అక్కడికి వెళ్లాలని మీకు కాల్ చేస్తానని అంటాడు. ఏమైంది సార్ ఏ దాని గురించి మాట్లాడాలి అనేసి మేనేజర్ అడుగుతాడు. ఎటువంటి ప్రూఫ్ లేకుండా కమల్ అకౌంట్లో 20 లక్షలు ఎందుకు వేశారు అనేసి అడుగుతాడు. కమల్ సారు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు ఆఫీస్ కి మీరు గానీ పెద్ద సార్ కానీ లేరు ఆ టైంలో ఏదో డీల్ అని చెప్పేసి 20 లక్షలు వెయ్యమని చెప్పాడు. 20 లక్షలు వేసిన తర్వాత అతను ఫ్రాడ్ ని కమల్ సార్ చెప్పాడు. ఈ విషయాన్ని నాన్నకు గాని అన్నయ్య గాని చెప్పొద్దని చెప్పాడు అందుకే మీకు చెప్పలేదు సార్ అనేసి మేనేజర్ అంటాడు. బంధుత్వం అనేది ఇంట్లో ఉంటుంది ఆఫీసులో కాదు ఆఫీసులో ఇకమీదట వాడికి ఏ విషయాన్ని చెప్పకూడదు వాడు అకౌంట్లో డబ్బులు ప్రీజ్ చేయండి అనేసి చెప్తాడు. కమల్ కు ఇంకా డబ్బు విలువ తెలియట్లేదు. ఇలా చేస్తున్నాడు అనేసి అక్షయ్ అనుకుంటాడు..


ఇక కమల్ బైక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఫ్రెండు బైక్ ని తీసుకొని వస్తాడు. అందరినీ బయటికి రమ్మని చెప్తాడు. బైక్ రాగానే ఆనందం తట్టుకోలేక దానిమీద అలా రైడ్ చేస్తాడు. అరేయ్ ఈ బైక్ ఖరీదు ₹5 లాక్స్ అని నీకు ముందే చెప్పాను కదా అంటే అవును రా నేను డబ్బులు రెడీ చేసి పెట్టాను. ఇదిగో కార్డు అని కార్డు ఇస్తాడు. కార్డు చేయదు.. ఇంకొకటి ఇచ్చినా పనిచేయదు. ఇక పార్వతి అవని డబ్బులు తీసుకురమ్మని చెప్పి అడుగుతుంది. లాకర్లో డబ్బులు ఏమి లేవు అత్తయ్య ఏదో పని ఉందని ఈయన అన్ని తీసుకెళ్లాడు అనేసి అంటుంది.ఇంట్లో ఇప్పుడు డబ్బులు ఉంటాయి కదా ఇప్పుడు డబ్బులు లేకపోవడం ఏంటి అని పార్వతి అనగానే తన ఫ్రెండ్ అరే గొప్ప పని చేశారు నువ్వు నీ పంచాయతీలు ఇప్పుడు ఆ కస్టమర్ దగ్గర నేను ఎదవని అయ్యాను అనేసి తన ఫ్రెండు బైక్ ని తీసుకొని వెళ్ళిపోతాడు.
ఇంట్లోకి వెళ్ళగానే కమల్ భోజనం చేస్తూ ఉండడం చూసి భానుమతి షాక్ అవుతుంది. కొంచెం కూడా సిగ్గు అనేది లేరాదా? ఎందుకలా తింటున్నావ్ అనేసి అనగానే ఆకలికి బాధకి లింక్ ఏంటి ముసలి నాకు ఆకలేస్తుంది తింటున్నాను అనేసి అంటాడు. వీడి అమాయకత్వాన్ని చూసి సంతోషపడాలో బాధలను మర్చిపోతున్నాడని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అనేసి పార్వతి మనసులో అనుకుంటుంది. అవి భోజనానికి రాలేదేంటి అని అడగ్గాని చాలాసార్లు పిలిచాను నాకు తినాలని లేదని చెప్పింది అని కమల్ అంటాడు. ఇక పార్వతి వెళ్లి పల్లవిని భోజనానికి రాలేదేంటి నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని అడుగుతుంది. భోజనం చేయాలని లేద అత్తయ్య ఆకలిగా లేదు అక్షయ్ బావ చేసింది తలుచుకుంటే బాధగా ఉంది అనేసి అంటుంది. ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×