UI The Movie Twitter Review: ఈరోజుల్లో హీరోలకు యాటిట్యూడ్ అని చూపించడం కోసం దర్శకులు చాలా రకాలుగా కష్టపడుతున్నారు. కానీ అసలు యాటిట్యూడ్ అనే పదానికి ప్రేక్షకులకు పూర్తిగా అర్థం తెలియని సమయంలో ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో ఉపేంద్ర. ఉపేంద్ర ఒక కన్నడ హీరోనే అయినా తనకు తెలుగులో కూడా బాగానే పాపులారిటీ లభించింది. ఒకప్పుడు తను నటించి, డైరెక్ట్ చేసిన కన్నడ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యేవి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లాగా కాకుండా ప్రతీసారి ఒక డిఫరెంట్ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చేవారు ఉపేంద్ర. అలాగే ఇప్పుడు ‘యూఐ ది మూవీ’ అనే తన స్టైల్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశారు.
అర్థం కాని ట్వీట్స్
ఉపేంద్ర అంటే హీరో మాత్రమే కాదు.. తిరుగులేని డైరెక్టర్. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత ‘యూఐ ది మూవీ’ని డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించారు. ఇప్పటికే చాలామంది హీరోలు పాన్ ఇండియా స్థాయి సినిమాలను తెరకెక్కిస్తూ పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం ఆశపడుతున్నారు. అలాగే ఉపేంద్ర కూడా చాలాకాలంగా ఫామ్‌లో లేకపోయినా.. ‘యూఐ ది మూవీ’తో పాన్ ఇండియా ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయాలని అనుకున్నారు. అందుకే ఈ సినిమాను కన్నడతో పాటు మరో అయిదు భాషల్లో విడుదల చేశారు. డిసెంబర్ 20న విడుదలయిన ‘యూఐ ది మూవీ’ని థియేటర్లలో చూసిన ప్రేక్షకులకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదని ట్విటర్‌లో ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read: ‘విడుదల 2’ ట్విటర్ రివ్యూ.. విజయ్ సేతుపతి హిట్ కొట్టాడా.?
స్వయంగా చూడాల్సిందే
‘యూఐ ది మూవీ’ మొదలవ్వగానే ‘నువ్వు తెలివైనవాడిని అయితే సినిమా చూడకుండా వెళ్లిపో’ అనే స్టేట్‌మెంట్ వస్తుంది. ఇది ఉపేంద్ర మార్క్ డైరెక్షన్ స్టైల్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇలా చెప్తే అసలు ఈ మూవీకి రివ్యూలు ఇచ్చేవారు ఇవ్వగలరా, అంత సాహసం ఎవరు చేస్తారు అని చర్చించుకుంటున్నారు. అందుకే చాలామంది ‘యూఐ ది మూవీ’ని సైలెంట్‌గా థియేటర్లలో చూసి వచ్చేస్తున్నారు తప్పా రివ్యూలు ఇవ్వడం లేదని అంటున్నారు. ‘యూఐ ది మూవీ’ (UI The Movie) లాంటి డిఫరెంట్ సినిమాను స్వయంగా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుందని చాలామంది ట్వీట్లు చేస్తున్నారు.
If you are intelligent don’t watch this movie #UiTheMovie pic.twitter.com/DCjm8x7BqH
— Bhargava H C 𝕏 (@HcBhargava) December 20, 2024
ST – #UiTheMovie
OG Director Is Back💥 pic.twitter.com/yZWtRgxYYd— ʜᴇᴍᴀɴᴛʜ (@HemanthDCult) December 20, 2024
#UiTheMovie Average 🤦 pic.twitter.com/T4TjBWzS2V
— Movies Club (@Movieskannadas) December 20, 2024
వారికి మాత్రమే
ఒకవైపు ‘యూఐ ది మూవీ’కి విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తుంటే.. మరొకవైపు మాత్రం ఇది యావరేజ్ లేదా ఫ్లాప్ అనే టాక్ వినిపిస్తోంది. కొందరు అయితే అసలు సినిమా ఏంటో, ఎందుకు తీశారో అర్థం కావడం లేదు అంటూ దీని గురించి నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ‘యూఐ ది మూవీ’ అనేది అందరికీ నచ్చే సినిమా కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలయిన టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఇది చాలా డిఫరెంట్ జోనర్ మూవీ అని తెలుస్తోంది. అందుకే కేవలం డిఫరెంట్ జోనర్ సినిమాలను చూడాలని అనుకునేవారు, ప్రయోగాలను ఇష్టపడేవారు మాత్రమే ‘యూఐ ది మూవీ’ చూడాలని కొందరు సలహా ఇస్తున్నారు.
Trust me People, take this to watch #UiTheMovie 🤯 pic.twitter.com/iuqAlartof
— ᴍɪᴄʜᴀᴇʟ ₹ᴇᴅᴅʏ ᴅᴇsʜᴍᴜᴋʜ™ 🥃 (@BottleCot93883) December 20, 2024
What a movie, sir! Mind blown! Syk movie! Rating 4.5/5 #UiTheMovie #UiTheMovieOnDEC20th #Upendra pic.twitter.com/g77laTIpcG
— kiran (@abburi_999) December 20, 2024