Intinti Ramayanam Today Episode july 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఫోన్ తీసుకొని పార్వతి ఫోన్ చేసిందని తెలుసుకొని మళ్లీ ఫోన్ చేస్తాడు.. ఏంటమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేసావ్ సైలెంట్ లో ఉండింది నేను చూసుకోలేదు అమ్మ ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని అబద్ధం చెప్తాడు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నానమ్మ నువ్వు అక్కడ ఎంత కష్టపడుతున్నారో తెలుసుకోవాలని నేను మీ నాన్నకు ఫోన్ చేస్తే అవ్వని ఫోన్ లిఫ్ట్ చేసి ఎటకారంగా ఫోన్ మాట్లాడింది. మీ అబ్బాయి నా దగ్గరకు వచ్చేస్తాడని మీరు భయపడుతున్నారా అది ఇది అని ఏదో మాట్లాడింది. దానికి బుద్ధి చెప్పకుండా మీ నాన్న కూడా వత్తాసు పాడారు అని పార్వతి అంటుంది. పార్వతికి అవని దగ్గర ఉన్న విషయం తెలిస్తే పెద్ద గొడవ చేస్తుందని అక్షయ్ కూడా అబద్దం చెప్తాడు. అది విన్న ఇంట్లోని వాళ్లంతా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ తలనొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటాడు. తలనొప్పి ఉందని చెప్పారంట కదా మీకు జండుబాం రాస్తానని అంటుంది. ఆల్రెడీ టాబ్లెట్ వేసుకున్నాను ఇంకా ఇదే ఎందుకు అని అక్షయ్ అడుగుతాడు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా ఇది కాస్త రాస్తే తొందరగా తగ్గుతుందండి ఆరాధ్యతో మీరు చెప్పారు అంట కదా అందుకే బాంబు తీసుకొని వచ్చాను అని అవని అవని అంటుంది. అవని ప్రేమగా అక్షయ్కు జండుబాం రాసి వెళుతుంది.
భానుమతి తన భర్త ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉంటుంది.. మా ఆయన ఇంట్లో ఉంటే వస్తానని చెప్పాడు కదా ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి భానుమతి అని ప్రేమగా ఒక పిలుపు వినిపిస్తుంది. ఆ మాట వినగానే భానుమతి సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఏంటండీ ఇంత లేటుగా వచ్చారు మీరు ఇంకా స్వర్గంలో రంభ ఊర్వశిలతో ఉన్నారనుకున్నాను. అక్కడ చాలామంది ఉంటారు. కానీ నీలాంటి వాళ్ళు ఉండరు కదా నీ అంత అందగత్తె ఉండరు కదా అని కమలాకర్ వేషంలో ఉన్న కమల్ పొగడ్తలతో ముంచెత్తుతాడు.
భానుమతిని తన మాటలతో మాయ చేస్తుంటాడు కమల్. అప్పుడే అవని అమ్మమ్మ గారు భోజనానికి రండి అని పిలవడానికి లోపలికి వస్తుంది. ఆ మాట వినగానే భానుమతి షాక్ అయి లేచి నిలబడుతుంది. ఏమి భాను నీకు తప్ప వాళ్ళు ఎవరికీ నేను కనిపించని అని కమలంటాడు. అవని ఇక్కడ ఈ రూమ్ లో నేను తప్ప ఇంకెవరైనా నీకు కనిపిస్తున్నారా అని కన్ఫామ్ చేసుకునేందుకు భానుమతి అడుగుతుంది. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరు లేరు అమ్మమ్మ గారు మీరు భోజనానికి వస్తారని పిలవడానికి వచ్చాను అని అవని అంటుంది.
నిజంగా నీకు ఎవరు కనిపించలేదా అని భానుమతి మరోసారి అడుగుతుంది. నాకు ఎవరు కనిపించలేదు అమ్మమ్మ గారు మీరు భోజనానికి రండి అంటే సరే నేను వస్తాను నువ్వు వెళ్ళు అని అవనితో అంటుంది. ఇక భానుమతితో మాట్లాడిన తర్వాత కమల్ బయటికి రాగానే అవని తనని లాక్కుని పక్కకు వెళ్ళిపోతుంది. అన్నయ్య కలవాలంటే నానమ్మని ఇలా బిల్డి కొట్టించాల్సిందే అని అంటాడు. రాత్రి అక్షయ్ కి ఆకలి ఇస్తూ ఉంటుంది నిద్ర పట్టకుండా ఉండడంతో అటు ఇటు కదులుతూ ఒక్కసారిగా లేస్తాడు.
అవని ఏమైందండీ అని అడిగితే మొహమాటంగా నాకు ఆకలేస్తుంది అని అక్షయ్ చెప్తాడు. మీకోసం తినడానికి ఏదైనా తీసుకొస్తానని అవని వెళ్ళగానే.. రాజేంద్రప్రసాద్ వచ్చి నీకు ఇలాంటి భారీ దొరకడం నీ అదృష్టం రా.. అందరూ బెడ్ పైన పడుకుంటే తను మాత్రం నీకు ఏదైనా అవసరం ఉంటుందని నేలపై పడుకుంది ఆలోచించు నువ్వు అవని ఎలాంటిదో అని సలహా ఇచ్చి వెళ్తాడు. అవని ఫ్రూట్స్ తెచ్చి ఇవ్వగానే అక్షయ్ వాటిని తినడానికి మొహమాట పడతాడు. అవని నేను పడుకుంటాను మీరు తినండి అని అంటుంది. అక్షయ్ తినేసి పడుకుంటాడు.
Also Read:బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన బాలయ్య బ్యూటీ..
పల్లవి అర్ధరాత్రి అటూ ఇటూ తిరుగుతూ ఆ రోజు నగలు కొట్టేసింది నిజంగానే కమల్ బావ. శ్రీయా అన్నట్లు బావే ఆ నగలను కొట్టేసాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి అర్ధరాత్రి అటూ ఇటూ తిరుగుతూ ఉండటం చూసిన శ్రియ.. ఏంటి నన్ను ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నావా అని పల్లవి తో అంటుంది. నీ గురించి తప్ప నాకు వేరే పని ఏం లేదా అని పల్లవి అంటుంది. మా బావ దొంగతనం చేశాడంటే కచ్చితంగా శ్రీకర్ బాబు కూడా హెల్ప్ చేశారని నాకు అనుమానం వస్తుంది అని అనగానే.. మీ ఆయన దొంగతనం చేశాడంటే నమ్మొచ్చు మా ఆయన జోలికొస్తే మర్యాదగా ఉండదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి ఇది తింగరిదా అనుకున్నా.. పిచ్చిది కూడా అని అర్థమవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి అనుమానం నిజం అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..