E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు అవని దిమ్మతిరిగే షాక్.. పల్లవి మరో నాటకం.. భానుమతి ప్లాన్ వర్కౌట్..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు అవని దిమ్మతిరిగే షాక్.. పల్లవి మరో నాటకం.. భానుమతి ప్లాన్ వర్కౌట్..
Advertisement

Intinti Ramayanam Today Episode December 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి అవని గదిలో ఉన్న డాక్యుమెంట్స్ ని వెతకాలని అనుకుంటుంది. ఈ రూమ్ లో ఎవరూ లేరని తెలుసుకొని ఆ గదిలోకి వెళ్లి ఒక డాక్యుమెంట్ ని తీసుకుంటుంది. ఇక్కడ అన్ని చూసి అక్షయ్ సర్టిఫికెట్లని షాక్ అవుతుంది. అప్పుడే ఆరాధ్య లోపలికి వస్తుంది. దొరికిపోతానేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అవని తన బుక్ కోసం వచ్చిందని తెలుసుకుందాం పల్లవి ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత వెంటనే అవని లోపలికి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది.. నేను బుక్ కోసం వెతుక్కుంటూ లోపలికి వచ్చానమ్మా అని ఆరాధ్య అంటుంది.

గదిలో బీరువా తెరిచి ఉండడం చూసిన అవని ఎవరు తెరిచారు మీరు ఏమైనా తెరిచారా అని అక్షయ్ ని అడుగుతుంది.. నేనేమైనా తెలుస్తానా నేను ఇప్పుడే వచ్చాను అని అంటాడు.. నేను వెళ్ళాలి అని అక్షయ్ అంటాడు. మరి బీరువా ఎవరు తెరుచుంటారు అని అవని అనుమాన పడుతుంది. ఎవరు తెలిస్తే ఏమైంది అందులో ఏమైనా మనులు మాణిక్యాలు ఉన్నాయా అనేసి అక్షయ్ అంటాడు. ఎవరు తెరిచారో తెలుసుకోవాలని అవని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది.. పల్లవి ఇదంతా చేసిందని తెలుసుకొని షాక్ అవుతుంది. కానీ పల్లవి మాత్రం కొత్త నాటకం మొదలు పెడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చీర ఒకటి కనిపించలేదు. అందుకే అవని ఒక గదిలోకి వెళ్లి వెతికాను. దానికే అవని అక్క నన్ను చాలా దారుణంగా మాట్లాడింది అని పల్లవి ఏడుస్తుంది.. ఇప్పటివరకు అవని ఒకలా ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత మారిపోయింది అని భానుమతి అంటుంది. ఇక అవని పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తండ్రి దగ్గర నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. అవని చక్రధర్కలవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తుంది.. ఏంటి నువ్వొచ్చావ్ పోలీస్ స్టేషన్లో పెట్టడానికి కారణమే నువ్వు కదా.. మళ్లీ వచ్చావ్ ఏంటి అని చక్రధర్ అడుగుతాడు..

నీకోసం మా అమ్మ బాధపడుతుంది అనేసి అవని అంటుంది. సువర్ణ అవకాశం ఇస్తాను నువ్వే నీ అంతటి నువ్వు వచ్చి మా అమ్మకి భర్త అని చెప్తావా లేదా అని అవని అంటుంది. నేనెందుకు అంటాను నాకేం అవసరమని చక్రధరంటాడు. మీ అమ్మ నాతో కాపురం చేసింది కానీ పెళ్లవ్వకుండా అక్రమ సంబంధం పెట్టుకుంది అని అందరికీ తెలిస్తే నిన్ను కూడా తప్పుగా అనుకుంటారు. నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడా లేదు అంటే మీ అమ్మ నాతో సంబంధం పెట్టుకుంది అని మాత్రమే తెలుసు. ఈ విషయాన్ని నా అంతటి నేను చెప్తే కానీ నీకు తెలియదు అనేసి చక్రధర్ అంటాడు.

