E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి అశ్విన్ ల మధ్య గొడవేంటి..? ప్రణతికి టెన్షన్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్…

Intinti Ramayanam Today Episode: పల్లవికి అశ్విన్ ల మధ్య గొడవేంటి..? ప్రణతికి టెన్షన్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్…
Advertisement

Intinti Ramayanam Today Episode july 12th: అశ్విన్ తన ఫ్రెండ్ తో పార్టీ చేసుకోవాలని అనుకుంటాడు. అయితే తన ఫ్రెండు ఏంట్రా ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. నేరుగా నువ్వు రావడంతోనే పల్లవిని కలిసావని తెలుస్తుంది.. పల్లవి ని అసలు ఎందుకు కలిశావు. ఇప్పుడు తను తన ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏం చేశావు అని అడుగుతాడు. మనకి మంచి చేసిన వాళ్ళనైనా గుర్తుపెట్టుకోపోవచ్చు. కానీ చెడు చేసిన వాళ్ళని మాత్రం అస్సలు మర్చిపోవద్దు అని అంటాడు. నా జీవితాన్ని ఇలా నాశనం అవ్వడానికి కారణం అయిన పల్లవిని అస్సలు వదిలిపెట్టను. తన జీవితం నాశనం అయ్యేలా చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అటు భరత్ ప్రవర్తన గురించి ప్రణతి టెన్షన్ పడుతూ ఉంటుంది. పల్లవికి కొత్త టెన్షన్ మొదలవడంతో ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది.

ప్రణతికి టెన్షన్ తప్పదా..?

ప్రణతి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకు ప్రణతి ఆలా టెన్షన్ పడుతున్నావు. అక్కడికి ఏమీ జరగదు అని అవని ఎంత చెప్తున్నా సరే తను మాత్రం భయంగా ఉంది వదిన అని అంటుంది. భరత్ ఎంత చెప్పినా వినడం లేదు. ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళాలి అని పట్టు పట్టి కూర్చున్నాడు. చక్రధర్ మామయ్య ఆ ఇంటికి వస్తానని అనడంతో భరత్ ఇవాళ మనం హోటల్లో ఉండి రేపు వేరే ఇంటికి వెళ్దామని అంటున్నాడు.. నాకు ఏమీ అర్థం కావడం లేదు వదినా అని ప్రణతి కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వేమీ కంగారు పడకు.. వాడు ఏదైనా ఆలోచించే చేస్తాడు అని అవని అంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి భరత్ అనే నేను చెప్తాను నువ్వేమీ భయపడకమ్మా అని అంటుంది. ప్రణతి వెళ్దామా ఇంకా అని భరత్ వస్తాడు.. ఎక్కడికి వెళ్తున్నారు రా అని అవని అడుగుతుంది. ఈ టైంలో హోటల్ కి ఎందుకు ఇక్కడే ఉండి రేపు వెళ్లొచ్చు కదా అని భరత్ ని అవని అడుగుతుంది.. అదే ఇంటికి వెళ్తున్నాము అని భరత్ చెప్పగానే వాళ్ళు కాస్త షాక్ అవుతారు..

భరత్ ను నేను కొడతాను..

Advertisement

ప్రణతి నువ్వేం టెన్షన్ పడకు. అవును ప్రణతి నువ్వేం టెన్షన్ పడకు ఏ ఇంటికైతే వద్దు అని అన్నాడు అదే ఇంటికి వెళ్దాం అని అంటున్నాడు కదా నువ్వేమీ బాధపడవద్దు అని అవని అంటుంది. చక్రధర్ మామయ్య అక్కడ ఉండడంతో భరత్ ఎలాంటి గొడవలు చేస్తాడో అర్థం కావడం లేదు వదిన అని కంగారు పడుతుంది. వాడి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడు బాగానే ఉంటాడు అని అవని అంటుంది. కమల్ ప్రణతి నిన్ను వాడు కొట్టిన తిట్టినా నాకు ఒక ఫోన్ చెయ్యి నేను వాడు సంగతే చూస్తాను అని కమలంటాడు.. భరత్ అలా మారడానికి కారణం రాజేశ్వరి పిన్ని. అంతే తప్ప వాడు మూర్ఖుడు మాత్రం కాదు అని అవని అంటుంది. రాజేశ్వరి అత్తయ్య ఒకటే కాదు వదిన పల్లవి కూడా భరత్ కి లేనిపోనివి చెప్పి తన మనసుని పాడు చేసింది అని కమలంటాడు.

