Intinti Ramayanam Today Episode February 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవని దగ్గరికి వెళ్లి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ అవని మాత్రం తనకు విడాకులు పంపించిన విషయం తెలిసి కూడా నాతో మాట్లాడాలని అనుకుంటున్నాడు అని కావాలని మాట మార్చి జాబ్ గురించి మాట్లాడుతుంది. నేను నీకు విడాకులు పంపించలేదు అవని ఇంట్లో పరిస్థితులు బట్టి నీకు దూరంగా ఉన్నాను నిన్ను జీవితంలో ఎలా వదులుకుంటున్నాను అనుకుంటున్నావు అని అవనిత అంటాడు. నాకు తెలుసండి మీరు ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను నమ్మలేదు నువ్వు వెళ్లినప్పటి నుంచి ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి సమస్య వచ్చి పడుతూనే ఉంది అని అక్షయ్ అనగానే అవని ఏమైంది ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతుంది.. విడాకులు నోటీస్ పంపించడానికి పల్లవి హస్తము ఉందని కమల్ పల్లవికి విడాకులు పంపించాడు అనగానే అవని షాక్ అవుతుంది. కన్నయ్య ఎందుకిలా చేశాడు అని అవని అంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కమ్మలు తప్పని విడాకులు వెనక్కి తీసుకోవాలని తిడతారు. ఎన్ని చెప్పినా నేను విడాకులు వెనక్కి తీసుకొనని కమలంటాడు. ఇక పల్లవి కమల్ విడాకులు పంపించడానికి కారణం నువ్వే నా తెలివితో విడాకులు చించేసేలా చేశానని శబదాలు చేస్తుంది. అవని చెప్పిన మాటకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది పల్లవికి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. భానుమతిని అడ్డుపెట్టుకోవాలని అనుకోని అడుగుతుంది. నేను ఇంటికి పెద్దదాన్ని కానీ నా మాట ఎవరు వినరు నువ్వు నీ తోడికోడలు శ్రీయను నీ వైపు తిప్పుకో రేపు ఏదైనా తప్పు జరిగిన దానిమీద తోసేసి నువ్వు బయటపడొచ్చు అని భానుమతి సలహా ఇస్తుంది. శ్రియా రావడం చూసి పల్లవి డ్రామాలు మొదలు పెడుతుంది.. శ్రీయను బుట్టలో వేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. నిజానికి శ్రీకర్, శ్రీయాకు పల్లవి గురించి ముందే చెప్తాడు కాబట్టి శ్రీయా నమ్మినట్టు కనిపించదు. పల్లవి అన్నమాట శ్రీకర్తో శ్రీయా అంటుంది. పల్లవి ఎందుకు సడన్గా ఇలా మారిపోయింది అంటే నిన్ను అడ్డుపెట్టుకొని అవని వదినను ఇంటికి రానివ్వకుండా చేయాలని అనుకుంటుంది నువ్వు ఏమాత్రం కరిగావో ఇక తప్పు మీద తప్పులు చేసి నీ మీదకు తో వస్తుందని శ్రీకర్ శ్రీయకు వార్నింగ్ ఇస్తాడు.
లాయర్ కూతుర్ని ఇప్పుడు లాయర్ భార్యని నన్నే మోసం చేయాలని చూస్తే అస్సలు సహించను అని శ్రియ అంటుంది. నువ్వు ఎంత తెలివిగా ఉన్నా కూడా పల్లవి ఎత్తులు ముందు నువ్వు వెయ్యలేవు అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానని శ్రీకర్ చెప్తాడు. సరే అండి పల్లవి గురించి తెలిసి కూడా నేను ఎందుకు నమ్మి మోసపోతానని తన అంటుంది. ఇక అక్షయ్ ఒక ఆఫీస్ కి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్తాడు. అవని చూసి మనసులో అవని పై ప్రేమను కురిపిస్తాడు. ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి అక్షయ్ ని ఎలాగైనా దెబ్బ తీయాలని అనుకుంటుంది. టిప్స్ కోసం అని అడిగి లోపలికి తీసుకెళ్తుంది. తనతో మాట్లాడుతూ నేను మీకు పెద్ద ఫ్యాను మీ బిజినెస్ స్కేల్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి మీరంటే నాకు పిచ్చి ఎక్కువ చేశాయి మీరు నన్ను ఎలా వాడుకున్న పర్లేదు అనేసి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది.. కానీ దానికి ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో తనని బలవంతం చేయబోయాడని డ్రామాను మొదలు పెడుతుంది..
అయితే అవని మాత్రం ఆమె చెప్తుంది అంత అబద్ధమని అసలు నమ్మద్దని ఆ మేనేజర్ కి చెప్తుంది. కానీ వాళ్ళందరూ అక్షయ్ దే తప్పని అక్షయ్ ని నానా మాటలు అంటారు. చివరకు అవని ఆ అమ్మాయి చెంప పగలగొట్టి అసలు నిజం పెట్టేలా చేస్తుంది. నేనే సార్ మీద ఇష్టంతో ఇలా చేశానని ఆ అమ్మాయి మొత్తానికి ఒప్పుకుంటుంది. మీ వాళ్ళు చేసిన తప్పుకి నన్ను ఇంత ఘోరంగా అవమానిస్తారని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరు కలిసి రోడ్డు మీద మాట్లాడుకుంటారు. గదిలో లోపల ఏం జరిగిందో కూడా తెలీదు కానీ నువ్వు ఎలా నేను తప్పు చేయలేదని నమ్మావు అంటే మీ మీద నాకున్న నమ్మకం అని అవని అంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో పల్లవికి శ్రీయ రివర్స్ పనిచేస్తుందని తెలుస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే..