E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. బాబు పేరుకు ఫిదా.. దొంగగా మారిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. బాబు పేరుకు ఫిదా.. దొంగగా మారిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode july 15th: బాబు కోసం నేను ఈ కడియాలు చేయను చేయించాను అత్తయ్య బారసాల కోసం ఇవి బాగుంటాయి కదా అని అవని చూపిస్తుంది. బాబు మన ఇంటికి ఎంతో కలను తీసుకుని వచ్చాడు వాడి కోసమే ఇవన్నీ చేయించాను అని అవని అంటుంది.. అవన్నీ చూసిన పార్వతీ నువ్వు చాలా మంచి దానివి అవని.. నేను అనుకునే లోపల అన్ని చేసేస్తావు… చాలా మంచి దానివి అవని అని పార్వతీ పొగిడిస్తూ ఉంటుంది.. అనాధగా నేను మీ ఇంట్లోకి వచ్చిన మీరు చూపించిన ప్రేమ మీ అలవాట్లే నాకు వచ్చే అత్తయ్య అని అంటుంది..

పల్లవి మాటతో అంతా షాక్..

అందరూ బాబుతో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. బాబుతో చాలా సంతోషంగా అందరూ ఆడుకుంటూ ఉంటారు.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన పల్లవి వాళ్ళందరిని చూసి కుళ్ళుకుంటుంది.. బాబు రావడంతో వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంది. అయితే భానుమతి దగ్గర చూసి వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు చూసావా అని అంటుంది. ఇక భానుమతి కూడా మనసులోనే నీకు కూడా ఒక బాబు పాప పుట్టింటే వాళ్ళు నీ పాపని కూడా ఇలానే ఎత్తుకునే వాళ్ళు అని భానుమతి అనుకుంటుంది. ఇక పార్వతి అప్పుడప్పుడు పిల్లల్ని ఎత్తుకుంటే ఆ దేవుడు నీకు కూడా పిల్లల్ని పుట్టే అవకాశం ఇస్తాడు కదా అంటుంది.. అయితే అవని కూడా అదే మాట అనడంతో నాకు పిల్లలు అంటే ఇష్టం లేదు అని ఒక్క మాటతో అనేసి అందరికి షాక్ ఇస్తుంది.

అడ్డంగా దొరికిపోయిన శ్రీయ..

Advertisement

రాత్రి శ్రీకర వచ్చేటప్పుడు ఎవరికి తెలియకుండా పిజ్జా తీసుకురమ్మని శ్రీయ చెప్తుంది. శ్రీకర్ ఏంటి ఎవరికీ తెలియకుండా దొంగ చాటుగా తీసుకొని రమ్మన్నావు అని అంటాడు. నువ్వు ఇంకా రాలేదు అని తెచ్చావా అని అడుగుతుంది. నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కూడా కాదు బాలింతవి.. అయితే నువ్వు ఇలా ఇలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు శ్రేయ అని శ్రీకర్ ఎంత చెప్తున్నా సరే వినకుండా తను వెజ్ కదా తింటే ఏం కాదులే అని అంటుంది.. అప్పుడే పార్వతి అవని శ్రియ దగ్గరికి వచ్చి ఇలాంటివన్నీ నువ్వు తినకూడదమ్మా అని అనగానే ఫీలవుతుంది.. నీ హెల్త్ కోసం అలాగే బాబు హెల్త్ కోసమే కదా కొద్ది రోజులు మాత్రమే అని అవని భోజనం తీసుకుని వచ్చి తినిపిస్తుంది.. అమ్మలేని లోటుని తీర్చావ్ అక్క అని ఎమోషనల్ అవుతుంది శ్రీయ.

బాబుకు పేరు పెట్టిన అవని..

ఇక రాత్రి భోజనం చేసిన తర్వాత అక్షయ్ అందరిని హాల్లోకి రమ్మని చెప్పాడు.. అందరూ హాల్లోకి రాగానే ఏంటి అన్నయ్య అన్నం పిలిచావట అని అందరూ అడుగుతారు. ఏం లేదురా రేపు బాబుకి బారసాల చేయాలని అనుకున్నాం కదా.. మరి పేరు పెట్టాలి కదా అని అక్షయ్ అంటాడు. మరి ఏ పేరు పెట్టాలో ముందుగానే ఆలోచించాలి కదా మీరు ఆలోచించారా అని అక్షయ్ అడుగుతారు.. అవును కదా పేరు పెట్టాలి కదా మేము ఇంతవరకు ఏమీ ఆలోచించలేదు అనే శేఖర్ అనగానే అందరూ ఇప్పుడు ఏ పేరు పెట్టాలో ఆలోచిద్దామని అంటారు. మరి అందరూ కలిసి రాజేంద్రప్రసాద్ పేరు కలిసి వచ్చేలా రవీంద్ర ప్రసాద్ అని పేరుని ఫిక్స్ చేస్తారు. అందరూ ఆ పేరు చాలా బాగుంది అని అనుకుంటారు. మొత్తానికి బాబుకి పేరు పెట్టడానికి ఫిక్స్ చేసిన పేరు చాలా బాగుంది అని అందరూ సంతోషంగా ఉంటారు.

శ్రీకర్ మాటతో శ్రీయా హ్యాపీ..

Advertisement

ఇక శ్రీకర్ రాగానే శ్రీకర్ వచ్చావా బాబు పేరు చాలా బాగుంది కదా అని శ్రీ అంటుంది. అయితే మనము బాబు ఏం చదవాలి అన్నది ఇప్పటినుంచి ఆలోచిస్తేనే కదా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అని తను అనగానే శ్రీకర్ అన్ని మనమే ఆలోచించకూడదు వాడికి ఏం కావాలో వాడినే ఆలోచించుకునేలా చేయాలి అని అంటాడు. అవును శ్రీ నువ్వు చెప్పింది కూడా నిజమే వాళ్లకి కూడా ఆలోచించుకునే శక్తి ఇవ్వాలి. ఏం కావాలనుకుంటే అది అవుతాడు అని శ్రేయ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

దొంగతనం చేసిన పల్లవి..

పల్లవి అశ్విన్ 10 లక్షలు ఇవ్వాలని అన్న మాటని తలుచుకొని నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తుంది.. వాడికి డబ్బులు ఇవ్వకపోతే నన్ను జైలుకు పంపిస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఎలాగైనా సరే వాడికి డబ్బులు ఇవ్వాలి.. బాబు కోసం చేయించిన కడియాలను దొంగతనం చేసి వాటిని అమ్మేసి వాడికి డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటుంది.. కమల్ నిద్రపోయాడని తెలుసుకొని ఆ కడియాలన్ని దొంగతనం చేసేందుకు పార్వతి గదికి పల్లవి వెళ్తుంది.. పల్లవి మొత్తానికి దొంగతనం చేసేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో బారసాలను గ్రాండ్ గా చేస్తారు. మరి పల్లవి దొంగతనం చేసిన కడియాలను ఎలా తెప్పిస్తాడు అన్నది చూడాలి..

Also Read : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు..?

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Big Stories

Advertisement
×