Intinti Ramayanam Today Episode February 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్న విషయాన్ని శ్రీకర్ అవనికి చెప్పాలని ఫోన్ చేస్తాడు. అవని ఫోన్ లిఫ్ట్ చేసి ఈ ఫోన్ కి ఫోన్ చేయద్దు అని చెప్పాను కదా శ్రీకర్ నువ్వు మళ్ళీ ఎందుకు చేసావ్ అంటే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చేశాను వదిన అనేసి అంటాడు. పల్లవి దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ తీసుకున్నాను ఆ డాక్యుమెంట్స్ పైన ఉన్న నెంబర్ ని పట్టుకొని ఎవరా డాక్యుమెంట్స్ ని కొనుగోలు చేశారన్న విషయాన్ని మనం కనిపెట్టవచ్చు వదినా అనేసి అవినీతో అంటాడు. నువ్వు చాలా తెలివైన వాడివి శ్రీకర్ అందుకే నిన్ను నేను అక్కడికి పంపించాను నువ్వు ఎలాగైనా అసలు నిజాలని బయటపెడతావని నేను అనుకుంటున్నాను అని అంటుంది అవని. శ్రీకర్ డాక్యుమెంట్స్ తీసుకున్న విషయాన్ని చక్రధరతో పల్లవి చెప్తుంది. లాయర్ కాదమ్మా ఏదైనా చిన్న క్లూ దొరికితే మొత్తానికి ఇరికిస్తాడు వాడి దగ్గర నుంచి నువ్వు ఆ డాక్యుమెంట్స్ ని ఎలాగైనా దొబ్బెయ్యాలి అనేసి అంటాడు. పల్లవి శ్రీకర్ దగ్గర నుంచి ఎలాగైనా డాక్యుమెంట్స్ కొట్టేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకర్ అవని చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు పల్లవి ఎత్తుగడలను ఎలాగైనా పసిగట్టాలని పల్లవి రూంలో తొంగి చూస్తూ ఉంటాడు. భానుమతి వెనకాల నుంచి వచ్చి ఏమైందిరా పల్లవి రూంలో ఎందుకు తొంగి చూస్తున్నావ్ అంటే అదేం లేదు నానమ్మ పెళ్లి చెడిపోయినందుకు పల్లవి చాలా బాధపడింది కదా దానికి క్షమాపణలు చెప్పాలని నేను అనుకుంటున్నాను అందుకే పల్లవి ఉందా లేదా అని చూశాను అంతేను అనేసి అంటాడు దానికి భానుమతి. ఇప్పుడు కమల్ పల్లవి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు త్వరలోనే వాళ్ళకి బిడ్డ కూడా పుట్టబోతున్నాడు ఈ టైం లో ఇవన్నీ చెప్పి మళ్ళీ బాధ పెట్టడం ఎందుకులే వదిలేసేయ్ అనగానే అలాగే నానమ్మ అనేసి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి శ్రీకర్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేయాలని డాక్యుమెంట్స్ కోసం వెతకడం శ్రీకర్ చూస్తాడు నువ్వు ఇలాంటి దానివైనా తెలియక నేను ఏదో అనుకున్నాను ఇకమీదట చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి శ్రీకర్ పల్లవి వెతుకుతున్నట్లు ఫోటో తీసి దాచి పెట్టుకుంటాడు. ఇక కనకం అవన్నీ ఇన్ డైరెక్ట్ గా ఇంట్లోంచి వెళ్ళమని చెప్తుంది. ఇక శీనుకు కనకం ఫోన్ చేస్తే అది పల్లవి వింటుంది అమ్మగారు అంటున్నారు అంటే కచ్చితంగా అవని ఉంటుంది అని అనుకుంటుంది శ్రీను అని అడిగితే శ్రీను చెప్పాడు దాంతో మాస్టర్ ప్లాన్ వేస్తుంది నీ భార్యకు పండక్కి చీర కొన్నాను ఇవ్వలేకపోయాను ఈ చీర ఇవ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అని అనగానే ఈ పని అంతా చేసి వెళ్తానమ్మ అని శ్రీను అంటాడు.. అని