Yograj Singh – MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఆ మధ్య టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత జట్టుకు టి-20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీలను అందించిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ పై యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ధోని వల్లే తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్ నాశనం అయిందని అన్నారు.
Also Read: Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అతనే.. అధికారిక ప్రకటన వచ్చేసింది !
తన కుమారుడి కెరీర్ ని నాశనం చేసిన ధోనీని తాను ఎప్పటికీ క్షమించబోనని ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. “ధోని ఎంతో ఫేమస్ క్రికెటర్.. కానీ అతడు {Yograj Singh – MS Dhoni} నా కుమారుడుకి చేసిన అన్యాయం మాత్రం క్షమించరానిది. అతడు ఏం చేశాడో ప్రతి ఒక్క విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఇంకో ఐదేళ్లు ఆడగలిగే నా కుమారుడి కెరీర్ ని ధోని నాశనం చేశాడు. క్యాన్సర్ తో బాధపడుతూ దేశం కోసం ఆడి ప్రపంచకప్ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్ కి భారతరత్న ఇవ్వాలి” అని కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలు చేసి ఐదు నెలలు గడవకముందే మాట మార్చారు యువరాజ్ సింగ్ తండ్రి. నిత్యం ధోనీని విమర్శించే యువరాజ్ సింగ్ తండ్రి తొలిసారి ధోనిపై ప్రశంసల వర్షం కురిపించడంతో ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని గురించి యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ మాట్లాడుతూ.. ధోనీ వైఖరి ధైర్యంగా ఉంటుందని ప్రశంసించాడు.
“అతడు ఓ మోటివేటెడ్ కెప్టెన్. గ్రౌండ్ లో తోటి ఆటగాళ్లు ఎలా ఆడాలో మార్గ నిర్దేశం చేస్తాడు. అతడిలో అత్యుత్తమమైన విషయం ఏంటంటే.. బాల్ ఎక్కడ వేయాలో బౌలర్లకు స్పష్టంగా చెప్పగలడు. వికెట్ల వెనక నుండి బ్యాటర్ మనసును చదవగలడు. అలాగే అతడు భయం లేని వ్యక్తి. మీకు గుర్తుండే ఉంటుంది. ఒకసారి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బౌలర్ మిచల్ జాన్సన్ బంతిని నేరుగా ధోని హెల్మెట్ కి విసిరేశాడు. కానీ ధోని ఏమాత్రం భయపడలేదు. ఆ తరువాత బంతిని సిక్స్ గా మలిచాడు. ధోని లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు” అని అన్నాడు యోగరాజ్ సింగ్.
Also Read: India Women Team Record: వన్డేల్లో మహిళల జట్టు సరికొత్త రికార్డు…హైయెస్ట్ టోటల్ నమోదు.. ఎంతంటే?
అయితే యువరాజ్ సింగ్ కెరీర్ విషయంలో ధోనిపై చాలాసార్లు విమర్శలు గుప్పించిన యోగరాజ్.. ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చడంతో అంతా అయోమయానికి గురవుతున్నారు. బహుశా ఈయనకు పిచ్చెక్కిందేమోనని కామెంట్స్ చేస్తున్నారు. ఇక 1980 డిసెంబర్ 21వ తేదీన బ్రిస్ బెన్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో యోగరాజ్ తన అంతర్జాతీయ క్రికెట్ ని ఆరంభించాడు. కానీ అతడి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కేవలం మూడు నెలలకే పరిమితమైంది. అతడు తన కెరీర్ లో కేవలం ఒక టెస్ట్, ఆరు వన్డేలు మాత్రమే ఆడాడు. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సినిమాలలో నటించాడు.