Advertisement

తన తల్లి గురించి గోరంగా మాట్లాడిన చక్రధర్పై అవని సీరియస్ అవుతుంది.. మీ అమ్మకు పుట్టారు అంటే కచ్చితంగా నిన్ను నీ అమ్మని కూడా నీచంగా చూస్తారు అని చక్రధర్ అనగానే అవని కోపంతో రగిలిపోతుంది.. నీలాంటి వాడు బతకకూడదు నిన్ను ఏం చేస్తానో చూడు చంపేస్తాను అని అవని చక్రధర్ గొంతు పట్టుకుంటుంది.. నీచుడు అసలు బతకకూడదు అని అనగానే అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆమెను పక్కకు వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత పల్లవి చక్రధర్ కలవడానికి వస్తుంది. ఆస్తి పత్రాలు చూపిస్తే తప్ప నేను వాళ్ళ అమ్మకి భర్తని అన్న సంగతి ఎవరికీ తెలియదు.. నువ్వు ఆ కాగితాలు ఎక్కడున్నాయో తెలుసుకుని కొట్టేయని సలహా ఇస్తాడు చక్రధర్.

అవని చక్రధర్ అన్న మాటని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.. అక్కడికి వచ్చిన అక్షయ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఏం కాలేదండి మా అమ్మ గురించే బాధపడుతున్నాను అని అంటుంది. అత్తయ్య గారిని నేను నీ కన్నా బాగా చూసుకోగలరు నువ్వు ఇందులో బాధపడాల్సిన అవసరం ఏంటి అని అంటాడు.. నువ్వు మీ అమ్మ గురించి ఎటువంటి బాధలు పెట్టుకోవద్దు నేను చూసుకుంటాను కానీ నువ్వు నా గురించి పట్టించుకోవడం లేదు అని అక్షయ్అంటాడు.. మీ గురించి నేనేం పట్టించుకోవాలి అని అవని అంటుంది..

నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇస్తే నేను సంతోషంగా ఉంటాను కదా అనేసి అక్షయ్ అంటాడు.. అవని అక్షయ్ ఇద్దరు రొమాన్స్ చేస్తూండగా ఆరాధ్య వస్తుంది. ఏంటి నాన్న ఏదో డిస్టర్బ్ గా ఉన్నాడు అనేసి అడుగుతుంది. మీ నాన్నకు దక్కల్సింది దక్కలేదు కదమ్మా అందుకే మీ నాన్న అలా ఉన్నాడు అనేసి ఆరాధ్యతో అంటుంది అవని. భానుమతి పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ పల్లవి ఎక్కడికెళ్ళింది ఇంకా రాలేదు. కొంపదీసి వాళ్ళ అమ్మని కలవడానికి ఏమైనా వెళ్లిందా ఏంటి.. ఒకసారి ఫోన్ చేస్తే సరిపోదు అనేసి భానుమతి అనుకుంటుంది. భానుమతి ఫోన్ చేస్తున్న సరే పల్లవి కట్ చేయడంతో అదేంటి.. ఎక్కడైనా ఉందా ఏంటి నా ఫోన్ కట్ చేస్తుంది అని అనుకుంటుంది.

ఇప్పుడే ఇంట్లోకి పల్లవి ఎంటర్ అవుతుంది.. ఏంటే ఫోన్ చేస్తున్న కట్ చేస్తున్నావు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్తాను జైల్లో ఉన్న మా నాన్నను కలవడానికి వెళ్లాను.. సరే కానీ మా అల్లుడు జైల్లో ఎలా ఉన్నాడు అని భానుమతి అడుగుతుంది. జైల్లో ఉన్నవాడు సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉంటాడా ఏంటి బాధ పడుతూనే ఉన్నాడు. మా నాన్న అరెస్ట్ అవ్వడానికి అవనినే కారణం అని తెలుసు కదా… మీ నాన్నని అవని బయటకు తీసుకురావాలి.. అవని తెలిసి మీ నాన్నని ఎందుకు తీసుకొస్తుంది..

Also Read : ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. మనోజ్ ను క్షమించిన రోహిణి.. మీనాపై ప్రభావతి సీరియస్..

మీ నాన్నని బయటకు తీసుకురావడానికి మరొకరు సాయం చేస్తారు అనేసి పల్లవికి భానుమతి సలహా ఇస్తుంది. ఇంకొకరా మా నాన్న అంటే పడని వల్లే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మా నాన్నని బయట తిసుకునడానికి ఎవరు సాయం చేస్తారు అని పల్లవి అడుగుతుంది. అదే నీ మొగుడు.. నీ మొగుడికి మీ నాన్న అంటే ఆవేశం కోపం.. అవని ఏం చెప్తే అది చేస్తాడు. కానీ అవని కూడా నీ మొగుడు ఏం చెప్తే అదే వింటుంది. నీ మొగుణ్ణి మచ్చగా చేసుకొని వాడిచేతే మీ నాన్నని బయటకు తీసుకురావాలి అనేసి సలహా ఇస్తుంది. పల్లవి ఇదేదో బాగుంది అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×