Intinti Ramayanam Today Episode February 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్యకు జ్వరం వచ్చింది వదిన అమ్మ అని నిన్నే కలవరిస్తుంది.. నువ్వు ఒక్కసారి వచ్చిపో వదిన అనికమల్అంటే నేను ఆ ఇంటికి వస్తే ఎంత గొడవలు జరుగుతాయో నాకు తెలుసు కన్నయ్య.. నేను ఇప్పుడు వస్తే ఏం జరుగుతుందో అత్తయ్య ఎలా గొడవ చేస్తుందో నీకు అర్థం కావట్లేదు అనేసి అంటుంది. ఇక కమల్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తాడు నర్స్ వేషంలో అవని ఆ ఇంటికి వస్తుంది. డాక్టరు ఏమీ లేదు మామూలు జ్వరమైనా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. వాళ్ళ అమ్మని పాప కలవరిస్తుంది మరి వాళ్ళ అమ్మ ఇక్కడ లేదండి అని అడుగుతారు డాక్టర్. కానీ లేదండి వేరే పని మీద బయటకెళ్ళిందని వాళ్ళు చెప్తారు. పాపకు వచ్చింది చిన్న జ్వరమే అయితే మా నర్సు మీకు రాత్రంతా చూసి చెబుతుంది అని అనగానే నర్సిం ఎందుకండీ మేము చూసుకుంటాం అనేసి పార్వతి అంటుంది. తనకి టైం కి మెడిసిన్స్ ఇవ్వడం ఫీవర్ ని చెక్ చేయడం మా నర్సు చూసుకుంటుంది లేండి అనేసి డాక్టర్ అంటుంది. ఇక డాక్టర్ వెళ్ళిపోతుంది నర్సు మీరందరూ బయటకు వెళ్ళండి నేను చూసుకుంటాను అనేసి అంటుంది. అవని ఆరాధ్యను దగ్గరకు తీసుకుంటుంది. దానితో ఆరాధ్య అమ్మను పట్టుకొని ఏడుస్తుంది నువ్వు వెళ్ళిపోతావ్ అమ్మ నువ్వు ఉండకపోతే నేను ఉండలేను అమ్మ నేను చూడాలనిపిస్తుంది అనేసి ఏడుస్తుంది. నువ్వు మంచి మంచిగా ఉండి నాన్న చెప్పిన మాట విని స్కూలుకు వెళ్తే నేను మళ్ళీ వస్తాను నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి కదా అమ్మ అనేసి అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. అవని నర్సుగా వచ్చి తన కూతురిని జాగ్రత్తగా చూసుకుంటుంది. రాత్రింత ఆమె చూసుకున్న విధానం చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నిజంగా నర్సుగా చాలా బాగా చేసిందని అనుకుంటారు. ఇక అక్షయ్ ను చూసి భాధ పడుతుంది అవని.. ఉదయం లేవగానే అందరు ఆరాధ్య కోసం వెయిట్ చేస్తుంటారు. అవని ఆరాధ్యం తీసుకొని బయటకొస్తుంది. ఆరాధ్య నడుచుకుంటూ రావడంతో అందరూ సంతోషపడతారు. మా మనవరాలికి ఏమైందో నాని టెన్షన్ తో మేము రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు కానీ మీరు ఒక నర్సుగా కాకుండా తల్లిగా దగ్గరుండి మా మనవరాలుకి నయం ఎలా చేశారు. మీరునాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అనేసి అందరూ అంటారు.
దానికి అవని నన్ను అమ్మలాగా చూసుకుందాం అన్నారు కదా నాకు అదే చాలండి మీరు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు నేను చేసే వృత్తి అది అనేసి అంటుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే గ్రేట్ అని రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరూ అంటారు. మీ మంచి మనసుతో మా పాపని బాగా చూసుకున్నారు మీకు ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదని అక్షయ అంటాడు. మరేం పర్లేదండి అది నా బాధ్యత అనేసి అవని అంటుంది. అయితే పల్లవి మాత్రం ఏదో డౌట్ గా ఉందని ఆలోచిస్తుంది.. ఇక ఆరోగ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు బాగా చదువుకోవాలి నేను మళ్ళీ వస్తాను అనేసి అంటుంది.
ఆ మాటలు విన్న పల్లవి కచ్చితంగా అవనిని మారువేషంలో వచ్చిందని భావిస్తుంది. ఇక అవని అందరికీ చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటే పల్లవి ఏ ఆగు ఒక నిమిషం ఇలా తిరుగు అనేసి అడుగుతుంది. తన పేర్కొన్న మాస్క్ ని తీసేస్తుంది. అవని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక పార్వతి అవనిపై చిందులేస్తుంది. నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టద్దు అని చెప్పాను కదా అయినా నువ్వు వచ్చావు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు వస్తావనేసి పార్వతి అంటుంది. మనుషుల్ని చంపాలనుకున్న నీకు ఇలా మారువేషంలో రావాలనుకోవడంలో తప్పులేదులే అనేసి అవనిని పార్వతి నోటికొచ్చినట్లు తిడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ పార్వతిని అరుస్తారు బిడ్డ కోసం తల్లి రావడంలో తప్పులేదు అనేసి అంటారు. కానీ పార్వతి మాత్రం తన మాటే నెగ్గాలని అవనిపై అరుస్తుంది..
పల్లవి పార్వతికి ఇంకా ఆజ్యం పోసినట్లు అవనీ నీ తిడుతున్నట్లు మాట్లాడుతుంది. ఒకవైపు కమల్ పల్లవిని కామ్ గా ఉండమని అరుస్తున్న కూడా పల్లవి ఆగదు. ఇక పార్వతి మాటలు విని విసిగిపోయిన అవని అరుస్తుంది. తల్లి ప్రేమకు ఏవి అడ్డు కావని మీరు అర్థం చేసుకుంటే మంచిది అని అంటుంది చూశారా నన్నే ఎన్ని మాటలు అంటుందో చూశారా అని పార్వతి రాజేంద్రప్రసాద్ తో అంటుంది. మారువేషంలో వేసుకొని ఇంట్లో అడుగు పెట్టడని నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా అని పార్వతి తిడుతుంది. నేనేం తప్పు చేశాను మీరు చెప్పండి నా బిడ్డ కోసం నేను వచ్చాను అది తప్ప అనేసి అంటుంది. మీ కొడుకు గాని కొడుకు మీదేం మీరంతా ప్రేమను పెంచుకుంటే నవ మాసాలు మోసి కన్న నా కూతురు మీద నాకు ప్రేమ లేకుండా పోతుందా నా కూతురికి బాగా లేదంటే నేను రాకుండా ఉంటానా మారువేషంలో వేసుకోవడం తప్పేంటి నా బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని తెలిస్తే నేను మళ్లీ మళ్లీ వస్తాను అని పార్వతికి వార్నింగ్ ఇస్తుంది. ఇక అక్షయ్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతూ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. మరి రాజేంద్రప్రసాద్ మాటతో అవని ఇక్కడే ఉండి పోతుందా? లేదా బయటకు వెళ్ళిపోతుందా? అనేది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి ..