Brahmamudi serial today Episode: ట్రైనింగ్ లో ఉన్న అప్పు, కళ్యాణ్‌కు ఫోన్ చేస్తుంది. ట్రైనింగ్ గురించి కళ్యాణ్‌కు చెప్తుంది అప్పు. రోజంతా దూకి, ఎక్కి అలసిపోతున్నాను అంటుంది. పక్కన నువ్వుంటే సాయంత్రానికి నాకు తినిపించాలి అనిపిస్తుంది అని చెప్తుంది. పోలీస్ ట్రైనింగ్ అంటే అలాగే ఉంటుంది పొట్టి అంటాడు కళ్యాణ్. కచ్చితంగా ఎస్సై గానే తిరిగి వస్తాను. కానీ నువ్వు ఒకసారి రావొచ్చు అంటూ అడుగుతుంది అప్పు. ఎందుకని కళ్యాణ్ అడగ్గానే ఇక్కడ విజిటింగ్ హవర్స్ ఉంటాయి. ఎవరైనా గంట సేపు వచ్చి మాట్లాడి వెళ్లవచ్చు అని చెప్తుంది అప్పు.
నీకు నన్ను చూడాలని లేదా అనగానే ఇక్కడ నేను చూడాల్సిన పని ఉంది అది చూసుకుని వస్తాను అని చెప్తాడు కళ్యాణ్. కిచెన్‌లో వంట చేస్తున్న కావ్య దగ్గరకు రాజ్ వెళ్తాడు. ఏం చేస్తున్నావు కళావతి అని అడుగుతాడు. ఈ భూమ్మీద కాకుండా మరెక్కడైనా మనుషులు ఉన్నారేమోనని సెర్చ్ చేస్తున్నాను అంటుంది కావ్య. నీకు ఈ సెన్సాఫ్ వ్యూమర్ చిన్నప్పటి నుంచి ఉందా..? అంటూ రాజ్ ప్రశ్నిస్తాడు. లేదు అమ్మ కడుపులో ఉన్నప్పుడే తెగ కామెడీ చేసేదాన్ని అంటా అందుకే నా బతుకు ఇప్పుడు కామేడీ అయిపోయింది అంటుంది. అవును నువ్విలా కామెడీగా మాట్లాడితే చాలా బాగుంటుంది అంటాడు రాజ్.
అవును బలవంతంగా నవ్వేంత కామెడీ చేస్తున్నారని నాకు అర్థమైంది కానీ మీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పండి అని కావ్య అడుగుతుంది. నాకా నాకేం అక్కరలేదు. జస్ట్ ఊరికే నువ్వు ఏం చేస్తున్నావోనని వచ్చాను అంటాడు. అసలు కిచెన్‌లోకి అడుగుపెట్టడానికే ఇష్టపడని మీరు ఎందుకు వచ్చారో చెప్పండి.. మీ ఇంట్లో మీకు మొహమాటం ఏంటి అని అడగ్గానే.. ఏం కళావతి నా ఇల్లు కాదు మన ఇల్లు అంటూ టీ కావాలి అని అడుగుతాడు రాజ్. మీరు ఇప్పుడే భోజనం చేశారు కదా అప్పుడే టీ ఏంటి అని అడుగుతుంది కావ్య. ఇవన్నీ ఎందుకులే కానీ టీ నేనే పెట్టుకుంటానులే.. అంటూ టీ పెట్టుకోవడానికి రాజ్ ప్రయత్నిస్తుంటే.. ఏంటో మీరు కొత్తకొత్తగా మారిపోతున్నారు అని అడుగుతుంది.
రాజ్ టీ ఎలా పెట్టాలో తెలియక తికమక పడుతుంటే అపర్ణ వచ్చి ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు ఏది ఎలా చేయాలో తెలుసుకోవాలి నాన్నా అంటూ వచ్చి టీ పెడుతూ అయినా నీకు టీ కావాలంటే నన్నే కావ్యనో అడగొచ్చు కదా అంటుంది. అంటే తను డిషెష్ క్లీన్ చేసుకుంటుంది కదా..? అందుకే అడగలేదు అంటాడు. రాజ్ మాటలకు అపర్ణ, కావ్య షాక్ అవుతారు. నిజంగా నీలో మార్పు వస్తే సంతోషమే కానీ ఇంత తొందరగా ఎలా మారిపోయావా అని సందేహం అంటుంది. రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మీ ఇద్దరి మధ్య ఏదో జరగుతుంది అంటూ అపర్ణ చెప్పగానే కావ్య అదేం లేదు అంటూ సిగ్గు పడుతుంది.
కావ్య రూం క్లీన్ చేస్తుంటే రాజ్ వస్తాడు. బెడ్ మీద నిలబడ్డ కావ్య చివరకు వచ్చి కిందపడబోతుంటే.. రాజ్ వచ్చి పట్టుకుంటాడు. ఏంటి కళావతి ఇది ఏం చేస్తున్నావు అంటాడు. అలా సడెన్‌గా వచ్చి అరిస్తే జడుసుకోనా..? అంటుంది కావ్య. నువ్వు భయపడటం ఏంటి కళావతి నువ్వు ఆడపులివి అంటాడు. సడెన్‌గా ఇంత పొగడ్తలు నేను భరించలేను అంటుంది కావ్య. ఇంతలో సరేలే కళావతి నేను నీకు సాయం చేస్తాను అని అడగ్గానే కావ్య షాక్ అవుతుంది. సరేలే అంటూ రూమ్ మొత్తం రాజ్ చేత క్లీన్ చేయిస్తుంది.
క్లీన్ చేస్తూ రాజ్ కింద పడబోతుంటే కావ్య పట్టుకుంటుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇంతలో రుద్రాణి, ధాన్యలక్ష్మీ వచ్చి చూసి వెళ్లిపోతారు. అపర్ణ కాఫీ తీసుకొచ్చి సుభాష్‌కు ఇస్తుంది. దీంతో అడక్కుండానే కాఫీ ఇచ్చావేంటి అని సుభాష్ అడగ్గానే.. ముందు తాగండి చెప్తాను అంటూ రాజ్ మారిపోయాడు అని కావ్యతో రాజ్ చనువుగా ప్రేమగా ఉండటం మొత్తం చెప్తుంది అపర్ణ. త్వరలోనే వాడి మనసులో ఉన్న ప్రేమను బయట పెడతాడు అని చెప్తుంది అపర్ణ. దూరం నుంచి వింటున్న కావ్య హ్యాపీగా పీలవుతుంది.
రాజ్‌కు ఆఫీసు నుంచి ఫోన్ చేసి రేపు బ్యాంక్ ఆఫీసర్లు ఆఫీసుకు వస్తున్నారు. మనం వాళ్లకు డబ్బులు కట్టే డేట్ చెప్పాలి అనగానే అదంతా నేను చూసుకుంటాను. కానీ ఇదంతా ఎవ్వరికీ తెలియకూడదు అని ఫోన్ కట్ చేసి కావ్యకు నిజం చెప్పాలనుకుంటాడు రాజ్. రూంలోకి వెళ్లగానే కావ్య నవ్వుతుంది. దగ్గరకు వెళ్లిన రాజ్ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అనగానే కావ్య సంతోషపడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?