Intinti Ramayanam Today Episode February 27 th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్ర ప్రసాద్ ని భోజనం చేయడానికి రండి అనేసి పార్వతి పిలుస్తుంది. అక్షయ్ కూడా రాని అందరం కలిసి భోజనం చేద్దాం అంటే ఇప్పటికే లేట్ అయింది కదండీ మీరు తినేసి టాబ్లెట్ వేసుకోవాలి కదా అని పార్వతి అడుగుతుంది. అప్పుడే అక్షయ్ ఇంట్లోకి వస్తాడు అదిగో అక్షయ వచ్చాడుగా ఇంక మనం అందరం కలిసి భోజనం చేద్దాం అని రాజేంద్రప్రసాద్ అంటాడు. కానీ అక్షయ మాత్రం నేను ఈరోజు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఈరోజు నా పరువును కాపాడారు ఒకరు అనేసి అంటాడు. ఈరోజు నేను ఒక ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి నా మీద ఇష్టంతో తనని నేను పాడు చేసానని ఏదేదో చెప్పేసింది అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చెడ్డగానుకున్నారు కానీ ఒక దేవత నన్ను వచ్చి కాపాడింది లేకున్నా అంటే ఈరోజు నా పరువు ఇంటి పరువు పోయేదని రాజేంద్రప్రసాద్ తో అక్షయ్ అంటాడు. అంత ప్రేమ ఉండేదైతే ఆస్తి మొత్తం ఎందుకు మీ పేరు రాయిస్తుంది అంటే మిమ్మల్ని ఆస్తిని ఎగరేసుకుపోవాలని అనుకుందేమో బావగారు అని అంటుంది. ఇక అక్షయ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. మళ్లీ పార్వతికి అవనిపై చాడీలు చెప్తుంది పల్లవి. అక్షయ బావకు దగ్గర అవ్వాలని ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది అని పల్లవి రాజేంద్రప్రసాద్ అంటుంది. రాజేంద్రప్రసాద్ మాత్రం ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఆ దేవుడు చూస్తూ ఉంటాడు కానీ కాస్త అటు ఇటు ఆ దేవుడు అందరికీ చేయాల్సిన విధంగా శిక్ష వేస్తాడు అని చెప్తాడు. ఇక పార్వతీ దగ్గరకొచ్చి ఇదంతా అవని యొక్క ప్లాన్ లాగా అనిపిస్తుంది అత్తయ్య ఇంట్లోకి రావడానికి ఇలాంటి ప్లాన్ కూడా వేస్తుందా అని మళ్లీ పార్వతికి అవనిపై కోపం వచ్చేలా మాట్లాడుతుంది.. ఆ తర్వాత కమల్ భానుమతి పై కోపంగా ఉంటుంది. శ్రీయ బర్త్డే ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని పల్లవి అనుకుంటుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ భానుమతిని ఫ్లవర్ బొకే షాప్ దగ్గర తీసుకెళ్తాడు. పూలని అమ్మమని చెప్తాడు. కమల్ చెప్పినట్టు భానుమతి పూలు నమ్ముతూ ఉంటే పల్లవి వచ్చి భానుమతిని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే కమ్మలు వచ్చి ఈ ముసలోని తీసుకొచ్చాను ఎక్కడ వదినా కనిపించలేదంటే అమ్మమ్మని తీసుకొచ్చింది నువ్వా అంటే అవును వదిన నేనే తీసుకొచ్చాను ఏమైంది ఇప్పుడు ? మీ షాప్ లో పని చేయించాలని తీసుకొచ్చాను వదిన అని అంటాడు. ఆవిడ ఎలాంటిదైనా పర్లేదు కమల్ వయసులో పెద్ద ఆవిడ ఇంటికి పెద్ద దిక్కు అవిని మర్యాదగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అని కమల్ ని హెచ్చరిస్తుంది. కానీ ఆ ముసలిది నేను ఇంట్లోంచి పంపించాలని పెద్ద స్కెచ్ వేసింది అంటే పర్లేదు నేను బాగానే ఉన్నాను కదా అని అవని అంటుంది.
ఇక ఆఫీసులో అక్షయ్ ఆమెని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాకు అవని చేసిన సాయం గురించి నేను మర్చిపోలేను ఎవరైనా చెప్పినా నా అవని నాకు చాలా గ్రేట్ అని అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు. నాకు మంచి చేసిన అవనికి నేను మాత్రం అన్యాయం చేశాను.. ఎలాగైనా అవనిది తప్పు లేదని నిరూపించి ఇంటికి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అవని ఫ్లవర్ డెకరేషన్ గురించి మాట్లాడడానికి ఆఫీస్ కు ఆఫీస్ కి వెళ్తుంది. ఫ్లవర్ డెకరేషన్ గురించి మాట్లాడాలని అక్షయ దగ్గరికి వెళుతుంది అయితే మీరు మేము ఇచ్చిన డెమో గురించి ఇంకా మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు అని అంటుంది.
ఆ తర్వాత అక్షయ్ మీ డెకరేషన్ నాకు బాగా నచ్చిందండి మీకు నేను అడ్వాన్స్ ఇస్తున్నాను మాకు మా కంపెనీలో జరుగుతున్న ఈవెంట్స్ కి మీరే ఫ్లవర్ డెకరేషన్ చేయాల్సి వస్తుంది అనేసి అంటాడు . అయితే అక్షయ్ 25 వేలకు బదులుగా 50,000 ఇస్తాడు. మీరు మాకు ఇవ్వాల్సింది 25000 మాత్రమే కానీ మీరు 50,000 ఇచ్చారు మీ డబ్బులు మీతోనే ఉంచుకోండి అని అంటే అవన్నీ నీకు ఖర్చులకు డబ్బులు ఉండాలి కదా అనేసి అంటాడు. నేను సంపాదించుకుంటున్నాను మీరేం బాధపడకండి మీ డబ్బులు మీదతోనే ఉంచుకోండి అని అవని వెళ్ళిపోతుంది. ఇక బస్ స్టాప్ లోకి వెళ్ళిన అవనీని శ్రీకర్ చూసి కారులో ఎక్కించుకుంటాడు.. ఇక శ్రీ ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది.
శ్రీకర్ కారు ఎక్కడ పల్లవి చూస్తుంది.. నీకు శ్రియకు అవని గురించి శ్రీకర్ గురించి ఫోన్ చేసి పల్లవి చెప్తుంది. శ్రీకర్ఇంకా రాలేదా సెలబ్రేషన్స్ ఇంకా అవలేదు అని అడుగుతుంది.. ఇంకా శ్రీకర్ రాలేదు నేను శ్రీకర్ కోసమే వెయిట్ చేస్తున్నాను అంటుంది. అయితే శ్రీకర్ కార్ దిగి అవని వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అది గమనించి ఫోన్ చేస్తుంది..? శ్రీకర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది పల్లవి అనుకున్న ప్లాన్ని వర్కౌట్ అయ్యేలా చేసుకుంటుంది.. ఇక శ్రీయ శ్రీకర్ కాపురంలో పల్లవి అనుకున్నట్లు గొడవ పెట్టేస్తుంది. శ్రీకర్కు పల్లవికి ఏముందో తెలియదు కానీ శ్రియ మాత్రం పల్లవి చెప్పేది నిజమే అని నమ్మేస్తుంది. ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో అక్షయ్ అవని కోసం ఇంట్లో సరుకులన్నీ తెచ్చిస్తాడు.. ఏం జరుగుతుందో చూడాలి..