Couple Divorce 12 Times| ఎవరైనా మనుషులను మోసం చెయ్యడం విన్నాం. కానీ ఏకంగా ప్రభుత్వాన్నే మోసం చెయ్యడం ఎప్పుడైనా చూశామా? అలాంటి కేసే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక జంట శుభ్రంగా పెళ్లి చేసుకుంటే అందరికీ సంతోషమే. కానీ అదే పెళ్లిని సాకుగా చూపించి ప్రభుత్వం దగ్గర ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నలభై ఏళ్లుగా డబ్బులు తీసుకుంటుంటే? అదే జరిగింది ఆస్ట్రియాలో.
ఒక్క ఆస్ట్రియాలోనే కాదు.. చాలా యూరోపియన్ దేశాల్లో విడాకులు తీసుకున్న భార్యలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి వితంతు పెన్షన్లు అందజేస్తుంది. దీన్నే అలుసుగా తీసుకుందా జంట. ఏకంగా నలభై ఏళ్లుగా ఈ పథకాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వచ్చింది. 1981 నుంచి జరుగుతోందీ స్కామ్.
Also Read: రూ.20 కే పెళ్లికూతురు.. ఆ ఊరెళితే తక్కువ ధరకే పిల్లనిస్తారు!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సదరు ఆస్ట్రియా మహిళ మొదటి భర్త 1981లో మరణించాడు. దీంతో ఆమెకు ప్రభుత్వం నుంచి వితంతు పెన్షన్ రావడం మొదలైంది. ఆ డబ్బుతో సుఖంగా బతుకుతున్న ఆమె జీవితంలోకి 1982లో మరో మగాడు వచ్చాడు. వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించి అదే సంవత్సరంలో పెళ్లి కూడా చేసుకున్నారు. దాంతో ఆమె వితంతు పెన్షన్ ఆగిపోవాల్సింది. కానీ ఆమెకు 28,405 డాలర్ల సెవరెన్స్ పేమెంట్ వచ్చింది. ఈ డబ్బుతో వాళ్లిద్దరూ కొంతకాలం సంతోషంగానే గడిపారు. కానీ ఆ డబ్బు ఎక్కువ కాలం మిగల్లేదు.
దాంతో ఏం చెయ్యాలో తెలియాలో తెలియని వాళ్లకు.. ప్రభుత్వ రూల్స్‌లో ఉన్న లూప్‌హోల్‌ను వాడుకోవాలని అనుకున్నారు. అందుకే 1988లో మొదటిసారి విడాకులు తీసుకున్నారు. దాంతో ఆమెకు మళ్లీ మొదటి భర్త చనిపోయినందుకు వితంతు పెన్షన్ రావడం మొదలైంది. భర్త ఇంట్లో లేకపోవడంతో తను కిందపడి గాయపడ్డానని చెప్పిందామె.
ఆ తర్వాత పెన్షన్ డబ్బు వచ్చిన తర్వాత కొన్నిరోజులకు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మళ్లీ సెవరెన్స్ పే కింద 34000 డాలర్లు వచ్చాయి. ఆ డబ్బుతో మళ్లీ కొంతకాలం ఎంజాయ్ చేశారు. ఆ డబ్బు అయిపోగానే మళ్లీ ఏదో పిచ్చి కారణం చూపించి విడాకులు తీసుకున్నారు. అలా ప్రతి మూడేళ్లకోసారి విడాకులు తీసుకుంటూ డబ్బులు అందుకుంటూ వస్తున్నారు.
ఇలా గత 43 ఏళ్లలో ఏకంగా 12 సార్లు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 73 ఏళ్లు. ఈ 43 ఏళ్లలో 3,42,000 డాలర్లు అందుకుందీ జంట. 2022 మే నెలలో ఆమె చివరగా విడాకులు తీసుకున్నప్పుడు వితంతు పెన్షన్ చెల్లించడానికి అధికారులు నిరాకరించారు. వీళ్ల విడాకులు నిజం అని తమకు నమ్మకం లేదని వాళ్లు చెప్పారు. అందుకని పెన్షన్ వ్యవస్థపై ఈ జంట కేసు వేసింది.
ఆ కేసును కొట్టేసిన కోర్టు.. వీళ్లిద్దరూ ఎప్పుడూ పూర్తిగా విడిపోలేదంటే విడాకులు తీసుకున్నట్లు కాదని, ఈ జంట చివరగా తీసుకున్న విడాకులు చెల్లవని ఆస్ట్రియా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు రాగానే.. పోలీసు అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ జంట మీద తిరిగి కేసు వేసింది. వీళ్లు విడిపోయినట్లు అబద్ధాలు చెప్పి, ప్రభుత్వాన్ని మోసం చేశారని వాళ్లు కేసు పెట్టారు.