భరత్ ను మార్చే ప్రయత్నం చెయ్యాలి..

అవని భరత్ ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా మారిపోయాడు కదా.. ఆ తల్లి కూతుర్లు మన మీద పగతో భరత్ నీ రెచ్చగొట్టారు. నా కన్న తల్లిని కూడా భరత్ పట్టించుకోకుండా ఉన్నాడు అంటే కారణం దానికి పల్లవి రాజేశ్వరి పిన్ని అని అంటుంది. అది నిజం వదిన. ఒకప్పుడు భరత్ చాలా సంతోషంగా సరదాగా ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. శ్రేయ ని ఎలాగైతే మార్చామో ఇప్పుడు అలాగే భరత్ ని కూడా మారుద్దామని అవని అంటుంది. నీకోసం భరత్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు నువ్వు జాగ్రత్తగా వెళ్ళమని పార్వతి అంటుంది. ప్రణతి బైటికి వెళ్ళిపోతుంది.

పల్లవిని టెన్షన్ పెడుతున్న అశ్విన్..

Advertisement

పల్లవి అశ్విన్ మళ్లీ తన జీవితంలోకి వచ్చాడు అంటే తనని ఏదో ఒకటి చేసేలా చేస్తాడు అని భయపడిపోతూ ఉంటుంది. ఇక ఫోన్ పక్కన పెట్టేసి స్నానం కోసమని వెళ్తుంది. పల్లవి ఫోన్ కి కంటిన్యూగా మెసేజ్లు రావడంతో భరత్ ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు అని అనుకుంటూ ఫోన్ పట్టుకుని చూస్తూ ఉంటాడు.. అప్పుడే సడన్ గా వచ్చిన పల్లవి ఆ ఫోను లాగేసుకుంటుంది. ఇందాకడి నుంచి నీ ఫోన్ కి తెగ మెసేజ్లు వస్తున్నాయి ఎవరో చూద్దామని ఇలా ఫోన్ పట్టుకున్నాను అని కమలంటాడు. అవి ఏవో కంపెనీ మెసేజ్ లే బావ వాటి గురించి నువ్వేం పట్టించుకోవద్దు అని పల్లవి కమల్ కి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది..

10 లక్షలు ఇవ్వాలని అశ్విన్ డిమాండ్..

తర్వాత రోజు ఉదయం పల్లవిని ఎలాగైనా సరే కలవాలి అని అశ్విన్ మెసేజ్ చేస్తాడు. తన మెసేజ్ చూసుకుని పల్లవి అశ్విన్ తో ఎలాగైనా సరే ఇవాళ మాట్లాడాలి అని అనుకుంటుంది. అశ్విన్ ఎందుకు నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు. నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఎలా వదిలేస్తాను అని అశ్విన్ అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు నీకేం కావాలి నా మీద రివెంజ్ తీర్చుకోవడం కావాలా అని పల్లవి అడుగుతుంది. నీ ఆస్తులు నీకు తిరిగి వచ్చేసాయి కదా నాకు పది లక్షలు కావాలి అని అనగానే పల్లవి ఫ్యూజుల్ఎగిరిపోతాయి.. పది లక్షలు ఇప్పుడు ఎక్కడ నుంచి తీసుకురావాలి అని పల్లవి అంటుంది. ఇవ్వకపోతే నేరుగా నేను నీ ఇంటికి వస్తాను అని అశ్విన్ బెదిరిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి నిజం చెప్పిన నర్మద.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. చందు మాటతో కన్నీళ్లు..

Related News

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Big Stories

Advertisement
×