పల్లవి మాత్రం ఈ పని ఎప్పుడూ ఉండేదే కదా నువ్వు వెళ్లి నీ భార్యకు ఇచ్చే రేపు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అనగానే శీను అది నిజమే అనుకొని నమ్మి ఇంటికి చీరను తీసుకొని వెళ్తాడు. పల్లవి శీను ని ఫాలో అవుతుంది. శీను ఇంటికి వెళ్లిన పల్లవి అవని ఎక్కడా అని అడుగుతుంది ఇద్దరినీ చంప పగలగొడుతుంది కానీ అవని వెళ్లిపోయిందని కనుక చెప్తుంది. అవని వెళ్లిపోయిందా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక శీను కనకంని తిడతాడు. అమ్మ వెళ్లిపోయిందా అవని అమ్మని వెళ్ళగొట్టేసావు నువ్వే వెళ్లగొట్టింటావు నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అనేసి శీను తిడతాడు. అవని అమ్మ ఇప్పుడు ఎలాంటి సమస్యల్లో ఉందొ ఏంటో అనేసి భాధపడతాడు.. ఇక అవని బయలుదేరుతూ ఉంటుంది. స్వరాజ్యం రోడ్డు మీద వెళ్తుంటే ఆటో గుద్దేసి వెళ్ళిపోతుంది. స్వరాజ్యమును కాపాడి అవని ఇంటికి తీసుకెళ్తుంది. మా ఆయన వస్తాడు కాసేపు ఆగితే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతారు అయినా నువ్వు మీ వాళ్ళ విషయాల గురించి ఎందుకు చెప్పట్లేదు ఏదైనా సమస్యలో ఉన్నావా అనేసి అడుగుతుంది కానీ అవని మాత్రం ఏది చెప్పదు. అప్పుడే ఇంట్లోకి దయాకర్ వస్తారు. యాక్సిడెంట్ అయితే ఈ అమ్మాయి తీసుకొచ్చి వదిలిపెట్టిందండి అనేసి అనగానే ఈ అమ్మాయి నాకు ఎందుకు తెలియదు రాజేంద్రప్రసాద్ కోడలు కదా అనేసి అంటాడు.
మేము నీకు బంధువులం అవుతాము.. నువ్వేం బాధపడకు భయపడకు అనేసి దయాకర్ అంటారు. పరాయి వల్ల మేం కాదమ్మా మేము అని దయాకర్ అక్షయ్ కు మేనమామ అని నిజం చెప్తాడు. అయితే నేను ఇక్కడ ఉండడం పెద్ద సమస్య అండి మా ఇంట్లో వాళ్లకి తెలీదు నేను ఒక చిన్న సమస్యలో ఉన్నాను అనేసి అవని అంటుంది మీ ప్రవర్తన చూసి నువ్వు సమస్యలో ఉన్నావా అని అర్థమైంది కార్పోరేటర్ గా నీ సమస్య ఏంటో తీరుస్తాను అనేసి స్వరాజ్యం అంటుంది. ఏం లేదండి మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా నేను బయటున్నాను అనేసి అవని అంటుంది మీ సమస్య ఏదో కానీ ఆ సమస్య పూర్తయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అనేసి స్వరాజ్యం అంటుంది. ఇక దయాకర్ కూడా నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు అమ్మ అనేసి అంటాడు. నేను మీ ఇంట్లో ఉండడం నాకు ఇబ్బంది కాదు బాబాయ్ గారు మీ ఆవిడ కార్పొరేటర్ కదా ఆవిడను కలవడానికి చాలామంది వస్తారు నేను ఇక్కడ ఉన్న విషయం మా ఇంట్లో వాళ్లకి చెప్పేస్తారు అని అనగానే నువ్వేం బాధపడకు అమ్మ తను కార్పొరేటర్ కాదు కార్పొరేటర్ అవ్వాలని కోరికతో ప్రజలకు మంచి చేయాలనుకుంటుంది ఒకప్పుడు నేను పచ్చి తాగుబోతు లాగా ఉండేవాడిని ఇప్పుడు నన్ను కార్పోరేటర్ అయితే నాకు చెడ్డ పేరు వస్తుందని తాగుడు మానిపించింది నా భార్య నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడే అనేసి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..